గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
అటవీ తాజా, సేంద్రీయ శ్రేణికి చెందిన రోగనిరోధక శక్తిని పెంచే, ప్రభావితం చేసే ఉత్పత్తుల శ్రేణిని ట్రైబ్స్ ఇండియాలో విడుదల
Posted On:
07 DEC 2020 5:38PM by PIB Hyderabad
లక్షలాది గిరిజన సంస్థలకు పెద్ద మార్కెట్లను అందుబాటులోకి తెస్తూనే, తన ఉత్పత్తులను విస్తరిస్తూ, వాటిని మరింత ఆకర్షణీయం చేస్తూ ట్రైబ్స్ ఇండియా 46 కొత్త గిరిజన ఉత్పత్తులను అదనంగా తన జాబితాలో ఈ వారం జోడించింది. ఇందులో ముఖ్యంగా తాజా, సేంద్రీయ శ్రేణికి చెందిన అటవీ ఉత్పత్తులు ఉన్నాయి. తాజా, సేంద్రీయ అటవీ ఉత్పత్తుల శ్రేణిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే పలు ఉత్పత్తులను, గిరిజన కళలు, హస్తకళలను గత నెలలో ట్రైబ్స్ ఇండియా శ్రేణిలో చేర్చింది. గత కొద్ది వారాలలో ఈ కొత్త ఉత్పత్తులను 125 ట్రైబ్స్ ఇండియా దుకాణాలలో, ట్రైబల్ ఇండియా మొబైల్ వాన్లు, ట్రైబ్స్ ఇండియా ఇ- మార్కెట్ ప్లేస్ (ట్రైబ్్స ఇండియా. కామ్), ఇ-టైలర్లలో ప్రవేశపెట్టడం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, గిరిజనజీవితాలను పరివర్తన చేసి, వారి జీవనోపాధులను మెరుగుపరచేందుకు, ప్రభావితం చేసేందుకు ట్రైబ్స్ ఇండియా కృషి చేస్తోందని ట్రైఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీర్ కృష్ణ. స్థానిక ఉత్పత్తుల కోసం గొంతెత్తండి, స్థానిక ఉత్పత్తుల కోసం గిరిజన ఉత్పత్తులను చూడండి (గో వోకల్ ఫర్ లోకల్ గో ట్రైబల్) అన్న మంత్రంతో ట్రైఫెడ్ దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనులకు లబ్ధి చేకూరుస్తూ, వారి జీవనోపాధులను మెరుగుపరుస్తూ పని చేస్తుంది. భారతదేశ వ్యాప్తంగా ఉన్న గిరిజనుల నుంచి సేకరించిన కొత్త ఉత్పత్తులను ఈ శ్రేణిలో జత చేయడం అన్నది ఈ దిశలో మరొక అడుగు అని చెప్పవచ్చు.
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించి, నేడు ప్రారంభించిన ఉత్పత్తులలో, జార్ఖండ్‌కు చెందిన ఒరాన్ గిరిజనులు ఉత్పత్తి చేసిన కొబ్బరి, నువ్వులు, బాదం, శనగపిండి, వెన్నతో కూడిన ఆరోగ్యవంతమైన, రుచికరమైన బిస్కెట్లు ఉన్నాయి. సేంద్రీయ ఉత్పత్తి శ్రేణిలోని 10 ఉత్పత్తులు తమిళనాడులోని మలయాలీ గిరిజనుల నుంచి సేకరించారు. ఇందులో సేంద్రీయ బజ్రా, సేంద్రీయ ఉలవలు, సేంద్రీయ చిరుధాన్యాల బిస్కెట్లు, సేంద్రీయ చిరు ధాన్యాలు వరి రకాలు, పసుపు పొడి, హర్బల్ సబ్బులు ఉన్నాయి. అలాగే ఒడిషాకు చెందిన ఖోండ్ తెగ నుంచి ఈ వారం 5 ఉత్పత్తులను సేకరించారు. ఇందులో సేంద్రీయ బంకతో చేసిన అగరబత్తులు, ఒడిషాకు చెందిన 300కన్నా ఎక్కువ మంది గిరిజన మహిళలు దంచిన సేంద్రీయ మెంతి పొడి, శొంఠి పొడి, ధనియాల పొడి, పంచపుటనా ( పోపు సామాగ్రి) ఉన్నాయి. ఇందులో ఛత్తీస్‌గఢ్కు చెందిన మరియా, ముడియా, గోండ్ గిరిజనుల నుంచి నేరుగా సేకరించిన తాజా అటవీ తేనె కూడా జోడించారు. ఈ తేనె స్వచ్ఛమైంది, ఇందులో ఇతర పదార్ధాలు కలపలేదు. నేడు ప్రారంభించిన ఉత్పత్తులలో ధృవీకరించిన వన తులసి తేనె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇతర ఉత్పత్తులలో దేశవాళీ నెయ్యి, పసుపు సుగంధ తైలం, దేశవాళీ వరి, చిలగడదుంప చిప్స్ ఉన్నాయి. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఆరు ఉత్పత్తులను జోడించారు. ఇవన్నీ కూడా ప్రధానంగా హెర్బల్ ఉత్పత్తులు, ఉసరిక రసం, ఖర్జూర్ బాస్కెట్, సోంప్ ఉన్నాయి.అహ్మదాబాద్ నుంచి 10 ఆయుర్వేద ఉత్పత్తులను జోడించారు. ఇందులో ఉసరి పొడి, పసుపు పొడి, రసాయ పొడి, బ్రాహ్మీ పొడి, అశ్వగంథ పొడి, అమృత ఉన్నాయి. ఇవన్నీ కూడా గుజరాత్‌లోని వివిధ తెగల నుంచి సేకరించినవి, రోగనిరోధక శక్తిని పెంచే సేంద్రీయ ఉత్పత్తులు.
స్థానిక ఉత్పత్తుల కోసం గొంతెత్తండి, స్థానిక ఉత్పత్తుల కోసం గిరిజన ఉత్పత్తులను చూడండి (గో వోకల్ ఫర్ లోకల్ గో ట్రైబల్) అన్న మంత్రంతో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద చేస్తున్న ట్రైఫెడ్ దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనులకు లబ్ధి చేకూరుస్తూ, వారి జీవనోపాధులను కూడా మెరుగుపరుస్తోంది. ఇటీవలే ప్రారంభించిన ట్రైబ్స్ ఇండియా ఇ- మార్కెట్ ప్లేస్ అన్నది భారతదేశంలోని అతిపెద్ద హస్తకళలు, సేంద్రీయ ఉత్పత్తుల మార్కెట్. ఇక్కడ గిరిజన ఉత్పత్తులు, హస్తకళలను దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు అందుబాటులోకి తెస్తోంది.
***
(Release ID: 1678964)
Visitor Counter : 177