ఆయుష్
21వ శతాబ్దంలో ప్రకృతివైద్యానికి ప్రాధాన్యం పెరగనుండటంతో పుణేలో నిసర్గ్ గ్రామం పేరిట ప్రకృతివైద్యానికి సంబంధించిన స్థావరాన్నిఅభివృద్ధి చేయనున్న కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ
Posted On:
03 DEC 2020 3:13PM by PIB Hyderabad
పుణే దగ్గరలోని ఉరులి కంచన్ గ్రామంలో “నిసర్గ్ ఉపచార్” పేరిట 1946లో మహాత్మా గాంధీ ప్రారంభించిన ప్రకృతి వైద్యానికి సంబంధించిన ప్రచారాన్ని గుర్తుచేసుకుంటూ అదే ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న జాతీయ ప్రకృతి వైద్య సంస్థ(ఎన్ఐఎన్)ను “నిసర్గ్ గ్రాం” వ్యవహరించాలని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం బాపు భవన్ కు సుమారు 15 కి.మీ దూరంలో ఉన్న ఈ సంస్థలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వివిధ ఆవిష్కరణలు మరియు ప్రకృతి వైద్యానికి సంబంధించిన విద్యావిషయిక కోర్సులను ప్రవేశపెట్టనున్నారు.
ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే పుణేలోని ఎన్ఐఎన్ వ్యవస్థాపకుల్లో ఒకరైన మహాత్మగాంధీ కాగా ప్రకృతి వైద్యం విషయంలో ఆయన ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్నది. ప్రస్తుతం ఎన్ఐఎన్ పనిచేస్తున్న ప్రాంతంలోని 1945లో మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ఏర్పరచగా ఈ సంస్థను ఇదివరలో ఆల్ ఇండియా నేచర్ క్యూర్ ఫౌండేషన్ అని పిలిచేవారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ వారు దీనికి అదనంగా మరింత పెద్దగా నిసర్గ్ గ్రాంను ఏర్పాటు చేయనున్నారు. ఈ నిసర్గ్ గ్రాంలో ప్రకృతి వైద్యానికి సంబంధించిన బోధనా ప్రణాళికలు జాతీయ విద్యావిధాంనం 2020 ప్రకారం తయారు చేయబడతాయి. ఈ బోధనా ప్రణాళికలు నాణ్యతతో కూడుకుని బోధనా శాస్త్ర సంబంధితంగా ఉండటంతో పాటు ముఖ్యంగా యుజి మరియు పిజి స్థాయిలో నేచురోపతి కోర్సులు అందించబడతాయి. అందుకుగాను భారతదేశంలోను మరియు ఇతర దేశాల్లోను నేచురోపతిలో అందిస్తున్న కోర్సులను అధ్యయనం చేస్తోంది ఎన్ఐఎన్. ఈ నూతన బోధనా ప్రణాళికలో ఆరోగ్య సంబంధమైన గాంధీ గారి సూత్రాలను మరియు శాస్త్ర పరంగా ఆధునిక పోకడలను చేర్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ కోర్సులు నేచురోపతి పరిజ్ఞానముతోపాటు నైపుణ్య, సామర్థ్యాభివృద్ధికి సంబంధించిన కోర్సులను ఎంచుకునే విధంగా, ప్రస్తుత మరియు రానున్న ఆరోగ్య సంబంధిత అవసరాలను తీర్చే విధంగా ఈ ప్రణాళికను రూపొందించనున్నారు.
నిసర్గ్ గ్రాంలో అందించనున్న నేచురోపతిలోని డాక్టోరల్ కోర్సులు దేశంలో మొదటివి కాగా అవి దేశంలో నేచురోపతి మరియు యోగా విద్యను మరింత పటిష్టం చేయనున్నాయి. ఇందులో గురుల పద్దతిలో అధ్యాపకులు, విద్యార్థులు మరియు రోగులు అందరూ ఒకే చోట ఉంటారు. ప్రకృతి నుండి అంశాలను గ్రహించుకుని, సమన్వయపరచుకునే పద్ధతిలో ఉండే విధంగా రూపొందించారు. నేచురోపతి థేరపి మరియు ప్రక్రియకు సంబంధించిన వివిధ తక్కువ సమయంలో పూర్తయ్యే కోర్సుల్లో విదేశీ విద్యార్థులకు చేరడానికి అవకాశం కల్పించి వారి నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి అవకాశం కల్పించనున్నారు. సామాజిక సేవకు సంబంధించిన కార్యక్రమాల్లో చేరడానికీ ఇక్కడ అవకాశం ఉంటుంది. పరిశోధనకు మరియు బోధనకు మధ్యగల సంబంధాన్ని ఈ నేచురోపతిలో మనం చూడవచ్చు. ఇందులో చికిత్సా సంబంధిత, విద్యాసంబంధిత పరిశోధనలను కూడా అందిస్తారు.
శిక్షణ మరియు ఇంటర్న్షిప్, మార్గదర్శకత్వంలో గాంధేయవాదంతో పనిచేసే ఇతర సంస్థలతో కలిసి పరిశోధనలు చేపట్టడం మరియు ఇతర సంస్థలతో కలిసి పనిచేయడం అనేది నిసర్గ్ గ్రాం ఉన్నతికి సంబంధించి కీలకాంశం. ప్రజారోగ్యం, గ్రామీణాభివృద్ధి మరియు ఇతర సామాజికశాస్త్రాలతోపాటు గాంధేయవాద సూత్రాలను పాటించడం వలన త్వరిత వృద్ధితోపాటు ప్రపంచంలో మరింత గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది. ఈ నిసర్గ్ గ్రాంలో అందించే కోర్సులు సంస్థ భవిష్యత్తుకు, శాస్త్ర పరమైన విధానానికి, గాంధేయవాద స్ఫూర్తికి మరియు సామాజిక సమన్వయానికి అనుకూలంగా ఉంటాయి.
****
(Release ID: 1678068)
Visitor Counter : 252