శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ఐఐఎఫ్ ఎస్ క‌ర్టెన్ రైజ‌ర్ ఈవెంట్ నిర్వ‌హించ‌నున్న సిఎస్ఐఆర్‌- ఎన్ ఇఐఎస్‌టి ‌

భార‌తీయ శాస్త్ర‌వేత్త‌లు సాదించిన విజ‌యాల‌ను ,శాస్త్ర‌విజ్ఞానాన్ని ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు దీసుకువెళ్ల‌డం దీని ల‌క్ష్యం : సిఎస్ఐఆర్ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ శేఖ‌ర్ సి మండే.

శాస్త్ర‌విజ్ఞానంలో ప్ర‌జ‌ల‌ను పాలుపంచుకునేలా చేయ‌డం, శాస్త్ర‌విజ్ఞానం ఇంజ‌నీరింగ్‌,మాథ‌టిక్స్ (ఎస్‌.టి.ఇ.ఎం) మ‌న‌జీవితాల‌ను మెరుగు

ప‌రిచేందుకు ఎలాంటి ప‌రిష్కారాలు ఇస్తాయ‌న్న‌ది పరిశీలించ‌డం ,సైన్సు వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను సంతోషంగా పంచుకోవ‌డంలో ప్ర‌జ‌ల‌ను భాగ‌స్వాముల‌ను చేయాల‌ని ఐఐఎస్ఎఫ్ భావిస్తున్న‌ది: సిఎస్ ఐ ఆర్ - ఎన్ ఇ ఐ ఎస్‌టి డైర‌క్ట‌ర్ డాక్ట‌ర్ జి.న‌ర‌హ‌రి శాస్త్రి.

Posted On: 01 DEC 2020 8:40PM by PIB Hyderabad

శాస్త్ర‌విజ్ఞానానికి సంబంధించిన వివిధ అంశాల‌ను జ‌న‌బాహుళ్యంలోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు  ఆర‌వ‌, ఇండియా ఇంట‌ర్నేష‌న‌ల్ సైన్స్ ఫెస్టివ‌ల్ (ఐఐఎస్ఎఫ్‌) 2020 క‌ర్టెన్ రైజ‌ర్ ఈవెంట్ ను దేశ‌వ్యాప్తంగా వివిధ సంస్థ‌లు నిర్వ‌హించ‌నున్నాయి. ఐఐఎస్ఎఫ్ -2020 ఈనెల 22 నుంచి 25 వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. దీనికి అనుగుణంగా సిఎస్ఐఆర్‌- నార్త్ ఈస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌, టెక్నాల‌జీ  జోర్హాట్ ఐఐఎస్ఎఫ్ 2020 క‌ర్టైన్ రైజ‌ర్ ఈవెంట్‌ను డిసెంబ‌ర్ 01,2020న వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో నిర్వ‌హించింది.

 


సిఎస్ఐఆర్‌- ఎన్‌.ఇ.ఐ.ఎస్‌.టి డైర‌క్ట‌ర్ డాక్ట‌ర్ జి. న‌ర‌హ‌రి శాస్త్రి ప్రారంభోప‌న్యాసం చేస్తూ,, శాస్త్ర‌విజ్ఞాన వ్వ‌వ‌హారాల‌లో ప్ర‌జ‌ల‌ను భాగ‌స్వాముల‌ను చేయ‌డం, సైన్సు సంబ‌రాల‌లో పాలుపంచుకునేలాచేయ‌డం,సైన్సు, టెక్నాలజీ, ఇంజ‌నీరింగ్‌, మాథ‌మాటిక్స్ (ఎస్‌టిఇఎం) వంటివి ప్ర‌జ‌ల జీవ‌న ప్రమాణాల‌ను మెరుగు ప‌రిచేలా ఎలా చేస్తున్నాయో తెలియ‌జేయ‌డం ఐఐఎస్ఎఫ్ ల‌క్ష్యం అన్నారు. ఈ సంద‌ర్భంగా యువ శాస్త్ర‌వేత్త‌ల స‌ద‌స్సు, మ‌హిళా శాస్త్ర‌వేత్త‌ల స‌ద‌స్సు, జ‌ల వ‌న‌రుల విభాగం, వ్య‌ర్ధాల‌నిర్వ‌హ‌ణ‌,పారిశుధ్యం,విజ్ఞాన యాత్ర‌, సంప్ర‌దాయ క‌ళ‌లు, చేతివృత్తుల‌స‌మావేశం వంటివి ప్ర‌ధాన కార్య‌క్ర‌మానికి తోడుగా జ‌ర‌గ‌నున్నాయి.

ఐఐఎస్ఎఫ్‌, సైన్సును ఒక ఉత్స‌వంలా నిర్వ‌హించుకునే కార్య‌క్ర‌మం. దీనిని 2015లో ప్రారంభించారు.సైన్సు, టెక్నాల‌జీని  ప్రోత్స‌హించ‌డానికి, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఇండియాను అభివృద్ధి చెందిన దేశంగా ఎలా ముందుకు తీసుకువెళుతుందో ప్ర‌ద‌ర్శించ‌డానికి ఉప‌క‌రిస్తుంది. సిఎస్ఐఆర్ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ శేఖ‌ర్ సి మండే  గ‌రిష్ఠ స్థాయిలో ప్ర‌జ‌లు ఇందులో పాలుపంచుకునేలా చూడాల‌ని పిలుపునిచ్చారు. అలాగా ఈ ఉత్స‌వంలో సామాన్య ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడడానికి వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిని ఉ ప‌యోగించుకోవాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మం ప్రధాన ల‌క్ష్యం సైన్సును ప్ర‌జ‌ల‌వ‌ద్ద‌కు తీస‌కువెళ్ల‌డం,సైన్సును ప్ర‌జ‌ల‌వ్ద‌కు తీసుకువెళ్ల‌డ‌మ‌ని ఆయ‌న అన్నారు.


   సిఎస్ఐఆర్-ఎన్‌.ఇ.ఐ.ఎస్‌.టి హెడ్‌, రిసెర్చి, ప్లానింగ్ బిజినెస్ డ‌వ‌ల‌ప్‌మెంట్ డివిజ‌న్ ,ప్రిన్సిప‌ల్ సైంటిస్ట్ డాక్ట‌ర్ జతిన్ క‌లితా మాట్లాడుతూ , రాగ‌ల ఐఐఎస్ఎఫ్ 2020 కార్య‌క్ర‌మాల గురించి, డిసెంబ‌ర్ 22-25 మ‌ధ్య చేప‌ట్ట‌నున్న కార్య‌క్ర‌మాల గురించితెలిపారు.  ఇప్ప‌టివ‌ర‌కూ సంస్థ 120 టెక్నాల‌జీల‌ను అభివృద్ధి చేసింద‌ని వాటిలో మ‌రెన్నో వాణిజ్య‌ప‌రంగా వినియోగించ‌డం జ‌రిగింద‌ని, ఇది తొలిత‌రం ఎంట‌ర్‌ప్రెన్యుయ‌ర్ల‌కు ఉప‌క‌రించింద‌న్నారు. అలాగే ఇది ఈశాన్య రాష్ట్రాల సామాజిక ఆర్ధిక అభివృద్దికి దోహ‌ద‌ప‌డింద‌న్నారు.
సుస్థిరాభివృద్ధి ల‌క్ష్యాల‌పై సిఎస్ఐఆర్‌-ఎన్ఇఐఎస్‌టి మ‌నస్ఫూర్తిగా దృష్టిపెడుతున్న‌ద‌ని అన్నారు. ఈశాన్య‌రాష్ట్రాల ప్రాంతంలోని విద్యార్ధులు ,సామాన్య ప్ర‌జ‌ల‌లో సంస్థ శాస్త్ర‌విజ్ఞాన స్పృహ‌ను పెంచేందుకుత‌మ సంస్థ పూర్తిగా నిమ‌గ్న‌మై ఉంద‌న్నారు.  సైన్సు ప‌ట్ల ప్రేర‌ణ క‌లిగించే కార్య‌క్ర‌మాలు, ప‌లు విస్త‌ర‌ణ కార్య‌క్ర‌మాల‌ను సంస్థ చేప‌డుతున్న‌ట్టు తెలిపారు. త‌మ సంస్థ ఇటీవ‌ల వేసవి రిసెర్చి ట్రైనింగ్ ప్రోగ్రాంను విద్యార్ధుల‌కు, ప‌రిశోధ‌కుల‌కు నిర్వ‌హించింద‌ని, ఇందులో కోవిడ్ మ‌హ‌మ్మారి స‌మ‌యంలో కూడా  దేశం వివిధ ప్రాంతాల‌నుంచి 16,000 మంది పాల్గొన్నార‌ని అన్నారు. రానున్న 2020 ఐఐఎస్ ఎఫ్ లో అన్ని రంగాల‌కు చెందిన వారు పెద్ద ఎత్తున పాల్గొన‌గ‌ల‌ర‌న్న ఆకాంక్ష‌ను వ్య‌క్తం చేశారు.

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమం, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం,భూవిజ్ఞానం శాఖ మంత్రి  డాక్ట‌ర్ హ‌ర్ష వ‌ర్ధ‌న్‌, ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం కావాలంటూ పంపిన సందేశాన్ని డాక్ట‌ర్ శాస్త్రి, డాక్ట‌ర్‌మండే తెలిపారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో విజ్ఞాన భార‌తి (విఐబిహెచ్ ఎ) నేష‌న‌ల్ ఆర్గ‌నైజింగ్ సెక్ర‌ట‌రీ శ్రీ జ‌యంత్ స‌హ‌స్ర‌బుద్ధే కూడా పాల్గొన్నారు


                                                 

******



(Release ID: 1677608) Visitor Counter : 190


Read this release in: English , Urdu , Hindi , Tamil