వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
2020-21 ఖరీఫ్ సీజన్.లో కనీస మద్దతుధరపై
కొనసాగుతున్న పంటల సేకరణ
Posted On:
01 DEC 2020 6:40PM by PIB Hyderabad
ప్రస్తుతం కొనసాగుతున్న ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్.లో రైతులనుంచి 2020-21 ఖరీఫ్ సీజన్ పంటల సేకరణను ప్రభుత్వం కొనసాగిస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న కనీస మద్దతు ధర పథకాల ప్రకారం ఖరీఫ్ పంటల సేకరణ జరుగుతోంది.
పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, తమిళనాడు, చండీగఢ్, జమ్ము కాశ్మీర్, కేరళ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో 2020-21 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ధాన్యం సేకరణ సజావుగా సాగుతోంది. 2020 నవంబరు నెలాఖరుకు 318లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. గత ఏడాది ఇదే సమయంలో 268.15లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. అంటే గత ఏడాది ధాన్యం సేకరణతో పోల్చితే ఈ సారి సేకరించిన ధాన్యం18.58 శాతం పెరిగింది. ఒక్క పంజాబ్ లోనే 202.77లక్షల మెట్రిక్ టన్నులు సేకరించారు. అంటే ఇది మొత్తం సేకరణ జరిగిన ధాన్యంలో 63.76శాతం. అంటే,.. 60,038.68కోట్ల కనీస మద్దతు ధరతో ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో జరిగిన ధాన్యం సేకరణవల్ల దాదాపు 29.70లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది.
ఇక, వివిధ రాష్ట్రాలనుంచి అందిన ప్రతిపాదనల మేరకు 2020 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కు సంబంధించి 45.24 లక్షల మెట్రిక్ టన్నుల పప్పు దినుసులు, నూనె గింజల సేకరణకు ఆమోదం లభించింది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ధరల మద్దతు పథకం (పి.ఎస్.ఎస్.) పథకం కింద ఈ సేకరణకు ఆమోదం లభించింది. అంతేకాక, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో లక్షా 23వేల టన్నుల కొబ్బెర కురిడీల సేకరణకు కూడా ఆమోదం లభించింది. ఇక, ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాలనుంచి అందిన ప్రతిపాదనల ప్రకారం, 2020-21 సంవత్సరానికి పప్పు దినుసులు, నూనె గింజలు, కొబ్బెర కురిడీల సేకరణకు ఆమోదం మంజూరు చేయనున్నారు. సరకు సగటు నాణ్యతా గ్రేడ్ల ప్రకారం పేర్లు రిజిస్టరైన రైతులనుంచి నేరుగా ఈ సేకరణ జరుపుతారు. సెంట్రల్ నోడల్ ఏజెన్సీలు, సంబంధిత రాష్ట్రం ఎంపిక చేసిన సంస్థల ద్వారా ఈ సేకరణ ప్రక్రియను అమలు చేస్తారు. మార్కెట్ రేటుకంటే కనీస మద్దతు ధర తక్కువగా ఉన్న పక్షంలో ధరల మద్దతు పథకంకింద ఈ పంటలను సేకరిస్తారు. ఈ ఏడాది నవంబరు నెలాఖరుకు తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో 1,04,546.68 మెట్రిక్ టన్నుల పెసలు, మినిములు, వేరశనగ, సోయాబీన్ పంటలను రూ. 563.43కోట్ల విలువైన కనీస మద్దతు ధరపై ప్రభుత్వం సేకరించింది. అలాగే,.. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో నవంబరు నెలాఖరు నాటికి 5,089 మెట్రిక్ టన్నుల కొబ్బెర కురిడీలను రూ. 52.40కోట్ల మద్దతు ధరతో సేకరించారు. గత ఏడాది ఇదే సమయానికి 293.34మెట్రిక్ టన్నుల కొబ్బెర కురిడీలను సేకరించారు. మినుములు, కొబ్బెర కురిడీలను పండే రాష్ట్రాల్లో ఆయా పంటల మార్కెట్ ధరలు కనీస మద్దతు ధరకంటే ఎక్కువగా ఉన్నాయి. ఇక, ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన పప్పు దినుసులు, నూనె గింజల చేతికందే తేదీనిబట్టి, ఆయా పంటలసేకరణ ప్రక్రియను ప్రారంభించేందుకు వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తగిన ఏర్పాట్లు చేస్తున్నాయి.
ఇక, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో కనీస మద్దతు ధరపై గింజ పత్తి సేకరణ ప్రక్రియ సజావుగా సాగుతోంది. ఈ ఏడాది నవంబరు నెలాఖరుకు రూ. 8,515.53కోట్ల విలువైన 29,09,242 పత్తి బేళ్లను సేకరించారు. ఈ సేకరణతో 5,81,449మంది రైతులకు ప్రయోజనం కలిగింది.
******
(Release ID: 1677605)
Visitor Counter : 218