రైల్వే మంత్రిత్వ శాఖ

రైల్వే బోర్డు ఛైర్మన్ & సిఇఒ శ్రీ వినోద్ కుమార్ యాదవ్ వారణాసిలోని బనారస్ లోకో వర్క్స్ (బిఎల్‌డబ్ల్యు) నుండి 40 వ 6,000 హెచ్‌పి ఎలక్ట్రిక్ లోకోను ప్రారంభించారు

బనారస్ లోకోమోటివ్ వర్క్స్ (బిఎల్‌డబ్ల్యు) జూలై 2020 లో 31 ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లను తయారు చేసిన రికార్డును అధిగమించింది

నవంబర్ 2020 నెలలో బిఎల్‌డబ్లు 40 లోకోమోటివ్ల తయారు చేయగలిగింది. తద్వారా ఒక నెలలో 6000 హెచ్‌పి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ల తయారీలో ఆల్ టైమ్ హై రికార్డ్ సృష్టించింది.

ఇది బిఎల్‌డబ్ల్యూ యొక్క ఆత్మనిర్భర్ భారత్ సాధించిన విజయం


ఈ రికార్డు ఉత్పత్తిని సాధించిన సిబ్బందిని ప్రోత్సహించేందుకు శ్రీ వినోద్ కుమార్ యాదవ్ రూ .1.5 లక్షల నగదు అవార్డును ప్రకటించారు

Posted On: 01 DEC 2020 4:35PM by PIB Hyderabad

వారణాసిలోని బనారస్ లోకోమోటివ్ వర్క్స్ ఒక నెలలో 31 ఎలక్ట్రిక్ లోకోమోటివ్లను తయారు చేసిన జూలై 2020 రికార్డును..  40 వ 6,000 హెచ్‌పి ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లను తయారు చేయడం ద్వారా 2020 నవంబర్ నెలలో అధిగమించింది. ఈ చారిత్రాత్మక రికార్డు దేవ్ దీపావళి శుభ దినం రోజున సంస్థ సాధించింది.


రైల్వే బోర్డు ఛైర్మన్ & సిఇఒ శ్రీ వినోద్ కుమార్ యాదవ్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వారణాసిలోని బనారస్ లోకో వర్క్స్ (బిఎల్‌డబ్ల్యు) నుండి 40 వ 6,000 హెచ్‌పి ఎలక్ట్రిక్ లోకోను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ  వేడుకలో శ్రీ రాజేష్ తివారీ, ట్రాక్షన్ అండ్ రోలింగ్ స్టాక్ సభ్యుడు , రైల్వే బోర్డు మరియు సీనియర్ రైల్వే అధికారులను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, కోవిడ్ సవాళ్లు ఉన్నప్పటికీ ఈ మైలురాయిని సాధించడంలో బిఎల్‌డబ్ల్యూ సిబ్బంది చేసిన హృదయపూర్వక కృషిని శ్రీ వినోద్ కుమార్ యాదవ్ ప్రశంసించారు. ప్రతికూల పరిస్థితుల్లో పని చేసే సామర్థ్యం రైల్వే ఉద్యోగి యొక్క సామర్ధ్యం. ఏప్రిల్ మరియు మే 2020 లలో కొవిడ్ 19 లాక్ డౌన్  అమల్లో ఉండడంతో ఏప్రిల్‌లో ఉత్పత్తి సాగలేదు. 2020 మే నెలలో 8 లోకోమోటివ్‌ల ఉత్పత్తి జరిగింది. అయినప్పటికీ బిఎల్‌డబ్లు గత సంవత్సరం చేసిన ఉత్పత్తిని ఈ నవంబర్ వరకూ సాధించగలిగింది. నవంబర్ 2020 వరకు ఈ సంస్థ 169 ఎలక్ట్రిక్ లోకోమోటివ్లను తయారు చేసింది. 2019 నవంబర్ వరకు ఆ సంఖ్య 168గా ఉంది. భారత రైల్వే పరివర్తన చెందుతోందని ఆయన అన్నారు. ఈ మార్పు తీసుకురావడంలో బిఎల్‌డబ్లు జనరల్ మేనేజర్ కీలకపాత్ర పోషించారు. గతంతో పోలిస్తే లోకోస్‌లో సాంకేతిక పరిజ్ఞానం మెరుగుపడింది. 9000 హెచ్‌పీ లోకోను లక్ష్యంగా చేసుకుని తాము మరింత ముందుకు సాగాలాని ఆకాంక్షించారు.


ఈ రికార్డును సాధించిన అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ రికార్డు ఉత్పత్తిపై బిఎల్‌డబ్ల్యూ సిబ్బందిని ప్రోత్సహించేందుకు శ్రీ యాదవ్ రూ .1.5 లక్షల నగదు పురస్కారాన్ని ప్రకటించారు.

తయారీలో ఈ ప్రోత్సాహం ఆత్మ నిర్భర్ భారత్‌కు పెద్ద సహకారం.

కొవిడ్  సవాళ్లు ఉన్నప్పటికీ డీజిల్ లోకోమోటివ్ల తయారీ నుండి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ల తయారీకి మారేందుకు బిఎల్‌డబ్లు తన మౌలిక సదుపాయాలను పూర్తిగా మార్చివేసింది. షాప్ అంతస్తులు, యంత్రాలు, జిగ్స్ మరియు ఫిక్చర్స్ మరియు ఎలక్ట్రిక్ లోకోలకు మారడానికి ప్రణాళిక ప్రక్రియను తిరిగి స్కిల్లింగ్ చేయడం, పునర్వ్యవస్థీకరించడం వంటి సవాళ్లను అదిగమించేందుకు బిఎల్‌డబ్లు సిబ్బంది మరియు అధికారులు ఉమ్మడిగా పనిచేశారు.

ఇంధన బిల్లును తగ్గించడం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, ఇంధన దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించడం మరియు సగటు వేగాన్ని పెంచడం మరియు రైళ్ల సామర్థ్యాన్ని పెంచడం వంటి బహుళ లక్ష్యాలతో రైల్వేశాఖ బిఎల్‌డబ్లులోని ఉత్పత్తిని డీజిల్‌ లోకోమోటివ్‌ నుండి ఎలక్ట్రికల్‌ లోకోమోటివ్‌ల తయారీకి అనుకూలంగా మార్చింది.

ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఉత్పత్తి 98% దేశీయ భాగాలతో కొనసాగుతోంది- అందులో మధ్య, చిన్న మరియు సూక్ష్మ పరిశ్రమలకు (ఎంఎస్ఎఈ) నుండి గణనీయమైన భాగం లభిస్తుంది.

మొజాంబిక్‌కు 3000 హెచ్‌పి కేప్ గేజ్ డీజిల్ లోకోమోటివ్‌ల ఎగుమతి ఆర్డర్‌కు బిఎల్‌డబ్ల్యూ పనిచేస్తోంది. ఇది ఫాస్ట్ ట్రాక్‌లో ఉంచబడింది. ఈ ఆర్డర్ ప్రకారం మొ దటిసారి 12 సిలిండర్ క్రాంక్కేస్ బిఎల్‌డబ్లులో ఉత్పత్తి  చేయబడుతోంది.

***



(Release ID: 1677554) Visitor Counter : 165