రక్షణ మంత్రిత్వ శాఖ
జాట్ రెజిమెంట్ 12వ బెటాలియన్, ఐఎన్‌ఎస్ ఉత్క్రోష్, ఐఎన్‌హెచ్‌ఎస్ ధన్వంతరికి 'యూనిట్ అప్రిసియేషన్' ప్రదానం
Posted On:
01 DEC 2020 6:19PM by PIB Hyderabad
విధి నిర్వహణలో అద్భుత ప్రతిభ కనబరిచినందుకు, జాట్ రెజిమెంట్ 12వ బెటాలియన్, ఐఎన్‌ఎస్ ఎయిర్ స్టేషన్ ఉత్క్రోష్, నావల్ హాస్పిటల్ షిప్ ధన్వంతరికి 'యూనిట్ అప్రిసియేషన్ 2019-20'ను లెఫ్టినెంట్ జనరల్, కమాండర్ ఇన్ చీఫ్, అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ (సీఐఎన్‌సీఏఎన్) మనోజ్ పాండే అందజేశారు. హడ్డోలోని ద్వీపిక ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది.
కమాండ్ లక్ష్యాల సాధనలో ఈ మూడు బృందాల సిబ్బంది చూపిన నైపుణ్యం, చురుకుదనాన్ని సీఐఎన్‌సీఏఎన్ మెచ్చుకున్నారు. కొవిడ్ సమయంలోనూ వృత్తి పట్ల ప్రదర్శించిన భక్తి, నిబద్ధత, సంకల్పం, కృషిని మెచ్చుకున్నారు. వృత్తి, క్రీడల్లో 12వ బెటాలియన్ సాధించిన విజయాలను అభినందించారు. 24 గంటలూ ఆకాశ కార్యకలాపాలు; నౌకాదళం, వాయుసేన, తీరరక్షణ దళాల ప్రాథమిక కార్యకలాపాలు/విడిది ప్రాంతంతో అండమాన్-నికోబార్ ప్రజలకు జీవనరేఖగా మారడం పట్ల ఐఎన్‌ఎస్ ఉత్ర్కోష్ సిబ్బందిని లెఫ్టినెంట్ జనరల్ మెచ్చుకున్నారు. ఐఎన్‌హెచ్‌ఎస్ ధన్వంతరి 700 మంది కొవిడ్ రోగులకు చికిత్స అందించి, అందరూ కోలుకునేట్లు చేయడాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ మూడు యూనిట్ల సిబ్బంది మాత్రమే గొప్ప పనితీరు కనబరిచినట్లుకాదని, అండమాన్&నికోబార్ దీవుల్లో కొవిడ్‌పై పోరాటంలో మొత్తం యూనిట్ ప్రాణాలను పణంగా పెట్టి ఫ్రంట్‌లైన్ వారియర్లకు సహకరించిందని అన్నారు. కొవిడ్ సంబంధ అన్ని జాగ్రత్తల మధ్య ఈ కార్యక్రమం జరిగింది.
***
(Release ID: 1677552)
Visitor Counter : 151