భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ

నైరుతి బంగాళాఖాతం దాని పరిసరఆగ్నేయ ప్రాంతంలో తీవ్ర వాయుగుండం

( దక్షిణ తమిళనాడు, దక్షిణ కేరళ తీరాలకు తుపాను హెచ్చరిక - ఎల్లో మెసేజ్ )

ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడిన వాయుగుండం పశ్చిమ దిక్కుగా కదిలి వాయవ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం 5.30 గంటలకి తీవ్ర వాయుగుండంగా మారింది.

ఇది మరింత తీవ్రమై రానున్న 24 గంటలలో తుపానుగా మారుతుంది.

దక్షిణ తమిళనాడు ( కన్యాకుమారి, తిరునెల్వేలి,తూత్తుకుడి,తెంకాశి, రామనాథపురం, శివగంగై )లో డిసెంబర్ 2, 3 తేదీలలో కొన్ని ప్రాంతాలలో అతి భారీ వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో సముద్రం అల్లకల్లోలం

డిసెంబర్ 1 నుంచి 4వ తేదీవరకు చేపల వేట వద్దు.. వాతావరణశాఖ హెచ్చరిక

Posted On: 01 DEC 2020 1:25PM by PIB Hyderabad

హైదరాబాద్ డిసెంబర్ 1 ;సోమవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ దిక్కుగా కదిలి వాయవ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో తీవ్ర వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ట్రింకోమలై ( శ్రీలంక)కు ఆగ్నేయ దిశలో 500 కిలోమీటర్ల దూరంలోను కన్యాకుమారి ( భారతదేశం)కి తూర్పు-ఆగ్నేయ దిశలో 900 కిలోమీటర్ల దూరంలో ఇది ఈ రోజు ఉదయం 8.30 గంటలకి కేంద్రీకృతమై ఉంది .

ఇది రానున్న 24 గంటలలో తుపానుగా మారే అవకాశం ఉంది. పశ్చిమ వాయవ్య దిశలో కదిలి ట్రింకోమలీ వద్ద డిసెంబర్ రెండవ తేదీ సాయంకాలం / రాత్రి తీరం దాటే అవకాశం ఉంది. ఆ తరువాత ఇది పశ్చిమ దిశలో ప్రయాణించి గల్ఫ్ అఫ్ మన్నార్ , పక్కనే వున్న కామోరిన్ ప్రాంతంలో డిసెంబర్ మూడవ తేదీ ఉదయం ప్రవేశించి పశ్చిమ దిశ లో దక్షిణ తమిళనాడు తీరం వైపు సాగుతుంది.

ఇది ప్రయాణించే మార్గం, తీవ్రత కింద పొందుపరచబడ్డాయి.

Date/Time(IST)

Position

(Lat. 0N/ long. 0E)

Maximum sustained surface

wind speed (Kmph)

Category of cyclonic disturbance

01.12.20/0830

7.8/85.7

50-60 gusting to 70

Deep Depression

01.12.20/1130

7.9/85.3

55-65 gusting to 75

Deep Depression

01.12.20/1730

8.1/84.6

60-70 gusting to 75

Cyclonic Storm

01.12.20/2330

8.3/83.9

65-75 gusting to 85

Cyclonic Storm

02.12.20/0530

8.4/83.2

75-85 gusting to 95

Cyclonic Storm

02.12.20/1730

8.6/81.7

75-85 gusting to 95

Cyclonic Storm

03.12.20/0530

8.7/80.3

65-75 gusting to 85

Cyclonic Storm

03.12.20/1730

8.7/79.3

70-80 gusting to 90

Cyclonic Storm

04.12.20/0530

8.5/78.5

70-80 gusting to 90

Cyclonic Storm

 

***

 



(Release ID: 1677356) Visitor Counter : 89