భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
ఆగ్నేయ బంగాళాఖాతంలో, దానిసమీపంలో ఏర్పడిన అల్పపీడనం
ఇది మరింత బలపడి రాగల 24గంటలలో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది.
ఇది మరింత తీవ్రమై తుపానుగా మారే అవకాశం
దీని ప్రభావంతో దక్షిణ తమిళనాడు, దక్షిణ కేరళలలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది
ఆగ్నేయ బంగాళాఖాతం, పక్కనే ఉన్న నైరుతి బంగాళాఖాతం లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది.
ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలో డిసెంబర్ 1 వ తేదీ రాత్రి నుంచి మత్స్యకారులు చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్లరాదని తుపాను హెచ్చరిక కేంద్రం తెలిపింది.
Posted On:
30 NOV 2020 10:20AM by PIB Hyderabad
భారత వాతావరణ విభాగానికి(ఐఎండి) చెందిన తుపాను హెచ్చరిక కేంద్రం తెలిపిన సమాచారం ప్రకారం,
తాజా ఉపగ్రహ చిత్రాలు, నౌకలనుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించిచూసినపుడు ఆగ్నేయ బంగాళాఖాతంలో , ఆ సమీప ప్రాంతంలో 2020నవంబర్ 30 వ తేదీ ఉదయం 5గంటల 30 నిమిషాల ప్రాంతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఇది శ్రీలంకలోని ట్రింకోమలీకి తూర్పు ఆగ్నేయంగా 750 కిలోమీటర్ల దూరంలో , కన్యాకుమారి (ఇండియా)కి తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. ఇది మరింత బలపడి రాగల 24 గంటలలో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇది మరింత ఉధృతమై తుపాను గా మారే అవకాశం కూడా ఉంది. ఇది పశ్చిమ వాయవ్యంగా కదలి శ్రీలంక కోస్తా ప్రాంతలో డిసెంబర్ 2న తీరం దాటే అవకాశంఉంది. ఇది చాలావరకు పశ్చిమదిక్కుగా పయనించి ఆ తర్వాత డిసెంబర్ 3 ఉదయానికి కామొరిన్ ప్రాంతానికి చేరుకోవచ్చు.
***
(Release ID: 1677124)
Visitor Counter : 126