పర్యటక మంత్రిత్వ శాఖ

మీ దేశాన్ని చూడండి ( దేఖో అప్నా దేశ్) '12 నెలల సాహస ప్రయాణం'

వెబినార్ కార్యక్రమం నిర్వహించిన పర్యాటక శాఖ

ఏడాది పొడవునా భారతదేశంలో పర్యాటకానికి గల అవకాశాలను తెలిపిన వెబినార్

నాడు పోస్టు చేయడమైనది: 28 NOV 2020 7:29PM by PIB Hyderabad

భారతదేశంలో ఏడాది పొడవునా పర్యాటక రంగానికి గల అవకాశాలను వివరిస్తూ పర్యాటకశాఖ వెబినార్ కార్యక్రమాన్ని నిర్వహించింది. '' 12 నెలల సాహస యాత్ర'' పేరిట ఈ కార్యక్రమాన్ని పర్యాటకశాఖ దేఖో అప్నా దేశ్ భాగంగా నిర్వహించారు. నవంబర్ 28వ తేదీన జరిగిన ఈ కార్యక్రమంలో పర్యాటక రంగానికి 12 నెలలపాటు గల అవకాశాలను వివరించారు. ప్రకృతి సహజమైన అందాలు, సంస్కృతి కలిగిన భారతదేశం పర్యాటక రంగంలో ప్రపంచంలో 34వ స్థానంలో ఉంది. సహజ వారసత్వ సంపద కలిగిన దేశాలలో భారతదేశం ప్రపంచంలో నాల్గవ స్థానంలో ఉంది. పర్యాటక రంగ అభివృద్ధికి ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా అపార అవకాశాలను కలిగి ఉంది. పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో '' మీ దేశాన్ని సందర్శించండి'' కార్యక్రమాన్ని ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ గా నిర్వహించడం జరుగుతున్నది.
భారతదేశ అందాలను కళ్ళకి కట్టినట్టు ఈ వెబినార్ ని రూపొందించారు. కొండలు,అడవులు, నదులు, ఎడారులు, ద్వీపాలు, మడ అడవులు,వన్యప్రాణులు లతో సహా 31 సాహస కార్యక్రమాలు దేశ విదేశాలకు చెందిన పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.
సాహస పర్యాటకరంగంలో దాదాపు 30 సంవత్సరాల అనుభవం కలిగి అడ్వెంచర్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా నుంచి ' హాల్ ఆఫ్ ఫేం' అవార్డును పొందిన హాలిడే మూడ్స్ అడ్వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ. తేజ్బీర్ సింగ్ ఈ వెబినార్ ను రూపొందించారు.ఏడాదిలో 12 నెలల పాటు సందర్శించడానికి దేశంలో అనేక పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. వీటిని సందర్శించడానికి జీవితకాలం సరిపోదని అంటారు.
సాహస పర్యాటకం అంటే సవాళ్లతో కూడిన యాత్రలని చెప్పవచ్చునని శ్రీ తేజ్బీర్ సింగ్ వివరించారు. ఈ యాత్రలు సహజ వాతావరణంలో సాగుతూ పర్యాటకులకు మరురాని అనుభూతిని కలిగిస్తాయని ఆయన పేర్కొన్నారు. యాత్రలో ఎదురయ్యే సవాళ్లు వినూత్నంగా ఉంటాయి. సాహస పర్యాటక రంగానికి భారతదేశంలో గల అవకాశాలను వెలుగు లోకి తీసుకునిరాధానికి అడ్వెంచర్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా కృషి చేస్తున్నది. పర్యావరణానికి హాని లేకుండా సహజ వనరులకు నష్టం కలిగించకుండా ఈ యాత్రలను ఏవిధంగా చేపట్టవచ్చునన్న అంశాన్ని ఈ సంఘం ప్రాధాన్యత ఇస్తూ అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. సహజ అందాలను కలిగివున్న దేశాలలో భారతదేశం ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగివుంది. మంచుతో కప్పబడి వుండే హిమాలయాలు, పై నుంచి కిందది దుమికే జలపాతాలు, దట్టమైన అడవులు, అందాల లోయలు,తీరప్రాంతాలు, ఎడారులు లాంటి వాటితో భారతదేశం పర్యాటకులను ఆకర్షిస్తోంది.
12 నెలలపాటు సాహస పర్యాటక రంగానికి గల అవకాశాలు ఇలా ఉన్నాయి.

 చలికాలం ( నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు)
ఈశాన్య భారతం: అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర
కార్యక్రమాలు... ట్రెక్కింగ్, నదులలో ప్రయాణం, బైకింగ్ లాంటివి.
రాజస్థాన్.. జైసల్మేర్, థార్ ఎడారి, జోధాపూర్, పోఖ్రాన్
కార్యక్రమాలు... పారాసైలింగ్, క్యాంపింగ్, హాట్ ఎయిర్ బెలూన్ లాంటివి
హర్యానా.. కొండలను ఎక్కడానికి ప్రసిద్ధి
జమ్మూకాశ్మీర్ . స్కీయింగ్ కి గుల్మార్గ్
లడఖ్.. మంచు పర్వతాలను అధిరోహించడం, ఐస్ హాకీ, లేహ్ కార్గిల్ లో సైక్లింగ్
హిమాచల్ ప్రదేశ్... మనాలి, ధర్మశాల,కులు, సిరమౌర్,షిమ్లా
కార్యక్రమాలు... స్కీయింగ్, సైక్లింగ్, మంచులో నడక, పారా గ్లైడింగ్
ఉత్తర ఖాండ్ ... కుమాన్ మరియు గర్హ్వాల్ దిగువ ప్రాంతాలు
కార్యక్రమాలు.. రాఫ్టింగ్, సైక్లింగ్, జిప్ లైన్, బంగీ
వసంతకాలం ( మార్చి నుంచి ఏప్రిల్ వరకు)
జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరా ఖండ్, సిక్కిం లలో సాహస యాత్రలను చేపట్టవచ్చును.
వేసవి కాలం ( మే నుంచి జూన్)
హిమాచల్, ఉత్తరా ఖండ్ లోయలలో ఎతైన ప్రాంతాలలో ట్రెక్కింగ్ చేయవచ్చును. జమ్మూ కాశ్మీర్, లడఖ్- నుబ్రా జాన్సకర్ ప్రాంతాలలో వివిధ కార్యక్రమాలను నిర్వహించవచ్చును.
వానాకాలం ( జులై నుంచి ఆగష్టు వరకు)
హిమాచల్ లోయలు, కిన్నర్ , స్పిటి , లాహౌల్ లడఖ్ జమ్మూ లతో పాటు ఆరావల్లిస్ లో అనేక కార్యక్రమాలు జరుగుతాయి.
శరద్ ఋతువు ( సెప్టెంబర్ నుంచి అక్టోబర్)
ఈశాన్య భారతదేశంలో జరిగే అనేక కార్యక్రమాలను చూడవచ్చును.
భారతదేశం సహజ వారసత్వ కలయికను ఏడాది పొడవునా ఆనందించవచ్చును. కొండప్రాంతాలు, నదులు,వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు లాంటివి ఈ కోవలోకి వస్తాయి.
అందమైన హిమాలయా పర్వతాలు 73 శాతం భారత భూభాగంలో ఉన్నాయి. ఆరావళి పర్వతాలు అత్యంత పురాతనమైనవి.
సింధు నది వ్యవస్థ, బ్రహ్మపుత్ర నది వ్యవస్థ (3969 కి.మీ), గంగా నది వ్యవస్థ (2704 కి.మీ) మొదలైనవి భారతదేశంలో ప్రధాన నదీ వ్యవస్థలు. భారతదేశంలో 18 జీవవైవిధ్య ప్రాంతాలు, 551 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. ఇవి దేశ వైశాల్యంలో 3. 64%గా ఉన్నాయి. తెల్ల ఉప్పు వంటి ఎడారి గ్రేట్ రాన్ ఆఫ్ కచ్ (2898 చదరపు మైళ్ళు) స్కాండీ థార్ ఎడారి (66000 చదరపు మైళ్ళు) సాహసానికి తగినంత అవకాశాలను అందిస్తుంది.ట్రాన్స్ హిమాలయ భారతదేశపు మంచు ఎడారిగా గుర్తింపు పొందిన లడఖ్సాసాహస కార్యకలాపాలకు నిలయంగా ఉంది. కేరళ లో 1500 కిలోమీటర్ల కాలువలు, 38 నదులు మరియు 5 పెద్ద సరస్సులు ఉన్నాయి. భారతదేశం యొక్క మొత్తం మడ అడవులు 4921 చదరపు కి.మీ. హిమాలయలో అతిపెద్ద సరస్సు పాంగోంగ్ త్సో (4238 మీ) మరియు ఎతైన ప్రాంతంలో సిక్కిమ్ లోని గురుడోంగ్మార్ సరస్సు (5148 మీ).గుర్తింపు పొందింది.
అడ్వెంచర్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ భూమి, గాలి మరియు నీటి ఆధారంగా సాహస కార్యకలాపాల జాబితాను సిద్ధం చేసింది. భూమిపై సాగే కార్యకలాపాలలో అన్ని టెర్రైన్ వెహికల్ టూర్స్ (ఎటివి), బంగీ జంపింగ్, సైక్లింగ్ టూర్స్, ఒంటె సఫారి, గుర్రం సఫారీ , జీప్సఫారీ , మోటార్ సైకిల్ టూర్స్, మౌంటైనరింగ్, నేచర్ వాల్క్స్ / బర్డ్ వాచింగ్, రాక్ క్లైంబింగ్ / ఆర్టిఫిషియల్ వాల్ క్లైంబింగ్ , పర్సనల్ లైట్ ఎలక్ట్రిక్ వెహికల్ టూర్స్, స్కీయింగ్ / పారిస్ స్నోయింగ్. ఉన్నాయి. గాలిలో జరిగే అడ్వెంచర్ టూరిజం (7), హాట్ ఎయిర్ బెలూనింగ్, పారాగ్లైడింగ్ / హ్యాండ్ గ్లైడింగ్, పారా మోటరింగ్, పారాసైలింగ్, స్కీ డైవింగ్, ఎయిర్ సఫారిస్, కైట్ బోర్డింగ్. వాటర్ బేస్డ్ అడ్వెంచర్ టూరిజం (7) లో, కయాకింగ్ / సీ కయాకింగ్, రాఫ్టింగ్, రివర్ క్రూసినిగ్, స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్ ఉంటాయి. నీటిలో జరిగే యాత్రలలో వాటర్ స్పోర్ట్స్ సెంటర్స్,
సాహస యాత్రలను చేపట్టడానికి నిర్ణీత జాగ్రత్తలను పాటిస్తూ మార్గదర్శకాలను అనుసరించవలసి ఉంటుంది. . ఏదైనా సాహస కార్యకలాపాలలో పాల్గొనడానికి ముందు ప్రయాణికులు టూర్ ఆపరేటర్ల నుండి బీమాను పొందవచ్చు.
సహజ వారసత్వం రక్షించడానికి మరియు పర్యాటకుల సంఖ్యను పెంచడానికి, ఒకే మార్గంలో ఎక్కువ మంది పర్యాటకులను అనుమతించరాదు. సహజ వారసత్వం ప్రమాదంలో ఉంటే అది ప్రయాణికుడికి, మురికి పరిసరాలకు పేలవమైన అనుభవాన్ని మిగులుస్తుంది. స్థలం యొక్కప్రాధాన్యతను గుర్తించి పర్యావరణాన్ని పరిరక్షించడానికి అవసరమైన కార్యక్రమాలను అమలు చేయవలసి ఉంటుంది. కొత్త అందాలను పరిచయం చేసి సహజ వారసత్వాన్నిప్రదర్శించడం ద్వారా పర్యాటకులకు ఆనందాన్ని అనుభూతిని కలిగించవచ్చును.

అడిషనల్ డైరెక్టర్ జనరల్ రూపిందెర్ బ్రార్ మాట్లాడుతూ భారతదేశంలో 365 రోజుల పాటు పర్యాటక యాత్రలను చేపట్టవచ్చునని అన్నారు. ప్రస్తుతం దృశ్య శ్రవణ విధానంలో కనిపిస్తున్న అందాలు త్వరలో కార్యరూపం దాలుస్తాయని అన్నారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ తక్కువ వ్యవధిలో పూర్తి అయ్యే యాత్రలను చేపట్టాలని సూచించారు.

ఎలక్ట్రానిక్స్నేఅండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కి చెందిన షనల్ గవర్నెన్స్ .శాఖ సహకారంతో ఈ వెబినార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిని https://www.youtube.com/channel/UCbzIbBmMvtvH7d6Zo_ZEHDA లో చూడవచ్చును. 2020 డిసెంబర్ 5వ తేదీన తదుపరి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

***

 


(రిలీజ్ ఐడి: 1676959) సందర్శకుల సూచీ సంఖ్య : : 225
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil