రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

“ఇండియన్ డిఫెన్స్ ఇండస్ట్రీ గ్లోబల్ అవుట్‌రీచ్‌ ఫర్ కొలాబ‌రేటివ్ పార్ట్‌న‌ర్‌షిప్: ‌వెబ్‌నార్ మ‌రియు ఎక్స్‌పో” అనే అంశంపై నైజీరియాతో వెబ్‌నార్ నిర్వ‌హ‌ణ‌

Posted On: 25 NOV 2020 6:44PM by PIB Hyderabad

భారతదేశం నైజీరియా మధ్య ఈ రోజు వెబ్‌నార్ జరిగింది. “ఇండియన్ డిఫెన్స్ ఇండస్ట్రీ గ్లోబల్ అవుట్‌రీచ్‌ ఫర్ కొలాబ‌రేటివ్ పార్ట్‌న‌ర్‌షిప్: ‌వెబ్‌నార్ మ‌రియు ఎక్స్‌పో” అనే అంశంపై నైజీరియాతో ఈ వెబ్‌నార్ జ‌రిగింది. ఎస్ఐడీఎం ద్వారా రక్షణ మంత్రిత్వ శాఖ రక్షణ ఉత్పత్తి విభాగం ఆధ్వర్యంలో.. ఈ వెబ్‌నార్‌ను నిర్వహించారు. ఈ వెబ్‌నార్ రక్షణ ఎగుమతులను పెంచడానికి మరియు వచ్చే ఐదేళ్లలో 5 బిలియన్ డాలర్ల రక్షణ ఎగుమతి లక్ష్యాన్ని సాధించడానికి వీలుగా స్నేహపూర్వక విదేశీ దేశాలతో నిర్వహించబడుతున్న వెబ్‌నార్ల శ్రేణిలో భాగంగా దీనిని నిర్వ‌హించారు. ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ నైజీరియా రక్షణ మంత్రిత్వ శాఖ,
శాశ్వత కార్యదర్శి, మ‌న ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ డీపీ విభాగం అదనపు కార్యదర్శి
నైజీరియాకు భారత హైకమిషనర్, భారతదేశంలోని నైజీరియా హైకమిషన్ యాక్టింగ్ హెడ్, ఇరుదేశాల ర‌క్షణ శాఖ సీనియర్ అధికారులు ఈ వెబ్‌నార్‌లో పాల్గొని మాట్లాడారు. వెబ్‌నార్‌లో భాగంగా భార‌త్ నైజీరియా రెండు దేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక, లోతైన మూలాలను ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నారు.
నైజీరియా సాయుధ దళాల సామర్థ్యాన్ని మ‌రింత పెంపొందించడంలో భారత్  గణనీయమైన కృషి చేసిందని.. అదనపు కార్యదర్శి (డీపీ) శ్రీ సంజయ్ జాజు పేర్కొన్నారు. రక్షణ రంగంలో సహకారం మరియు సహ ఉత్పత్తి ద్వారా రాబోయే సంవత్సరాల్లో ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌ని అన్నారు. వివిధ భారతీయ కంపెనీలైన బీఎల్, బీడీఎల్, జీస్ఎల్, హెచ్ఏఎల్, టీఏఎస్ఎల్, సోలార్ ఇండస్ట్రీస్, ఎంకేయూ, మహీంద్రా డిఫెన్స్, ఎల్ అండ్ టీ, భారత్ ఫోర్జ్, అశోక్ లేలాండ్, త‌యారీ కంపెనీలు వెబ్‌నార్‌లోని ప్రధాన ప్లాట్‌ఫాంల‌లో పరికరాలపై మరియు ఉత్పత్తుల‌ ప్రదర్శనలను ఇచ్చాయి. ఈ వెబ్‌నార్‌కు దాదాపు 150 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఎక్స్‌పోలో 100 వర్చువల్ ఎగ్జిబిషన్ స్టాళ్ల‌ను ఇక్క‌డ‌ ఏర్పాటు చేశారు.
                           

****


(Release ID: 1675990) Visitor Counter : 135