పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
విమానయాన భద్రతా అవగాహనా వారం 2020ను పాటిస్తున్న ఎఎఐ
Posted On:
23 NOV 2020 5:27PM by PIB Hyderabad
విమానయాన భద్రతా అవగాహనా వారం 2020 (నవంబర్ 23 నుంచి 27 నవంబర్,2020)ను ఎయిర్ పోర్ట్్స అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ) ప్రారంభించింది. ఎఎఐ ఆధ్వర్యంలో నిర్వహించే దేశంలోని అన్ని విమానాశ్రయాలలోనూ, ఎఎన్ెస్ ప్రదేశాలలోనూ ఈ వారపు వేడుకలు ప్రారంభమయ్యాయి.
తమతమ ప్రాంతాలలో భద్రతా పనితీరును వ్యక్తిగతంగా పర్యవేక్షించేందుకు ప్రాంతీయ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, ఎయిర్ పోర్ట్ డైరక్టర్లు సానుకూలతను ప్రదర్శించాలని ఎఎఐ చైర్మన్ అర్వింద్ సింగ్ విజ్ఞప్తి చేశారు. కోవిడ్-19 సంక్షోభ సమయంలో విమానాలు ఎక్కువగా నడవని కారణంగా విమానాశ్రయాలలో పశుపక్ష్యాదుల భయం పెరిగిందని అని సింగ్ పట్టి చూపారు. ట్రాఫిక్ ఎంత ఉన్నప్పటికీ భద్రత నివారణ చర్యలను నిరంతరం కొనసాగాలని ఆయన అన్నారు.
విమానయాన భద్రత పట్ల అవగాహనను పెంచేందుకు, ఎఎఐ విమానాశ్రయాలలోనూ, ఎఎన్ ఎస్ స్టేషన్లలో ఉద్యోగులను భాగస్వాములను చేసేందుకు నకిలీ వ్యాయామాలు, నివారణ నిర్వహణ తదితర కార్యక్రమాలను, పత్రాలు, సౌకర్యాల సమీక్ష సహా వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నట్టు చెప్పారు. ఈ విషయంపై అవగాహనను పెంచేందుకు వివిధ సామాజిక ప్రచారాలను ప్రారంభించనున్నారు. ఎఎఐ కార్యాలయాలు, కార్యనిర్వహణ కేంద్రాల వద్ద అంతర్గత, బహిర్గత భాగస్వాములకు భద్రతా అవగాహన వారం ప్రాముఖ్యతను తెలియచెప్పేందుకు బ్యానర్లు, పోస్టర్లను ప్రదర్శిస్తున్నారు.
ఈ సందర్భంగా డిజిసిఎ డడిజి మనీష్ కుమార్ మాట్లాడుతూ, 2030 నాటికి ఐసిఎఒ తన అంతర్జాతీయ విమానయాన భద్రతా ప్రయణాళిక (జిఎఎస్‌పి -2020-22) ఆశించినట్టుగా ఒక్క మృతి కూడా లేకుండా చేయాలన్న దీర్ఘకాలిక లక్ష్యాన్ని భాగస్వాముల భద్రతా వ్యవస్థలను సరిగ్గా నిర్వహణ ద్వారా సాధించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
స్థానిక విమానాశ్రయాలలో విమాన కార్యకలాపాల భద్రతను కాపాడడంలో చుట్టు పక్కల ఉన్న సమాజం పాత్ర పట్ల అవగాహన పెంచేందుకు, ఎయిర పోర్్ట డైరెక్టర్లు పాఠశాలలు, కళాశాలల్లో విమానయాన భద్రత పట్ల స్థానిక ప్రజల పాత్రను గురించి అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తారు.
****
(Release ID: 1675228)
Visitor Counter : 209