ఆయుష్

భవిష్యత్-ఆధారిత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థగా - ప్రకృతి వైద్యం

प्रविष्टि तिथि: 20 NOV 2020 5:50PM by PIB Hyderabad

భవిష్యత్-ఆధారిత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థగా ప్రకృతి వైద్యం యొక్క పెరుగుతున్న అవగాహన మరియు ఆరోగ్యంపై గాంధేయ ఆలోచనల యొక్క సతత హరిత ఔచిత్యం, ప్రకృతి వైద్య దినోత్సవం, 2020 యొక్క కార్యకలాపాలలో ఆధిపత్యం వహించిన రెండు ఇతివృత్తాలు.  వర్చువల్ కార్యక్రమంలో కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీ శ్రీపాద్ యెస్సో నాయక్, కార్యదర్శి (ఆయుష్) వైద్య రాజేష్ కోటేచా, యు.జి.సి. వైస్ చైర్మన్ డాక్టర్ భూషణ్ పట్వర్ధన్ మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.  

ప్రకృతి వైద్య దినోత్సవం దేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 18వ తేదీన జరుపుకుంటున్నాము. ఇదే రోజున మహాత్మా గాంధీ నేచర్ క్యూర్ ఫౌండేషన్ ట్రస్ట్ యొక్క లైఫ్ మెంబర్ అయ్యారు మరియు ఈ దస్తావేజుపై సంతకం చేశారు.  భారతదేశంలో ప్రకృతి వైద్యానికి వ్యవస్థాపక వ్యక్తిగా గాంధీజీని పరిగణిస్తారు, ఎందుకంటే ఐరోపాలో ఉద్భవించిన ఈ అభ్యాసం భారతదేశంలో ప్రాచుర్యం పొందింది.    

రెండు రోజుల పాటు నిర్వహించే తృతీయ ప్రకృతి వైద్య దినోత్సవాన్ని, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యోగా & నేచురోపతి (సి.సి.ఆర్.వై.ఎన్) ప్రారంభించింది. ఆన్-లైన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చాలా మంది పాల్గొన్నారు.  ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీ నాయక్ ప్రసంగిస్తూ, ఆరోగ్యం గురించి మహాత్మా గాంధీ యొక్క భావనలను మరియు జాతీయ ప్రధాన స్రవంతిలో దాని ప్రాముఖ్యతను గుర్తుచేశారు.  ముఖ్యంగా, వ్యక్తిగత పరిశుభ్రత, పారిశుధ్యం, ఆహారం మరియు జీవనశైలి దాని నివారణలో చాలా ప్రాముఖ్యత వహిస్తున్న కోవిడ్ -19 కాలంలో కూడా, బాపు మాటలు, నిజమని ఆయన అన్నారు.  ప్రకృతి వైద్య చికిత్సా కేంద్రాలకు పెద్ద సంఖ్యలో రోగులు ఆకర్షితులవుతున్నారని, ఈ సంస్థల భాగస్వామ్యంతో పరిశోధనలు ప్రారంభించాలని సి.సి.ఆర్.‌వై.ఎన్. ‌ను ప్రోత్సహించారని మంత్రి పేర్కొన్నారు.   దేశవ్యాప్తంగా ఎయిమ్స్ మరియు పి.జి.ఐ. ల వంటి ప్రసిద్ధ సంస్థలలో మైండ్-బాడీ మెడిసిన్ కేంద్రాలను ప్రారంభించడానికి సి.సి.ఆర్.వై.ఎన్.  చేసిన ప్రయత్నాల గురించి కూడా ఆయన పేర్కొన్నారు.  ఆయుష్ కార్యదర్శి శ్రీ వైద్య రాజేష్ కోటేచా, ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ, ప్రకృతి వైద్యాన్ని ప్రోత్సహించడానికి మంత్రిత్వ శాఖ ప్రస్తుతం చేపట్టిన, భవిష్యత్తులో చేపట్టబోయే కొన్ని కార్యక్రమాల గురించి వివరించారు.  నియంత్రణ యంత్రాంగాన్ని, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యా సంస్థలను ఏర్పాటు చేయడానికి చేపట్టిన ప్రయత్నాలు కూడా ఇందులో ఉన్నాయి.

పూణేలోని జాతీయ ప్రకృతి వైద్య విజ్ఞాన సంస్థ (ఎన్.ఐ.ఎన్) కూడా ఉన్నత స్థాయి ఈ-ఈవెంట్‌ను నిర్వహించింది. యోగా మరియు నేచురోపతి వైద్య కళాశాలలు, ప్రీమియర్ నేచురోపతి ఆసుపత్రులు, క్లినిక్‌ల సహకారంతో మూడు రోజులపాటు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మహమ్మారి సందర్భంలో జీవకళ యొక్క భావనను ఎన్.ఐ.ఎన్. ప్రోత్సహిస్తోంది.  ఈ సంఘటనల కోసం "కోవిడ్ -19 కు వ్యతిరేకంగా జన్ ఆందోళన్", "రోగనిరోధక శక్తి కోసం ఆయుష్" మరియు "ప్రకృతివైద్యం ద్వారా జీవశక్తిని పెంపొందించడం" అనే ఇతివృత్తాలను ఎంపిక చేసి ప్రచారం కల్పించారు.

ప్రకృతి వైద్య విజ్ఞాన జాతీయ సంస్థ 2020 అక్టోబర్, 2వ తేదీ నుండి 48 రోజుల పాటు, 48 వెబినార్లతో, ప్రకృతి వైద్య దినోత్సవంతో ముగిసే విధంగా ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహించింది.  ఆరోగ్యంపై మహత్మా గాంధీ ఆలోచనలను మరియు ఆరోగ్య నిర్ణాయకుల యొక్క వివిధ అంశాల గురించి ఆరోగ్య సంరక్షణ నిపుణులను ఉత్సాహపర్చడం ఈ వెబినార్ల ఉద్దేశ్యం. గాంధీ అధ్యయనాల గాంధీ పరిశోధనా సంస్థ, గాంధీ భవన్, గాంధీ స్మారక నిధి, వంటి వివిధ గాంధేయ సంస్థలు కలిసి ఈ విబినార్లను నిర్వహించాయి.  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ వక్తలు ఈ భారీ కార్యక్రమంలో ప్రసంగించారు.

ప్రకృతివైద్యం మరియు ప్రపంచవ్యాప్తంగా కొత్త అనుచరులను కనుగొనడంలో ఆరోగ్య విషయంలో స్వీయ బాధ్యతపై దాని దృష్టి గురించి,  ప్రకృతి వైద్య విధానానికి అనేక జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థల ద్వారా ఇతర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలతో సహకరించడానికి పెరుగుతున్న అవకాశాల గురించి,  ఈ సందర్భంగా వేర్వేరు వక్తలు తమ ప్రసంగాల్లో  పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ  వైద్య రాజేష్ కోటేచా మాట్లాడుతూ,  దేశవ్యాప్తంగా ఉన్న ప్రకృతి వైద్యులందరికీ తన శుభాకాంక్షలు తెలిపారు.  వినూత్నమైన పనిని నిర్వహించడానికి మరియు ఇతర ఆయుష్ వ్యవస్థలతో ప్రకృతివైద్యం యొక్క ఏకీకరణ యొక్క అవకాశాలను అన్వేషించడానికి రాబోయే నిసర్గ్ గ్రామ్ ప్రాజెక్ట్ యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. 

ఆయుష్ మంత్రి శ్రీ శ్రీపాద యెస్సో నాయక్ వీడియో సందేశం ద్వారా ఈ-ఈవెంట్ ‌లో పాల్గొన్నారు. పూణేలోని గోహేబుద్రుక్ వద్ద ప్రారంభించిన, గిరిజన ప్రాజెక్టుతో సహా గత సంవత్సరంలో ఎన్.ఐ.ఎన్.  చేసిన కృషిని ఆయన ప్రశంసించారు.  దేశంలోని మారుమూల ప్రాంతాలలో మెరుగైన ఆరోగ్యంతో పాటు, ప్రజల అభివృద్ధికి వీలుగా ప్రకృతివైద్యం యొక్క సామర్థ్యాన్ని ప్రాచుర్యములోకి తీసుకురావడానికి, ఇటువంటి కార్యక్రమాలు అవసరమని ఆయన పేర్కొన్నారు.  

బ్రహ్మాండమైన దృష్టితో ప్రకృతివైద్యం యొక్క భారతదేశ నమూనాను రూపొందించాలని యు.జి.సి. వైస్ చైర్మన్ డాక్టర్ భూషణ్ పట్వర్ధన్ దేశంలోని ప్రకృతి వైద్యులకు పిలుపునిచ్చారు.  బహుళ శాస్త్ర సంబంధమైన విధానం అనుసరణీయంగా ఉంటుంది.  భవిష్యత్తు వ్యాధి విజ్ఞాన శాస్త్ర యుగంగా  కాకుండా ఇంద్రియ విజ్ఞాన శాస్త్ర  యుగంగా ఉంటుంది.  ఔషధం ద్వారా ఆరోగ్యం అస్పష్టంగా ఉంది మరియు రాబోయే సంవత్సరాల్లో ఆరోగ్యం ప్రకృతి వైద్యంపై ఎక్కువ ఆధారపడుతుంది.  ప్రజల మనస్తత్వంలో ప్రధానంగా మార్పు రాకపోతే, ఈ భూగోళం రోజు రోజుకు అనారోగ్యంగా, మరింత అనారోగ్యంగా తయారౌతుంది.   అందువల్ల, ప్రకృతి వైద్య చికిత్స లో నూతన విధానాల ఆవిష్కరణలకు ప్రస్తుతం డిమాండ్ ఉంది. ఇతర ఆధునిక శాస్త్రాలతో ఇది అనుసంధానమై ఉండాలి. 

*****


(रिलीज़ आईडी: 1674628) आगंतुक पटल : 225
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , English , हिन्दी , Tamil