పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ ఇంధన వ్యవహారాలకు కేంద్రంగా భారత్ అభివృద్ధి చెందింది: ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ
దేశానికి నిర్దిష్టమైన మరియు సరసమైన నూతన సాంకేతిక ఆవిష్కరణలు అవసరం: శ్రీ ప్రకాష్ జవదేకర్
Posted On:
19 NOV 2020 7:17PM by PIB Hyderabad
అంతర్జాతీయ ఇంధన వ్యవహారాల కేంద్ర దశకు భారత్ చేరిందని, ఇతర పెద్ద అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు ఇది ఒక రోల్ మోడల్ అని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఇఎ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాతిహ్ బైరోల్ అన్నారు. అంతర్జాతీయ వాతావరణం మరియు స్థిరమైన ఇంధన లక్ష్యాలను చేరుకోవటానికి సాంకేతిక అవసరాలు మరియు అవకాశాలపై దృష్టి సారించేందుకు ఐఇఎ చేపట్టిన ఎనర్జీ టెక్నాలజీ పెర్స్పెక్టివ్స్ 2020 వర్చువల్ లాంచ్‌లో ఆయన మాట్లాడుతూ.. ఉజ్వలా మరియు ఉజాలా వంటి పథకాల ద్వారా లక్షలాది మందికి క్లీన్ ఎనర్జీని అందించడంలో భారత ప్రభుత్వం చేసిన కృషిని బైరోల్ ప్రశంసించారు.
పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్ ముఖ్య ఉపన్యాసం ఇస్తూ " అంతర్జాతీయ ఇంధన నివేదిక చాలా ముఖ్యమైనది. అనేక ముఖ్యమైన సమస్యలను అది లేవనెత్తింది. పారిస్‌లో సమర్పించిన ఎన్‌డిసిలకు అనుగుణంగా 2 డిగ్రీల కంప్లైంట్ ఉన్న జి -20 దేశాలలో నేడు భారతదేశం మాత్రమే ఉన్నదని, వాతావరణ మార్పులపై పోరాడడంలో ప్రభుత్వ స్థాయిలోనే కాకుండా ప్రైవేట్ స్థాయిలో కూడా అనేక నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నామని మంత్రి వివరించారు. అది సమస్యల పరిష్కారంలో తమ నిబద్ధతను చాటుతోందని తెలియజేశారు.
2050 గురించి మాట్లాడటానికి బదులు, 2020, 2030 మరియు 2040 గురించి మాట్లాడాలని..దశలవారీగా లక్ష్యాలని నిర్దేశించుకుని వాటిని సాధించడానికి దేశాలు కట్టుబడి ఉండాలని మంత్రి ప్రపంచదేశాలకు విజ్ఞప్తి చేశారు.
క్లీన్ ఎనర్జీని మరియు మెరుగైన వాతావరణాన్ని అందించడంలో ఆర్థిక మరియు సాంకేతిక పరిజ్ఞానం యొక్క ముఖ్య పాత్రను వివరించిన శ్రీ జవదేకర్.. దేశంలోని నిర్దిష్ట, తగిన మరియు సరసమైన సాంకేతిక పరిజ్ఞానం అవసరమని తెలిపారు. వాతావరణ మార్పులపై చర్యలకు చాలా ఖర్చవుతుందని దానికోసం ప్రజలపై పన్నులు విధించలేమని చెప్పారు.
పునరుత్పాదక ఇంధనంపై భారతదేశం తీసుకున్న చర్యలపై పర్యావరణ మంత్రి మాట్లాడుతూ..భారతదేశం యొక్క పునరుత్పాదక శక్తి ఇప్పుడు 89 జీడబ్లూ ఉంది. గత 6 సంవత్సరాల్లో ఇది 170% పెరిగింది. ఇది గణనీయమైన పెరుగుదల అని తెలిపారు. "మా గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ 2022 నాటికి 175 జీడబ్లూల పునరుత్పాదక ఇంధన శక్తిని లక్ష్యంగా నిర్దేశించారని...450 జిడబ్లూల పునరుత్పాదకకు చేరడమే తమ ఆకాంక్ష" అని శ్రీ జవదేకర్ అన్నారు.
"మేము ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నాము అదే సమయంలో ఈ-వాహనాలను భారీగా ఇస్తున్నాము. అలాగే విద్యుత్ వాహనాలకు డిమాండ్ పెరగడంతో పాటు ధరలు తగ్గుతున్నాయి. మరింత బ్యాటరీ ఛార్జింగ్ కోసం మౌలిక సదుపాయాలను మెరుగు పరుస్తున్నాము. బ్యాటరీ మార్పిడి విధానం కూడా అనుసరిస్తున్నాము. ఇప్పటికే అనేక నగరాల్లో పనిచేస్తున్న ఎలక్ట్రికల్ బస్సులకు మేము సబ్సిడీ ఇస్తున్నాము ”అని మంత్రిత్వశాఖ తెలిపింది. ఇంధన రంగంలో భారతదేశం భారీగా కృషి చేస్తోందని.. ప్రభుత్వం ఆ దిశలో అవిశ్రాంతంగా పనిచేస్తోందని అన్నారు.
ఈ రోజు విడుదల చేసిన ఐఈఏ నివేదికలో ఇతర విషయాలతోపాటు మౌలిక సదుపాయాలు మరియు సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్దికి, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు ఎలాంటి విధానాలు అవలంభిస్తున్నాయి, తక్కువ ఉద్గారాలను విడుదల చేయడంలో ప్రభుత్వాలు ఎలా పెద్ద పాత్ర పోషిస్తాయనే దానిపై వివరాలు ఉన్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయడానికి, పరిశోధన, అభివృద్ధి మరియు ప్రదర్శనకు ప్రోత్సాహం అందించడం మరియు అంతర్జాతీయ సాంకేతిక సహకారాన్ని విస్తరించే మౌలిక సదుపాయాలను స్వీకరించడం, అభివృద్ధి చేయడం మరియు అప్‌గ్రేడ్ చేయడం వంటివి ఉన్నాయి.
శ్రీ ప్రకాష్ జవదేకర్ యొక్క పూర్తి ప్రసంగం చూడండి:
(Release ID: 1674208)
Visitor Counter : 231