రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

15 ఏళ్లు పూర్తి చేసుకున్న 'సెంటర్‌ ఫర్‌ ల్యాండ్‌ వార్‌ఫేర్‌ స్టడీస్‌' (క్లాస్‌)ను అభినందించిన సైన్యాధిపతి

Posted On: 19 NOV 2020 4:40PM by PIB Hyderabad

భారత సైన్యానికి అనుబంధంగా ఉన్న స్వతంత్ర మేధో సంస్థ 'సెంటర్‌ ఫర్‌ ల్యాండ్‌ వార్‌ఫేర్‌ స్టడీస్‌' (క్లాస్‌)ను 2005లో స్థాపించారు. 18.11.2020తో ఇది 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా, "షిఫ్టింగ్‌ డొమైన్స్‌ ఆఫ్‌ వార్‌ఫేర్‌ విత్‌ స్పెషల్‌ ఫోకస్‌ ఆన్‌ చైనాస్‌ ఇంక్రీజింగ్‌ అడ్వెంచరిజమ్‌" అంశంపై 'క్లాస్‌' ఒక సెమినార్‌ కమ్‌ వెబినార్‌ను నిర్వహించింది.

    సైన్యాధ్యక్షుడు, 'క్లాస్‌' మార్గదర్శి ఎం.ఎం.నరవణే మాట్లాడుతూ, డిస్రప్టివ్‌ సాంకేతికతలో సామర్థ్యం పెంపు, ముఖ్య సామర్థ్యాల బలోపేతం, వ్యూహాత్మక భాగస్వామ్యాల పెంపు అంశాల ప్రాముఖ్యతను నొక్కివక్కాణించారు. "స్కాలర్‌ వారియర్‌ పురస్కారాన్ని" అందించడంతోపాటు, 'క్లాస్‌' ప్రచురించిన 'వింటర్-2020' సంచికను ఆవిష్కరించారు.

    యువతలో వ్యూహాత్మక సంస్కృతిని ప్రోత్సహించే ఫీల్డ్ మార్షల్‌ మానిక్‌ షా వ్యాసరచన పోటీ, పరిశోధన ఆధారిత క్షేత్ర పర్యటనలు, వ్యూహాత్మక దూరదృష్టి కార్యక్రమాలతోపాటు ఇంకా అనేక విభిన్న చర్యలు 'క్లాస్‌'ను ప్రత్యేకంగా నిలబెట్టాయని సైన్యాధిపతి ఎం.ఎం.నరవణే ప్రశంసించారు. మారుతున్న భద్రత పరిస్థితుల్లో దేశ వ్యూహాత్మక, సైనిక ఆలోచనలను చురుగ్గా ముందుకు తీసుకెళ్లడం, జాతీయ భద్రత, జాతి నిర్మాణంలో భాగస్వామ్యం దిశగా 'క్లాస్‌' చూపిస్తున్న నిబద్ధతను కూడా అభినందించారు.

***


(Release ID: 1674077) Visitor Counter : 162


Read this release in: Tamil , English , Urdu , Hindi