ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

పి.ఎం-ఎఫ్.‌ఎం.ఈ. పథకంలో సామర్థ్యం పెంపొందించే భాగాన్ని ప్రారంభించిన - శ్రీ నరేంద్ర సింగ్

పి.ఎం-ఎఫ్.‌ఎం.ఈ. పధకం, స్వావలంబన భారతదేశం పట్ల ప్రధానమంత్రి సంకల్పానికి అనుగుణంగా ఉంది : నరేంద్ర సింగ్ తోమర్


భారతదేశ జి.ఐ.ఎస్. ఓ.డి.ఓ.పి. డిజిటల్ మ్యాప్‌ను విడుదల చేసిన - కేంద్ర ఎఫ్.‌పి.ఐ. మంత్రి

Posted On: 18 NOV 2020 5:13PM by PIB Hyderabad

కేంద్ర ఎఫ్.పి.ఐ. శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తేలి, సమక్షంలో, కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ సంస్థల క్రమబద్ధీకరణ పధకం (పి.ఎం-ఎఫ్.‌ఎం.ఈ. పధకం) లో సామర్థ్యం పెంపొందించే భాగాన్ని ఆన్-లైన్ మాధ్యమంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు జి.ఐ.ఎస్. ఒక జిల్లా, ఒక ఉత్పత్తి (ఓ.డి.ఓ.పి) డిజిటల్ మ్యాప్ ను కూడా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా శ్రీ తోమర్ మాట్లాడుతూ, “భారతదేశాన్ని స్వావలంబన చేయడమే, మన ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి సంకల్పం.  మన భవిష్యత్తు మార్గం స్థానికంగానే ఉంది - స్థానిక తయారీ, స్థానిక మార్కెట్ మరియు స్థానిక సరఫరా వ్యవస్థ.  పి.ఎం-ఎఫ్.‌ఎం.ఈ. పధకం లో, సామర్ద్యాన్ని పెంపొందించడం ఒక ముఖ్యమైన భాగం.  ఆహార ప్రాసెసింగ్ సంస్థల వ్యవస్థాపకులతో పాటు, స్వయం సహాయక బృందాలు / ఎఫ్.‌పి.ఓ.లు / సహకార సంస్థలు, కార్మికులు, ఈ పథకం అమలుతో సంబంధం ఉన్న ఇతర భాగస్వాములు వంటి వివిధ సమూహాలకు, ఈ పధకం కింద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.” అని తెలియజేశారు.

ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికి వీలుగా ప్రణాళిక మరియు పర్యవేక్షణలో పాల్గొన్న మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులందరినీ ఆయన అభినందించారు.  సూక్ష్మ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఈ నూతన చర్య ఒక శుభారంభమని ఆయన అభివర్ణించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ తేలి కీలకోపన్యాసం చేస్తూ, “సూక్ష్మ సంస్థలకు చెందిన రైతు ఉత్పత్తి సంస్థల సభ్యులు, స్వయం సహాయక బృందాలు, సహకార సంస్థలు, గిరిజన సంఘాలు మరియు ఇతరులతో సహా దాదాపు 8 లక్షల మందికి శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రయోజనం చేకూర్చాలని ఈ పధకం లక్ష్యంగా పెట్టుకుంది.  భాగస్వాములందరికీ, ఓ.డి.ఓ.పి. ఉత్పత్తి గురించి వివరణాత్మక సమాచారాన్ని, డిజిటల్ ఓ.డి.ఓ.పి. మ్యాప్ అందిస్తుంది”. అని పేర్కొన్నారు.

పి.ఎమ్-ఎఫ్.ఎం.ఈ. పథకం యొక్క సామర్థ్యం పెంపొందించే భాగం కింద, మాస్టర్ ట్రైనర్స్ యొక్క శిక్షణ ఆన్ ‌లైన్ విధానంలోనూ, తరగతి గదుల్లో ఉపన్యాసం, ప్రదర్శన మరియు స్వీయ-వేగవంతమైన ఆన్ ‌లైన్ అధ్యయన పాఠ్యాంశాల ద్వారా అందించబడుతుంది.  రాష్ట్ర స్థాయి సాంకేతిక సంస్థల భాగస్వామ్యంతో ఎంపిక చేసిన సంస్థలు / సమూహాలు / బృందాలకు శిక్షణ మరియు పరిశోధన సహాయాన్ని అందించడం ద్వారా ఎన్.ఐ.ఎఫ్.టి.ఈ.ఎం. మరియు ఐ.ఐ.ఎఫ్.‌పి.టి. సంస్థలు ఈ పధకం అమలులో కీలక పాత్ర పోషిస్తున్నాయి.  మాస్టర్ ట్రైనర్లు జిల్లా స్థాయి శిక్షకులకు శిక్షణ ఇస్తారు, వారు తిరిగి లబ్ధిదారులకు శిక్షణ ఇస్తారు.  పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్ మరియు ఈ.డి.పి. పై ఆధారపడి ప్రస్తుత శిక్షణ ఉంటుంది.  ఇందు కోసం, వివిధ జాతీయ స్థాయి ప్రఖ్యాత సంస్థల నుండి విషయ నిపుణులు వివిధ తరగతులు నిర్వహిస్తున్నారు. సామర్థ్యం పెంపు కింద శిక్షణా కార్యక్రమం యొక్క అంచనా మరియు ధృవీకరణలను ఎఫ్.ఐ.సి.ఎస్.ఐ. సంస్థ అందిస్తోంది.  సామర్థ్యం పెంపొందించే ఈ శిక్షణా కార్యక్రమం నిన్న ప్రారంభించబడింది.

పి.ఎం-ఎఫ్.‌ఎం.ఈ. పథకం కింద, ప్రస్తుతం ఉన్న క్లస్టర్లు, ముడి పదార్థాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని ఆయా జిల్లాల ఆహార ఉత్పత్తులను రాష్ట్రాలు గుర్తించాయి.  భారతదేశం యొక్క జి.ఐ.ఎస్. ఓ.డి.ఓ.పి. డిజిటల్ మ్యాప్ అన్ని రాష్ట్రాల ఓ.డి.ఓ.పి. ఉత్పత్తుల వివరాలను అందించడం ద్వారా వాటాదారులకు తగిన సౌకర్యాలు కల్పిస్తుంది. డిజిటల్ మ్యాప్ ‌లో గిరిజన, ఎస్సీ, ఎస్టీ, ఆకాంక్ష జిల్లాలకు సంబంధించిన సూచికలు కూడా ఉన్నాయి.  తమ విలువను పెంపొందించుకునే వ్యవస్థను అభివృద్ధి చేసుకోడానికి అవసరమైన సమిష్టి ప్రయత్నాలు చేపట్టడానికి, ఈ సమాచారం, వాటాదారులకు తగిన అవకాశాలను కల్పిస్తుంది.

పి.ఎమ్-ఎఫ్.ఎం.ఈ. పథకం గురించి

ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద ప్రారంభించిన, సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ సంస్థల క్రమబద్ధీకరణ పధకం (పి.ఎం-ఎఫ్.‌ఎం.ఈ. పధకం)  కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం.  ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమకు చెందిన అసంఘటిత విభాగంలో ఉన్న వ్యక్తిగత సూక్ష్మ సంస్థల పోటీతత్వాన్ని పెంచడం, ఈ పధకం లక్ష్యం.  2020-21 నుండి 2024-25 వరకు ఐదేళ్ల కాలంలో 10,000 కోట్ల రూపాయల వ్యయంతో, ఈ రంగాన్ని అధికారికంగా ప్రోత్సహించడం కోసం,  రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, స్వయం సహాయక బృందాలు, ఉత్పత్తిదారుల సహకార సంస్థలకు వారి మొత్తం ఉత్పత్తుల విలువను పెంపొందించుకోడానికి అవసరమైన సహాయాన్ని ఈ పధకం అందిస్తుంది.  ఇప్పటికే ఉన్న సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ సంస్థల స్థాయి పెంచి, అభివృద్ధి చేయడం కోసం ఆర్థిక, సాంకేతిక మరియు వ్యాపార సహాయాన్ని అందించడానికి, 2,00,000 సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లకు నేరుగా సహాయం చేయాలన్నది ఈ పథకం సంకల్పం. 

*****



(Release ID: 1673891) Visitor Counter : 220