మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
లీలావతి అవార్డు -2020ని ఆవిష్కరించిన కేంద్ర విద్యా శాఖ మంత్రి శ్రీరమేష్ పోఖ్రియాల్ నిశాంక్,.
మహిళలకు సాధికారత కల్పించే ఎఐసిటిఇ వినూత్న విద్యా కార్యక్రమం.
మన దేశ బాలికలు స్వావలంబన సాధించడానికి, ఆత్మవిశ్వాసం కలిగి ఉండడానికి విజయంసాధించడానికి వారికి నాణ్యమైన విద్యను అందించడం అవసరం : శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్
Posted On:
17 NOV 2020 7:47PM by PIB Hyderabad
కేంద్ర విద్యాశాఖ మంత్ఇర శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, ఈరోజు లీలావతి అవార్డు 2020ని వర్చువల్‌గా ఆవిష్కరించారు. ఇది మహిళలకు సాధికారత కల్పించేందుకు ఎఐసిటిఇ వారి వినూత్న విద్యా కార్యక్రమం.మహిళల సాధికారత ఈ కార్యక్రమం ముఖ్యాంశం అయినందున పారిశుధ్యం, పరిశుభ్రత, ఆరోగ్యం,పౌష్టికాహారం, అక్షరాస్యత, ఉపాధి,సాంకేతిక పరిజ్ఞానం, రుణసదుపాయం, మార్కెటింగ్, వినూత్న ఆవివష్కరణలు, నైపుణ్యాభివృద్ధి , సహజవనరులు, మహిళల హక్కుల పై వారిలో చైతన్యం కలిగించడం ఈ అవార్డు లక్ష్యంగా ఉంది. ప్రోఫెసర్‌రాజీవ్‌కుమార్ మెంబర్ సెక్రటరీ, ఎఐసిటిఇ, అలాగే ఎఐసిటిఇ ఛైర్మన్ ప్రొఫెసర్ అనిల్ సహస్రబుధే, వైస్ ఛైర్మన్ ఎఐసిటిఇ ప్రొఫెసర్ ఎం.పి.పూనియా, ఎన్.ఇ.పి ముసాయిదా కమిటీ సభ్యురాలు శ్రీమతి వసుధా కామత్,మంత్రిత్వశాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, లీలావతి అవార్డు 2020ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. బాలికలలో స్వావలంబన, ఆత్మవిశ్వాసం పెంపొందించి వారు విజయాలు సాధించేలా చేసేందుకు వారికి నాణ్యమైన విద్యను అందిచాలన్నారు. అవార్డు ముఖ్యాంశాం మహిళాసాధికారత అని ప్రభుత్వ ప్రాధాన్యతలలో ఇది ఎప్పుడూ ముందుంటుందని ఆయన అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమొదీ నాయకత్వంలో ప్రభుత్వం బాలికలు,మహిళల సమగ్ర అభివృద్ధికి పలు చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు. సుకన్య సమృద్ధి యోజన, బేటి బచావో బేటీ పఢావో ,సిబిఎస్ి ఉదాన్ పథకం,ఇంకా ఎన్నో పథకాలను ప్రభుత్వం చేపట్టినట్టు మంత్రి తెలిపారు. లీలావతి అవార్డు 2020తో ఎఐసిటిఇ మరోసారి మహిళాసాధికారతకు ఛాంపియన్‌గా నిలిచిందని, నాణ్యమైనవిద్య, ఆవిష్కరణలకు మార్గం సుగమం చేసిందన్నారు.
మహిళల కోసం విద్యా మంత్రిత్వశాఖలోని ఇన్నొవేషన్ సెల్ ఎన్నో కార్యక్రమాలు ప్రారంభించిందని అంటూ, స్మార్ట్ ఇండియా హాకథాన్‌గురించి ఆయనప్రస్తావించారు. ఇందులో 6 గురు సభ్యుల బృందంలో కనీసం ఒక మహిళ ఉండాలన్నారు. ఈ రకమైన చొరవ బాలికలు, మహిలలకు ప్రేరణనిస్తాయని అన్నారు. లీలావతి అవార్డునుఏర్పాటు చేసినందుకు ఎఐసిటిఇని మంత్రి అభినందించారు. ఇది దేశంలో మహిళా సాధికారతను పెంపొందిస్తుందని ఆయన చెప్పారు. ఈ అవార్డు ఏర్పాటుతో మహిళల సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకుంటున్న చర్యలు మరింత వేగవంతమౌతాయన్నారు.
ఈ అవార్డు మహిళల ఆరోగ్యం, స్వీయరక్షణ,పారిశుధ్యం,అక్షరాస్యత, ఎంటర్‌ప్రెన్యుయర్‌సషిఫ్ న్యాయపరమైన అంశాలలో చైతన్యం తదితర అంశాలను కవర్‌చేస్తుందన్నారు. ఈ కార్యక్రమం ఉన్నత విద్యాసంస్థలలో మహిళలు ఉన్నత స్థానాలు అలంకరించడానికి, క్రియాశీలంగా పాల్గొనడానికి వీలు కల్పిస్తుందన్నారు.
ఎఐసిటిఇ ఛైర్మన్ ప్రొఫెసర్ అనిల్ డి.సహస్రబుధే మాట్లాడుతూ,
జీవితంలోని అన్ని రంగాలలో మహిళలకు 'సమానత్వం , న్యాయంగా' వ్యవహరించడానికి, ఈ చొరవ వీలు కల్పిస్తుంది. తద్వారా, AICTE ఆమోదించిన సంస్థలలోని వాటాదారులందరికీ ముఖ్యంగా బాలికలకు స్త్రీ,పురుష సమానత్వానికి సంబంధించిన సమస్యలకు పరిష్కారాన్ని అందించడానికి ఒక ప్రత్యేకమైన అవకాశం కలుగుతుంది. నిరక్షరాస్యత, నిరుద్యోగం, ఆర్థిక అంశాలు పౌష్టికాహారం, ప్రసూతి మరణాలు, మానవ హక్కులు మొదలైన వివక్ష. అలాగే, సమాజంలో తమదైన ముద్ర వేయడానికి, మహిళల విముక్తి , సాధికారతను నెలకొల్పడంలో ఇప్పటికే విజయవంతమైన ప్రయత్నం చేసిన వారి ప్రయత్నాలను / సహకారాన్ని వెలుగులోకి తేవడానికి వీలుకలుగుతుందని అన్నారు.
లీలావతి అవార్డ్ 2020 ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా ఎఐసిటిఇ స్టూడెంట్ డవలప్‌మెంట్ విభాగం డైరక్టర్ డాక్టర్ అమిత్ కుమార్ శ్రీవాస్తవ సమావేశ ముగింపు ప్రసంగం, వందన సమర్పణ చేశారు. కేంద్ర విద్యాశాఖమంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ మద్దతు, మార్గనిర్దేశం ద్వారా వినూత్న విద్యా పద్ధతులు, మహిళా సాధికారత దిశగా మరిన్ని మైలురాళ్లు దాటగలమని విశ్వసిస్తున్నట్టు తెలిపారు.
***
(Release ID: 1673650)
Visitor Counter : 209