కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
సామాజికభద్రత కోడ్ 2020 కింద ముసాయిదా నిబంధనలను నోటిఫై చేసిన కేంద్ర కార్మికమంత్రిత్వ శాఖ
Posted On:
15 NOV 2020 1:51PM by PIB Hyderabad
కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వశాఖ సామాజికభద్రత 2020 కోడ్ కింద ముసాయిదా నిబంధనలను13-11-2020న జారీ చేసింది. ఇందుకు సంబంధించి అభ్యంతరాలు,సూచనలను తెలియజేయవలసిందిగా మంత్రిత్వశాఖ ఆయా స్టేక్‌హోల్డర్లకు సూచించింది. సూచనలు, సలహాలను ముసాయిదా నిబంధనలు జారీఅయిన తేదీ నుంచి 45 రోజులలోగా దాఖలు చేయవలసి ఉంటుందని తెలిపింది.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్సు కార్పొరేషన్, గ్రాట్యుటి, మెటర్నిటీ బెనిఫిట్, సోషల్ సెక్యూరిటీ, భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు సంబంధించిన సస్, అసంఘటిత రంగ కార్మికులకు జిగ్ వర్కర్లు, ప్లాట్‌ఫాం వర్కర్లకు సామాజిక భద్రత కు సంబంధించి 2020 సామాజిక భద్రత కోడ్ లోని ప్రొవిజన్ల అమలకు ముసాయిదా నిబంధనలు వీలు కల్పిస్తాయి.
ఈ ముసాయిదా నిబంధనలు అసంఘటిత రంగ కార్మికులకు ఆధార్ అనుసంధానిత రిజిస్ట్రేషన్, స్వీయ రిజిస్ట్రేషన్‌కు వీలు కల్పిస్తుంది. అలాగే జిగ్ వర్కర్లు, ప్లాట్‌ఫారం వర్కర్లకు కేంద్ర ప్రభుత్వ పోర్టల్‌లో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. కేంద్ర కార్మిక , ఉపాధి కల్పన మంత్రిత్వశాఖ ఇప్పటికే ఇందుకు సంబంధించిన పోర్టల్ అభివృద్ధికి కార్యాచరణను ప్రారంభించింది. ఈ కోడ్ కింద రూపొందించిన ఏదైనా సామాజిక భద్రత పథకాన్ని ఎవరైనా అసంఘటితరంగ కార్మికుడు లేదా జిగ్ వర్కర్ లేదా ప్లాట్ ఫాం వర్కర్ పొందాలంటే ఈ పథకంలో పేర్కొన్న విధంగా వివరాలు అందజేస్తూ తన పేరును ప్రభుత్వం రూపొందించే పోర్టల్ లో నమోదు చేసుకోవాలి.
ఈ నిబంధనలు ఆధార్ ఆధారిత రిజిస్ట్రేషన్‌ను భవన ఇతర నిర్మాణ కార్మికుల పేర్ల రిజిస్ట్రేషన్‌కు సూచిస్తున్నాయి. వీరు కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక పోర్టల్ లేదా రాష్ట్ర ప్రభుత్వ లేదా స్టేట్ వెల్ఫేర్‌బోర్డు పోర్టల్ లో పేర్ల నమోదుకు వీలు కల్పిస్తాయి. భవన నిర్మాణకార్మికుడు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వలసపోయినట్టయితే అతను ప్రస్తుతం పనిచేస్తున్న రాష్ట్రంలో ప్రయోజనాలు పొందడానికి అర్హుడు. ఆ కార్మికుడికి ప్రయోజనాలు అందేట్టు చూడాల్సిన బాధ్యత రాష్ట్ర బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డుది.
ఫిక్స్‌డ్ టరమ్ ఎంప్లాయిమెంట్ మీద ఉన్న ఉద్యోగులకు గ్రాట్యుటీ నిబంధనలకు వీలు కల్పించే ప్రొవిజన్లు రూపొందించారు.
ఏదైనా సంస్థ వ్యాపార కార్యకలాపాల రిజిస్ట్రేషన్‌కు, సంస్థను మూసివేస్తే రిజిస్ట్రేషన్ రద్దుకు ఒకే ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్‌కు నిబంధనలు వీలు కల్పిస్తాయి.
ఏదైనా సంస్థ ఇపిఎఫ్ఒ లేదా ఇఎస్ఐసి కవరేజ్ నుంచి వైదొలగడానికి సంబంధించిన షరతులు విధానాల ప్రొవిజన్లను కూడా పొందుపరిచారు.
బిల్డింగ్ ఇతర నిర్మాణ కార్మికులకు సంబంధించి సెస్‌చెల్లింపు విషయంలో స్వీయ అంచనా ప్రక్రియకు అనుసరించాల్సిన నిబంధనలనూ ఇందులో వివరించారు. స్వీయ అంచనాకు, ఎంప్లాయర్ రాష్ట్ర పబ్లిక్ వర్క్స డిపార్టమెంట్‌లేదా సెంట్రల్‌పబ్లిక్ వర్క్స్ డిపార్టమెంటు నిర్ణయించిన రేట్ల ఆధారంగా లేదా రాబడి ఆధారంగా లేదా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అధారిటీకి సమర్పించిన ఖర్చు ఆధారంగా సెస్ లెక్కించవలసి ఉంటుంది
సెస్ చెల్లింపులో జాప్యానికి విధించే వడ్డీ రేట్లను నెలకు 2 శాతం లేదా నెలలో కొంత భాగానికి 1 శాతానికి తగ్గించారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం అసెస్సింగ్ అధికారికి నిర్మాణ స్థలం నుంచి ఏ యంత్రాన్ని, మెటీరియల్‌ను నిర్మాణ స్థలం నుంచి తొలగించరాదని ఆదేశించే అధికారం ఉంది. నిరంతరాయంగా నిర్మాణపనిని నిలిపివేసేఅదికారాన్ని ఈ ముసాయిదా నిబంధనలలో తొలగించారు.అంతేకాకుండా ముసాయిదా నిబంధనల ప్రకారం, బిల్డింగ్, ఇతర నిర్మాణకార్మికుల బోర్డు నుంచి ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతే అసెస్సింగ్ అధికారి నిర్మాణస్థలాన్ని సందర్శించవచ్చు.
అగ్రిగేటర్లు స్వీయ అసెస్‌మెంట్‌ద్వారా తమ కంట్రిబ్యూషన్ చెల్లించేందుకు కూడా నిబంధనలు రూపొందించారు.
సామాజిక భద్రత కోడ్ కింద ముసాయిదా నోటిఫికేషన్ నిబంధనల (హిందీ, ఇంగ్లీషులో)కోసం లింక్‌పై క్లిక్‌చేయండి.
***
(Release ID: 1673066)
Visitor Counter : 282