రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

వచ్చే ఏడాది జనవరి 15న సికింద్రాబాద్‌లో నియామక ప్రక్రియ చేపట్టనున్న సైన్యం

Posted On: 13 NOV 2020 9:39AM by PIB Hyderabad

యూనిట్‌ ప్రధాన కార్యాలయం కోటా కింద, సైనిక నియామక ప్రక్రియను (రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ) వచ్చే ఏడాది జనవరి 18వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు సికింద్రాబాద్‌ ఓవోసీ సెంటర్‌లో నిర్వహించనున్నారు. సోల్జర్‌ టెక్‌ (ఏఈ), సోల్జర్‌ జనరల్‌ డ్యూటీ, సోల్జర్‌ ట్రేడ్స్‌మెన్‌, ఔట్‌స్టాండింగ్‌ స్పోర్ట్స్‌మెన్‌ (ఓపెన్‌ కేటగిరీ) విభాగాల్లో నియామకాలు జరుగుతాయి.

    ఔట్‌స్టాండింగ్‌ స్పోర్ట్స్‌మెన్‌ (ఓపెన్‌ కేటగిరీ) విభాగం అభ్యర్థులు, జనవరి 15వ తేదీన, క్రీడా పరీక్ష కోసం ఏవోసీ సెంటర్‌లోని థాపర్‌ స్టేడియంలో ఉదయం 8 గంటలకల్లా పేర్లు నమోదు చేయించుకోవాలి.

    బాక్సింగ్‌, ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌, హ్యాండ్‌బాల్‌, హాకీ, ఈత, రెజిలింగ్‌, అథ్లెటిక్స్‌, కబడ్డీ క్రీడాకారులు; జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో సీనియర్‌, జూనియర్‌ విభాగాల్లో పాల్గొన్న ధృవపత్రాలతో హాజరుకావాలి. పరిశీలన తేదీ నాటికి రెండేళ్లలోపున్న ధృవపత్రాలనే పరిగణనలోకి తీసుకుంటారు.

    సోల్జర్‌ జనరల్‌ డ్యూటీ కేటగిరీ అభ్యర్థుల వయస్సు 17½- 21 సంవత్సరాల మధ్య ఉండాలి. సోల్జర్‌ టెక్‌ (ఏఈ), సోల్జర్‌ సీఎల్‌కే/ఎస్‌కేటీ &సోల్జర్‌ టీడీఎన్‌ విభాగాల అభ్యర్థుల వయస్సు 17½- 23 సంవత్సరాల మధ్య ఉండాలి.

    సోల్జర్‌ జనరల్‌ డ్యూటీ కేటగిరీ అభ్యర్థులు మెట్రిక్యులేషన్/ఎస్‌ఎస్‌సీలోని ప్రతి సబ్జెక్టులో కనీసం 33%, మొత్తంగా 45% మార్కులు తెచ్చుకుని ఉండాలి. సోల్జర్‌ ట్రేడ్‌మెన్‌ (10వ తరగతి) విభాగానికి 10వ తరగతి, సోల్జర్‌ ట్రేడ్‌మెన్‌ (8వ తరగతి) విభాగానికి 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సోల్జర్‌ టెక్‌ (ఏఈ) అభ్యర్థులు సైన్సు సబ్జెక్టుతో 10+2/ఇంటర్మీడియేట్‌లో (పీఎస్‌ఎం & ఆంగ్లం) 50% మొత్తం మార్కులతో, ప్రతి సబ్జెక్టులో కనీసం 40 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సోల్జర్‌ సీఎల్‌కే/ఎస్‌కేటీ అభ్యర్థులు 10+2/ఇంటర్మీడియేట్‌లో ఏ గ్రూపులోనైనా 60% మొత్తం మార్కులతో, ప్రతి సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. 12వ తరగతిలో ఆంగ్లం, గణితం/అకౌంట్స్‌/ఖాతా పుస్తకాల నిర్వహణ సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులు సంపాదించి ఉండడం తప్పనిసరి.

    ఇతర వివరాలకు; హెడ్‌ క్వార్టర్స్‌ ఏవోసీ సెంటర్‌, ఈస్ట్‌ మారేడుపల్లి, తిరుమలగిరి, సికింద్రాబాద్‌, తెలంగాణ - 500015 చిరునామాలో సంప్రదించవచ్చు. ఈ మెయిల్‌: airawat0804@nic.in. లేదా www.joinindianarmy.nic.in వెబ్‌సైట్‌ను కూడా చూడవచ్చు.

    ఉమ్మడి ప్రవేశ పరీక్షలో తప్పు సమాధానానికి నెగెటివ్‌ మార్కుగా అర మార్కును తీసేస్తారు.

    జనవరిలో కొవిడ్‌ పరిస్థితిని బట్టి నియామక ప్రక్రియ నిర్వహణ ఉంటుంది. నియామక ప్రక్రియ నిర్వహణ కొవిడ్‌ కారణంగా సాధ్యం కాదని భావిస్తే, రద్దు చేసే అధికారం ఏవోసీ సెంటర్ కమాండెంట్‌కు ఉంది.

****(Release ID: 1672607) Visitor Counter : 447