భారత పోటీ ప్రోత్సాహక సంఘం
ఒరిక్స్ కార్పొరేషన్ (ఒరిక్స్) నుంచి ఒరిక్స్ విండ్ ఎస్‌పీవీలను గ్రీన్‌కో ఎనర్జీ హోల్డింగ్స్ (జీఈహెచ్) కొనుగోలు చేయడానికి; జీఈహెచ్‌లో ఈక్విటీ వాటాలను ఒరిక్స్ దక్కించుకోవడానికి సీసీఐ అనుమతి
Posted On:
12 NOV 2020 6:55PM by PIB Hyderabad
ఒరిక్స్ కార్పొరేషన్ (ఒరిక్స్) నుంచి ఒరిక్స్ విండ్ ఎస్‌పీవీస్‌ను గ్రీన్‌కో ఎనర్జీ హోల్డింగ్స్ (జీఈహెచ్) కొనుగోలు చేయడానికి; జీఈహెచ్‌లో ఈక్విటీ వాటాలను ఒరిక్స్ దక్కించుకోవడానికి, పోటీ చట్టం-2002లోని సెక్షన్ 31(1) ప్రకారం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) అనుమతించింది.
గ్రీన్‌కో గ్రూపునకు చెందిన సంస్థ జీఈహెచ్. విద్యుదుత్పత్తి ప్రాజెక్టులను కొనడం, అభివృద్ధి చేయడం, నిర్మించడం, నిర్వహించడం జీఈహెచ్ అనుబంధ సంస్థలు మన దేశంలో చేస్తున్న ముఖ్య వ్యాపారాలు.
ఒరిక్స్ గ్రూపునకు చెందిన సంస్థ ఒరిక్స్. ఇది, కార్పొరేట్ ఆర్థిక సేవలు (చిన్న, మధ్య తరహా సంస్థలకు అప్పులు, లీజులు, పరిష్కారాలు), లీజుల నిర్వహణ (వాహనాల లీజులు, అద్దెలు, ఐటీ సంబంధిత పరికరాల అద్దెలు, లీజులు), స్థిరాస్తి వ్యాపారం, ప్రైవేటు వాటాల పెట్టుబడులు, జీవిత బీమా, బ్యాంకింగ్, అప్పులు, ఆస్తుల నిర్వహణ, పర్యావరణ, విద్యుత్ సేవలు వంటివి అందిస్తోంది.
ఒరిక్స్ విండ్ ఎస్పీవీలు ఒరిక్స్ అనుబంధ సంస్థలు. విద్యుదుత్పత్తి, అనుబంధ సేవలను ఇవి అందిస్తున్నాయి.
ప్రతిపాదిత సమ్మేళనాన్ని అనుసరించి, (i) ఒరిక్స్ గ్రూప్ నుంచి ఒరిక్స్ విండ్ ఎస్పీవీల ఈక్విటీ వాటాలను జీఈహెచ్ పొందుతుంది, (ii) జీఈహెచ్‌లో ఈక్విటీ వాటాలను ఒరిక్స్ సమీకరిస్తుంది.
***
(Release ID: 1672436)
Visitor Counter : 150