రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

సైన్యం ఎదుట లొంగిపోయిన ఉల్ఫా(ఐ) అగ్రనేత ద్రిష్టి రాజ్‌ఖోవా

Posted On: 12 NOV 2020 9:59AM by PIB Hyderabad

సైనిక నిఘా వర్గాల వేగవంతమైన, చక్కటి ప్రణాళికతో ఉల్ఫా(ఐ)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉల్ఫా(ఐ)కి చెందిన కరడుగట్టిన అగ్రనేత ద్రిష్టి రాజ్‌ఖోవా, మేఘాలయ-అసోం-బంగ్లాదేశ్‌ సరిహద్దులో భారత సైన్యం ఎదుట లొంగిపోయాడు. అతనితోపాటు నలుగురు అనుచరులు వేదాంత, యాసిన్‌, రూప్‌జ్యోతి, మిధున్‌ కూడా లొంగిపోయారు. వారి నుంచి భారీ స్థాయిలో ఆయుధాలను సైన్యం స్వాధీనం చేసుకుంది.

    గత 9 నెలలుగా సైన్యం అవిశ్రాంతంగా కొనసాగించిన ప్రయత్నాల ఫలితమే ఈ ఆపరేషన్‌.

    ద్రిష్టి రాజ్‌ఖోవా, చాలాకాలంగా వాంటెడ్‌ జాబితాలో ఉన్న     వ్యక్తి. అనుచరులతో కలిసి దిగువ అసోంలో అనేక కార్యకలాపాలు నిర్వహించాడు. ఈ లొంగుబాటుతో ఉల్ఫా(ఐ)కి కోలుకోలేని దెబ్బేకాదు, ఆ ప్రాంతంలో శాంతి ఉదయిస్తుంది. ఈ ప్రాంతంలో శాంతి స్థాపనకు సైన్యం ఎప్పటికీ కట్టుబడి ఉంటుందన్న విషయాన్ని ఈ ఆపరేషన్‌ మరోమారు రుజువు చేసింది.

 

***(Release ID: 1672193) Visitor Counter : 219