రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

జాతీయ భద్రతపై నేషనల్ డిఫెన్స్ కాలేజీలో ప్రెసిడెంట్స్‌ చైర్ ఆఫ్ ఎక్సలెన్స్

Posted On: 11 NOV 2020 5:47PM by PIB Hyderabad

1960లో నాటి భారత ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభమైన ఎన్‌డిసీ..27 ఏప్రిల్ 2020 నాటికి 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.  "నేషనల్ సెక్యూరిటీ & స్ట్రాటజిక్ స్టడీస్"పై ప్రత్యేకంగా రూపొందించిన 47 వారాల కోర్సును వందమంది సభ్యులతో ఎన్‌డీసీ నిర్వహిస్తోంది. ఆ వంద మందిలో 25 మంది మిత్రదేశాలకు చెందిన సభ్యులు. ప్రస్తుతం ఈ కళాశాలలో 3899 మంది పూర్వ విద్యార్థులు ఉన్నారు. 69 మిత్రదేశాలకు దేశాలకు చెందిన వారు 835 మంది ఉన్నారు. ఈ పూర్వ విద్యార్ధులలో చాలామంది ఆయా సంస్థలలో అత్యున్నత స్థాయికి ఎదిగారు. దేశానికి అంతర్జాతీయ ఖ్యాతిని పెంపొందించడమే కాకుండా.. స్నేహపూర్వక దేశాలతో బలమైన సంబంధాలను పెంపొందించడంలో ఈ కళాశాల ముఖ్యమైన దౌత్య సాధనంగా పనిచేస్తుంది. జాతీయ భద్రతా రూపకల్పనతో పాటు వ్యూహాత్మక విద్యను అందించే అత్యుత్తమ ఏకైక సంస్థగా ఎన్డీసి గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు మేధో మరియు విద్యాపరమైన నైపుణ్యాన్ని పెంచడానికి ఎక్సలెన్స్ ఛైర్‌లను కలిగి ఉన్నాయి.

నేషనల్ డిఫెన్స్ కాలేజీ డైమండ్ జూబ్లీ సందర్భంగా రక్షణ కార్యదర్శి మిస్టర్ అజయ్ కుమార్ మరియు కమాండెంట్ ఎయిర్ మార్షల్ డి చౌదరి సమక్షంలో 11 నవంబర్ 2020న "జాతీయ భద్రతపై ప్రెసిడెంట్ చైర్ ఆఫ్ ఎక్సలెన్స్" ఏర్పాటుకు గౌరవనీయ భారత రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. జాతీయ భద్రతపై ప్రెసిడెంట్ ఛైర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాల యొక్క మేధో మూలధనాన్ని పెంచడంలో సహాయపడటమే కాకుండా, దాని విశ్వసనీయత మరియు ఖ్యాతిని పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

నేషనల్ డిఫెన్స్ కాలేజ్, 06, టీస్ జనవరి మార్గ్, న్యూఢిల్లీలో ప్రెసిడెంట్ చైర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రం ఏర్పాటయింది. విద్యా, పరిపాలనా మరియు లాజిస్టిక్ మద్దతు ఇది కలిగి ఉంది.

***



(Release ID: 1672095) Visitor Counter : 125