రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

గడ్కరీ సమక్షంలో డీఆర్డీఓ భవన్ లో ఎ-శాట్ క్షిపణి నమూనాను రక్షణమంత్రి రాజనాథ్ సింగ్ ఆవిష్కరించారు

Posted On: 09 NOV 2020 6:26PM by PIB Hyderabad

ఢిల్లీలోని డీఆర్డీఓ భవన్లో ఆగస్టులో నెలకొల్పిన ఉపగ్ర నిరోధక (ఏశాట్) క్షిపణి వ్వస్థను రక్షణమంత్రి రాజనాథ్ సింగ్, కేంద్రం రహదారులు, రవాణా,  రహదారుల శాఖ మంత్రి  నితిన్ గడ్కరీ , డీఆర్డీఓ చైర్మన్, డాక్టర్ జి. సతీష్ రెడ్డి ఆవిష్కరించారు. మనదేశంలో తొలిసారిగా తయారు చేసిన ఉపగ్రహ నిరోధక క్షిపణిని గత మార్చిలో ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి విజయవంతంగా నిర్వహించబడింది. తక్కువ ఎత్తులో భూకక్ష్యలో వేగంగా కదులుతున్న ఉపగ్రహాన్ని విజయవంతంగా కచ్చితత్వంలో తటస్థీకరించారు. ఇది చాలా క్లిష్టమైన భారీ కార్యక్రమం. చాలా ఎక్కువ వేగంతో గొప్ప ఖచ్చితత్వంతో నిర్వహించారు.  ఈ భారీ కార్యక్రమం విజయవంతం కావడం వల్ల అంతరిక్షంలో తన ఆస్తులను కాపాడుకునే సామర్ధ్యం ఉన్న నాలుగో దేశంగా భారతదేశం ఎదిగింది. ఈ సందర్భంగా రక్షణమంత్రి  రాజనాథ్ సింగ్ శాస్త్రవేత్తల బృందం చేసిన వినూత్న సాధనను ప్రశంసించారు. డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి మాట్లాడుతూ, ఎ-శాట్ మోడల్ విజయవంతం, భవిష్యత్తులో మరెన్నో సంక్లిష్ల కార్యక్రమాలను చేపట్టేలా డీఆర్డీఓకు స్ఫూర్తిని ఇస్తుందని అన్నారు.

***



(Release ID: 1672085) Visitor Counter : 178