వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి అంతర్జాతీయ పెట్టుబడిదారులను మంత్రి ఆహ్వానించారు
ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహకాల వల్ల భారతదేశం బలంగా, స్వయం సమృద్ధిగా, స్వావలంబనగా మారుతుంది. మన దేశీయ అవసరాలను తీర్చడంతోపాటు ఎగుమతి చేయడానికి సహాయపడుతుంది: గోయల్
ఈ సందర్భంగా ఆయన నాలుగు ‘సి’లను నొక్కి చెప్పారు. కరేజ్ (ధైర్యం), కాన్ఫిడెన్స్ (విశ్వాసం), కంపీటెన్స్ (సమర్థత), కంపాషన్ ( కరుణ) ఉండాలని నొక్కిచెప్పారు
Posted On:
11 NOV 2020 5:56PM by PIB Hyderabad
అంతర్జాతీయ పెట్టుబడిదారులు భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమ, రైల్వే, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి గోయల్ ఆహ్వానించారు. ఫలితంగా వాళ్లు భారీ దేశీయ మార్కెట్ నుండి, భారత్లోని వ్యాపార వాతావరణ అనుకూలతల నుంచి ప్రయోజనాలు పొందవచ్చన్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా 'ఇండియా: డ్రైవర్స్ ఆఫ్ చేంజ్' పేరుతో నిర్వహించిన సదస్సులో ఆయన కీలక ప్రసంగం చేశారు. అంతర్జాతీయ పెట్టుబడులకు దేశం న్యాయమైన విలువను అందిస్తుందని అన్నారు.
గ్లోబల్ వాల్యూ చైన్స్‌లో భారత్‌ను విశ్వసనీయ భాగస్వామిగా పరిగణిస్తున్నారని గోయల్ అన్నారు. భారతదేశంలో పారదర్శక వ్యవస్థ, ప్రజాస్వామ్యం ఉందని ఆయన అన్నారు. ‘కామిటీ ఆఫ్ నేషన్స్’లో స్థానాన్ని సాధించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుందని గోయల్ ప్రకటించారు. డిపార్ట్‌మెంట్ సంకెళ్లను బద్దలు కొడుతూ ప్రభుత్వం ఒక బృందంగా పనిచేస్తోందని ఆయన అన్నారు. దేశంలో భారీగా వ్యాపార అవకాశాలు ఉన్నాయని గోయల్ అన్నారు. వ్యాపారాలను శక్తివంతం చేయడానికి, కొత్త భూభాగాల్లో వ్యాపారాలను అన్వేషించడానికి ధైర్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నామని వివరించారు.
నేటి క్యాబినెట్ నిర్ణయాల గురించి మాట్లాడుతూ, ఆత్మనిర్భర్ కింద భారతదేశ ఉత్పాదక సామర్థ్యాలను పెంపొందించడానికి, ఎగుమతులను మెరుగుపరచడానికి 10 కీలక రంగాలలో ప్రొడక్షన్-లింక్డ్ ప్రోత్సాహక (పిఎల్ఐ) పథకాన్ని ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని వెల్లడించారు. టెలికాం, ఎపిఐలు, వైద్య పరికరాల కోసం ఇంతకుముందు ప్రకటించిన పిఎల్ఐలకు ఆశించిన స్పందన లభించిందని ఆయన అన్నారు. ఈ ప్రోత్సాహకాలు భారతదేశం బలంగా, స్వయం సమృద్ధిగా, స్వావలంబనగా మారడానికి ఉపయోగపడతాయని వివరించారు. పీఎల్ఐలు మన దేశీయ అవసరాలను తీర్చడంలో పాటు ఎగుమతుల పెరుగుదలకు సహాయపడతాయి. రాబోయే 5 సంవత్సరాల్లో ఈ రంగాలకు ప్రభుత్వం మరింత సాయపడుతుందని మంత్రి చెప్పారు. క్లస్టర్ డెవలప్‌మెంట్, లాజిస్టిక్స్ సపోర్ట్ వంటి ఇతర రంగాలకు సంబంధించిన కార్యక్రమాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. సామాజిక రంగాలకు వయబుల్ గ్యాప్ ఫండింగ్ పథకంపై మాట్లాడుతూ ఇది తాగునీరు, ఆరోగ్యం విద్య వంటి సామాజిక రంగాలలో ప్రైవేట్ పెట్టుబడులను తీసుకువస్తుందని, ప్రజల అవసరాలను తీర్చడంలో సహాయపడుతుందని అన్నారు.
భారత ఆర్థిక వ్యవస్థ కోవిడ్ దెబ్బ నుండి బయటపడుతోందని గోయల్ అన్నారు, దేశం తిరిగి వ్యాపారమార్గంలోకి తిరిగి వస్తోందని అనేక నివేదికలు సూచిస్తున్నాయని వెల్లడించారు. పిఎంఐ సూచీ అధిక స్థాయిలో ఉందన్నారు. సేవల సూచీ కూడా పెరిగింది. అక్టోబర్‌లో జిఎస్‌టి వసూళ్లు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 10శాతం ఎక్కువ నమోదయ్యాయని మంత్రి వివరించారు. ఈ ఏడాది సెప్టెంబరులో భారత ఎగుమతులు 5శాతం పెరిగాయి. అక్టోబర్‌లో స్వల్పంగా తగ్గిన తరువాత, నవంబర్ మొదటి వారంలో ఎగుమతులు కూడా 22శాతం వృద్ధిని చూపించాయి. ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తున్నాయని, దిగుమతులు కూడా పెరుగుతున్నాయని చెప్పారు. గత రెండేళ్లలో రైల్వే సరుకు రవాణా గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 15 శాతం ఎక్కువ అని మంత్రి చెప్పారు. భారత కంపెనీల ఇటీవల విడుదల చేసిన త్రైమాసిక ఫలితాలను గమనిస్తే పరిస్థితులు సర్దుకుంటున్నట్టు అర్థమవుతోందని విశదీకరించారు. దేశంలో స్టార్టప్ సంస్కృతి నిజంగా ఊపందుకుందని, కొత్త ఆవిష్కరణలకు స్ఫూర్తిని ఇస్తుందని, ఇప్పుడు భారతదేశ ప్రజలు ఉద్యోగార్ధులుగా కాకుండా ఉద్యోగ సృష్టికర్తలు కావాలని కోరుకుంటున్నారని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా 4సిల గురించి మంత్రి ఉద్ఘాటించారు. 2025 నాటికి భారతదేశం 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని, వచ్చే 7 నుండి 8 సంవత్సరాలలో ఇది పది ట్రిలియన్లకు పెరగాలని ఆయన అన్నారు.
అత్మ నిర్భర్ భారత్ ప్రచారం కార్యక్రమంపై మాట్లాడుతూ, భారతదేశం స్వావలంబన సాధించడం, మరింత బలంతో ప్రపంచంతో పోటీ పడటానికే దీనిని అమలు చేస్తున్నామని వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో రక్షణ, వ్యవసాయం, బొగ్గు, మైనింగ్, అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంతో సహా పలు రంగాలను సరళీకృతం చేశామని ఆయన అన్నారు. ఈ రంగాలలో మరిన్ని ప్రైవేట్ పెట్టుబడులను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. వినియోగదారుడి ఆధారిత వ్యాపారాలు, కీలకం కాని రంగాలకు ప్రభుత్వం దూరంగా ఉండాలని పీయుష్ గోయల్ చెప్పారు.
***
(Release ID: 1672082)
Visitor Counter : 224