జల శక్తి మంత్రిత్వ శాఖ

2వ జాతీయ జల అవార్డులు

Posted On: 10 NOV 2020 2:00PM by PIB Hyderabad

కేంద్ర జల మంత్రిత్వ శాఖ 2019 సంవత్సరానికి గాను 2వ జాతీయ జల అవార్డులను (ఎన్‌డబ్ల్యుఎ) ప్రకటించనుంది. ఈ అవార్డు పంపిణీ కార్యక్రమం 2020 నవంబర్ 11 మరియు 12 తేదీలలో (ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు) వర్చువల్ ప్లాట్‌ఫాం ద్వారా నిర్వహించబడుతుంది. నీటి వనరుల పరిరక్షణ మరియు నిర్వహణ రంగంలో ప్రశంసనీయమైన పని చేస్తున్న వ్యక్తులు / సంస్థలను ప్రోత్సహించడానికి ఈ అవార్డులను ఇవ్వనున్నారు. అలాగే, నీటి ప్రాముఖ్యత గురించి ప్రజలలో అవగాహన కల్పించడానికి మరియు ఉత్తమమైన నీటి వినియోగ పద్ధతులను అనుసరించడంలో వారిని ప్రోత్సహించడానికి ఈ అవార్డులు ఉపయోగపడతాయి. వివిధ విభాగాలలో అవార్డు పొందిన వారికి ప్రశంసా పత్రం, ట్రోఫీ మరియు నగదు బహుమతి ఇవ్వబడుతుంది.

దేశవ్యాప్తంగా జలసంరక్షణకు వ్యక్తులు/సంస్థలు చేసిన కృషిని గుర్తించేందుకు ఎన్‌డబ్యూఏ దృష్టి సారించింది. అలాగే  ''జల సమృద్‌ భారత్‌''పై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. స్టార్టప్‌లు మరియు ప్రముఖ సంస్థలు ఉత్సాహంగా పాల్గొనడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతోంది. నీటి వనరుల పరిరక్షణ, మరియు నిర్వహణ కార్యకలాపాలలో ప్రజలు మరియు సంస్థలకు బలమైన భాగస్వామ్యాన్ని అందించేందుకు మరియు ఆ దిశగా  ప్రోత్సహించేందుకు ఈ అవార్డుల కార్యక్రమం ఎంతగానో ఉపయోగ పడనుంది.

నేషనల్ వాటర్ అవార్డ్స్-2019 కార్యక్రమం 2019 సెప్టెంబర్‌లో MyGov పోర్టల్‌ మరియు CGWB ఈ మెయిల్‌ ద్వారా ప్రారంభించారు. 2019 డిసెంబర్ 31నాటికి అంటే గడువు ముగిసే సమయానికి మొత్తం 1112 చెల్లుబాటు అయ్యే దరఖాస్తులు వచ్చాయి. శ్రీ శశి శేఖర్, మాజీ కార్యదర్శి డివోడబ్లుఆర్, ఆర్‌డి అండ్ జీఆర్‌ అధ్యక్షతన జ్యూరీ కమిటీని ఏర్పాటు చేశారు. దరఖాస్తులను అధ్యయనం చేయడంలో మరియు విజేతలను ఎన్నుకోవడంలోనూ సిజిడబ్ల్యుబి మరియు సిడబ్ల్యుసి సభ్యులతో కూడిన రెండు స్క్రీనింగ్ కమిటీలు జ్యూరీ కమిటీకి సహాయపడ్డాయి. 16 విభాగాల్లో మొత్తం 98 మంది విజేతలను ప్రకటిస్తారు. వాటిలో ఉత్తమ రాష్ట్రం, ఉత్తమ జిల్లా, ఉత్తమ గ్రామ పంచాయతీ, ఉత్తమ పట్టణ స్థానిక సంస్థ, ఉత్తమ పరిశోధన / ఆవిష్కరణ / కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఉత్తమ విద్య / అవగాహన ప్రయత్నం, ఉత్తమ టీవీ షో, ఉత్తమ వార్తాపత్రిక, ఉత్తమ పాఠశాల, ఉత్తమ సంస్థ / ఆర్‌డబ్ల్యుఎ / మత సంస్థ, ఉత్తమ పరిశ్రమ, ఉత్తమ నీటి నియంత్రణ అధికారం, ఉత్తమ నీటి యోధుడు, ఉత్తమ ఎన్జీఓ, ఉత్తమ నీటి వినియోగదారు సంఘం మరియు సిఎస్‌ఆర్ కార్యాచరణకు ఉత్తమ పరిశ్రమలు ఉన్నాయి. ఈ వర్గాలలో కొన్ని దేశంలోని వివిధ మండలాల్లో సబ్‌ కేటగిరీలు ఉంటాయి. విజేతలను ట్రోఫీలు / ప్రశంసాపత్రాలతో సత్కరించబడుతుంది. 'ఉత్తమ రాష్ట్రం', 'ఉత్తమ రాష్ట్రం' మరియు 'ఉత్తమ నీటి నియంత్రణ అధికారం' మినహా మిగిలిన పదమూడు విభాగాల విజేతలకు నగదు బహుమతులు కూడా అందజేస్తారు.

మొదటి రోజు, అనగా నవంబర్ 11, 2020నాటి కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు. జల్ శక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షేఖావత్, జల్ శక్తి సహాయ మంత్రి శ్రీ రత్తన్ లాల్ కటారియా మరియు ఇతర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

రెండవ రోజు అనగా 2020 నవంబర్ 12 న, పర్యావరణ, అటవీ మరియు వాతావరణాశాఖ^మంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. జల్ శక్తి మంత్రి, శ్రీ గజేంద్ర సింగ్ షేఖావత్, జల్ శక్తి సహాయ మంత్రి, శ్రీ రత్తన్ లాల్ కటారియా, మరియు ఇతర ప్రముఖులు కూడా హాజరవుతారు. పర్యావరణవేత్త అనిల్ జోషి (పద్మ అవార్డు గ్రహీత) ఈ రెండు రోజులకు ప్రత్యేక అతిథిగా హాజరవుతారు.

నేషనల్ వాటర్ అవార్డు గ్రహీతలు, ప్రతినిధులు మరియు ప్రేక్షకులు వర్చువల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. విజ్ఞాన్‌భవన్‌లోని హాల్ నెం .5 లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ అవార్డును ఫేస్‌బుక్ https://www.facebook.com/mowrrdgr/live. పేజీలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

***


(Release ID: 1671795)