సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

వ్యాధి నియంత్రణలో సరైన ఆహారమే కీలకం: కేంద్ర మంత్రి,

ప్రముఖ మధుమేహ నిపుణులు డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 08 NOV 2020 8:31PM by PIB Hyderabad

మధుమేహ వ్యాధిగ్రస్తులకు సిఫార్సు చేసే ఆహారాన్నే మిగిలినవాళ్ళు కూడా తీసుకుంటే వాళ్ళకు మధుమేహం వచ్చే అవకాశం లేదని కేంద్రమంత్రి, మధుమేహ వ్యాధి నిపుణుడు కూడా అయిన డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. డిజిటల్ మార్గంలో జ్ఞానాన్ని పెంచుకోవటంలో  మధుమేహ సంబంధ పోషకాహారం అనే అంశం మీద భారత ఫిజీషియన్ల సంఘ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కష్టకాలంలో ఎలా వ్యవహరించాలో కోవిడ్ మనకు నేర్పిందని చెబుతూ భారతీయ సంప్రదాయ వైద్య విధానం ప్రాధాన్యాన్ని అందరూ గుర్తించారన్నారు.

ప్రపంచ మధుమేహ వారం పాటిస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన వెబినార్ లో డాక్టర్ జితేంద్రసింగ్ మాట్లాడుతూ, భారత ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టినప్పటినుంచి స్వదేశీ వైద్య విధానం ప్రాధాన్యాన్ని ప్రపంచం దృష్టికి తెచ్చారన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పాటించాల్సిందిగా ఐక్యరాజ్య సమితిలో ఏకగ్రీవ తీర్మానం ఆమోదింపజేయటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదే విధంగా, స్వదేశీ వైద్య ప్రాధాన్యాన్ని, సంపూర్ణ వైద్యాన్ని  ప్రోత్సహించే క్రమంలో ప్రత్యేకంగా ఆయుష్ పేరుతో ఒక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన ఘనత కూడా మోదీకే దక్కుతుందన్నారు.

కొత్త ప్రమాణాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరాన్ని కోవిడ్ నేర్పిందని డాక్టర్ జితేంద్రసింగ్ అభిప్రాయపడ్దారు. ఇటీవలికాలంలో ప్రజలు మరచిపోయిన పరిశుభ్రత వంటి ఔషధాలకు భిన్నమైన చికిత్స ప్రాధాన్యాన్ని కూడా డాక్టర్లకు కోవిడ్ నేర్పిందన్నారు. కోవిడ్ మహమ్మారి పూర్తయ్యాక కూడా భౌతిక దూరం పాటించటం లాంటి క్రమశిక్షణ వలన మరెన్నో ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచవచ్చునన్నారు.

కోవిడ్ అనంతరం భారత్ కీలకమైన పాత్ర పోషిస్తుందని చెబుతూ అందులో ఈశాన్య ప్రాంతానిది ఇంకా కీలకపాత్ర ని డాక్టర్ జితేంద్రసింగ్ అన్నారు. అభివృద్ధిలో వెదురు చాలా ముఖ్యమని, స్థానికతకోసం గొంతెత్తుదాం అన్న ప్రధాని పిలుపు వెదురు ఉత్పత్తులను మరింత ప్రసిద్ధం చేస్తున్నదన్నారు. వెదురు ఉత్పతులదిగుమతి మీద 20% సుంకం పెంచటం కూడా అందులో భాగమని, కొత్తగా అగర్ బత్తీ యూనిట్లు నెలకొల్పటానికి అది దారితీసిందని చెప్పారు.

భారత ఫిజీషియన్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ అరుళ్ రాజ్  స్వాగతోపన్యాసం చేస్తూ, తమ సంఘం ఎప్పుడూ ఆధారాల ప్రాతిపదికన వైద్యాన్నే నమ్ముతుందన్నారు.  ప్రధానమంత్రి డిజిటల్ ప్రోత్సాహం కారణంగా భారత ఫిజీషియన్ల సంఘం త్వరలోనే అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇండియన్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్  డీన్  ప్రొఫెసర్ శశాంక్ జోషి మాట్లాడుతూ, భారత ఫిజీషియన్ల సంఘం 2103 లో ఏర్పాటైందని, అప్పటినుంచి వివిధ రంగాలకు చెమ్దిన నిపుణులను ఆహ్వానించి ప్రజల బాధను తగ్గించే లక్ష్యంతో  ప్రత్యేక అంశాలమీద  ప్రసంగాలు ఏర్పాటు చేసిందన్నారు. సంఘం అధ్యక్షుడు డాక్టర్ అరుళ్ రాజ్, డాక్టర్ వి. మోహన్, ప్రొఫెసర్ శశాంక్ జోషి, డాక్టర్ అమిత్ సరాఫ్, డాక్టర్ మంగేశ్ తివాస్కర్, శ్రీ అమల్ కేల్షికర్, ఇతర ప్రముఖ వైద్య నిపుణులు, ఉపన్యాసకులు ఈ వెబినార్ లో పాల్గొన్నారు.

<><><><><> 



(Release ID: 1671357) Visitor Counter : 157