ఆర్థిక మంత్రిత్వ శాఖ
తమిళనాడులో ఆదాయపు పన్ను శాఖ సోదాలు
Posted On:
07 NOV 2020 3:02PM by PIB Hyderabad
చెన్నైకి చెందిన ఐటీ గ్రూప్ కి సంబంధించిన కేసులో ఆదాయపు పన్ను శాఖ చెన్నై, మదురై లో 5 చోట్ల సోదాలు చేపట్టింది.
ఈ సోదాల వల్ల సింగపూర్లో రిజిస్టర్ అయిన ఒక కంపెనీలో పెట్టుబడులకు సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయి. దీనిలో రెండు కంపెనీలు హోల్డింగ్ గా ఉన్నాయి. వీటిలో ఒకటి పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్సింగ్ కంపెనీ కింద ఉన్న కంపెనీ అయితే, మరో దానిని శోధిస్తున్నారు.
సోదాలు జరుగుతున్న సంస్థ 72% వాటా కలిగి ఉన్నప్పటికీ చాలా నామమాత్రపు మొత్తాన్ని పెట్టుబడి పెట్టిందని కనుగొనబడింది, మరో సంస్థ 28% వాటా కలిగి ఉంది, కానీ మొత్తం డబ్బును పెట్టుబడి పెట్టింది. ఇది దాదాపు 7 కోట్ల డాలర్లు ప్రయోజనం / లాభం పొందింది, అంటే సుమారు రూ. 200 కోట్లు, సోదాలు జరుగుతున్న గ్రూప్ చేతిలో ఉంది, ఇది రిటర్న్స్ లో కానీ ఎఫ్ఏ షెడ్యూల్‌లో కూడా వెల్లడించలేదు. ఈ విధంగా, షేర్ చందా రూపంలో పొందిన విదేశీ ఆదాయం రూ. 200 కోట్లు, బయటకు వెల్లడించకుండా దాచిపెట్టారు. ఇది వాటాదారుల చేతిలో భారతదేశంలో పన్ను చెల్లించాల్సి ఉండే డబ్బు. అంతేకాకుండా, ఆదాయపు పన్ను రిటర్న్ ఎఫ్ఏ షెడ్యూల్‌లో విదేశీ ఆస్తులను / ప్రయోజనకరమైన ఆసక్తిని బహిర్గతం చేయని కారణంగా బ్లాక్ మనీ యాక్ట్, 2015 కింద చర్యలు ప్రారంభించబడతాయి. ఈ పెట్టుబడి యొక్క ప్రస్తుత విలువ రూ. 354 కోట్లు.
ఈ బృందం ఇటీవల 5 షెల్ కంపెనీలను కొనుగోలు చేసింది, వీటి ద్వారా రూ.337 కోట్లు బోగస్ బిల్లులతో వాస్తవంగా ఎటువంటి వ్యాపారం చేయకుండా ప్రధాన గ్రూప్ సంస్థ నుండి తరలించే ప్రయత్నం జరిగింది. ఈ డబ్బు విదేశాలకు బదిలీ అయి, ప్రధాన మదింపుదారుడి కుమారుడి పేరిట వాటాల కొనుగోలుకు ఉపయోగించబడింది. ఈ సంస్థల ద్వారా నిధులను మళ్లించినట్లు డైరెక్టర్లలో ఒకరు అంగీకరించారు.
రూ 150 కోట్ల విలువైన ప్రాధాన్యత వాటాల కేటాయింపునకు సంబంధించి కూడా ఆధారాలు కనుగొన్నారు.
సోదాల్లోబయటపడిన అంశమేమిటంటే, ఈ గ్రూప్ వడ్డీపై బ్యాంకుల నుండి రుణాలు తీసుకుంది మరియు ఆస్తులలో పెట్టుబడుల కోసం వడ్డీ లేకుండా ఇతర గ్రూప్ కంపెనీలకు మళ్లించింది. ఈ లెక్కన మొత్తం వడ్డీ అనుమతి సుమారు రూ. 423 కోట్లు.
అంతేకాకుండా, ఈ బృందం కనీసం రూ. 500 కోట్లు విలువ చేసే కనీసం 800 ఎకరాల భూమిని, ప్రధాన గ్రూప్ డబ్బుతో వివిధ షెల్ కంపెనీల పేర్లలో కొనుగోలు చేసింది. ఈ లావాదేవీలకు 1988 బినామి ఆస్తి లావాదేవీల నిషేధ చట్టం యొక్క వర్తమానత పరిశీలిస్తున్నారు.
ఐటి నిబంధనలు, 1962 ప్రకారం నిర్ణయించాల్సిన సరసమైన మార్కెట్ విలువ కంటే చాలా తక్కువ ధరకు ప్రస్తుత సంవత్సరంలో గణనీయమైన వాటాదారుల బదిలీ ఉన్నట్లు కూడా గుర్తించారు. అయితే, ఈ సోదాల్లో లెక్కించని ఆదాయాన్ని సుమారు రూ. 1,000 కోట్లు, అందులో రూ. బినామి మరియు బ్లాక్ మనీ యాక్ట్స్ కింద చర్య తీసుకోదగిన సమస్యలతో పాటు, ఇప్పటికే 337 కోట్లు మదింపుదారుడు చేశారు. మరిన్ని సోదాలు జరుగుతున్నాయి.
ఈ సోదాల వల్ల వెయ్యి కోట్ల రూపాయల ఆదాయ వనరులపై సోదాలు జరగగా, దీనిలో రూ.337 కోట్ల గురుంచి అస్సెస్సీ వెల్లడించారు.
****
(Release ID: 1671013)
Visitor Counter : 212