రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

1971 భార‌త్‌- పాక్‌యుద్ధంలో భార‌త సైనిక‌ద‌ళాల విజ‌యానికి గుర్తుగా లోగోను డిజైన్‌చేసే పోటీకి ఎంట్రీల‌ను ర‌క్ష‌ణ‌మంత్రిత్వ‌శాఖ ఆహ్వానిస్తోంది. ఈ పోటీలో గెలుపొందిన వారికి 50,000 రూపాయ‌ల న‌గ‌దు బ‌హుమ‌తి అంద‌జేస్తారు .

Posted On: 05 NOV 2020 6:09PM by PIB Hyderabad

 

1971 డిసెంబ‌ర్‌లో భార‌త సైనిక ద‌ళాలు పాకిస్థాన్‌పై ఘ‌న‌విజ‌యం సాధించాయి. ఇది బంగ్లాదేశ్ ఏర్పాటుకు దారితీసింది.2021 డిసెంబ‌ర్ 16 నాటికి ఈ ఘ‌న‌విజ‌యానికి 50 యేళ్లు  అవుతాయి. అందువ‌ల్ల 2021 సంవ‌త్స‌రాన్ని స్వ‌ర్ణిమ్ విజ‌య్‌వ‌ర్ష్‌గా జ‌రుపుకుంటారు. 2020 డిసెంబ‌ర్ 20 నుంచి 16 డిసెంబ‌ర్ 2021 వ‌ర‌కు ఏడాది పొడ‌వునా ఇందుకు సంబంధించి ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు.  స్వ‌ర్ణిమ్‌విజ‌య్‌వ‌ర్ష్ ఉత్స‌వాల‌న్నింటికీ ప్ర‌ముఖంగా ఉండేలా ఒక లోగోను డిజైన్ చేయించాల‌ని ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ త‌ల‌పెట్టింది. ఇందుకు భార‌తీయ పౌరుల‌నుంచి లోగో డిజైన్‌ల‌ను ర‌క్ష‌ణ‌మంత్రిత్వ‌శాఖ ఆహ్వానించింది. స్వ‌ర్ణిమ్ విజ‌య్ వ‌ర్ష్ అన్ని ఉత్స‌వాల‌ను ప్ర‌త్యేకంగా ప్ర‌తిబింబించేలా ఈ లోగో ఉండాల‌ని ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ ప్ర‌తిపాదిస్తోంది. ఈ దిశ‌గా భార‌తీయ పౌరుల‌నుంచి ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ లోగో డిజైన్‌ల‌ను ఆహ్వానిస్తోంది. ఈ పోటీలో పాల్గొనే వారు కింది మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా లోగో డిజైన్ చేయ‌వ‌ల‌సి ఉంటుంది.
(ఎ) లోగోలో భ‌ర‌త ఆర్మీ, భార‌త నౌకాద‌ళం, భార‌త  వాయుసేన ల సేవ‌లు ఈ లోగోలో ఉండాలి.

(బి)  లోగో  ప్ర‌త్య‌ర్థిని అప‌హాస్యం ,కించ‌ప‌రిచే విధంగా కంటె భార‌త సాయుధ బ‌ల‌గాల విజ‌యాల‌ను ప్ర‌తిబింబించేదిగా ఉండాలి
(సి) లోగోలో చూపే ఆయుధాలు , ప‌రిక‌రాలు ఏవైనా ఉంటే అవి 1971 యుద్ధంలో భార‌త సాయుధ బ‌ల‌గాలు వాడిన‌వై ఉండాలి.
(డి) లోగోలో వాడే అన్ని కొటేష‌న్లు ఇంగ్లీషు, హిందీ భాష‌లో ఉండాలి.
.
ఎంట్రీల‌ను స‌మ‌ర్పించ‌డానికి ఆఖ‌రుతేది న‌వంబ‌ర్ 11, 2020. గెలుపొందిన లోగోకు రూ 50,000ల న‌గ‌దు బ‌హుమ‌తి అంద‌జేస్తారు. ఈ పోటీకి సంబంధించిన ష‌ర‌తులు,నిబంధ‌న‌లు, సాంకేతిక అంశాలు, ఎంపిక ప్ర‌క్రియ త‌దిత‌ర వివ‌రాల‌ను ఈ లింక్ ద్వారా చూడ‌వ‌చ్చు.
https://www.mygov.in/task/logo-design-contest-swarnim-vijay-varsh/ .

 

****



(Release ID: 1670554) Visitor Counter : 129