జల శక్తి మంత్రిత్వ శాఖ

గంగా ప్రక్షాళన నిరంతర ప్రక్రియ... ప్రజలందరూ పాల్గోవాలి

Posted On: 04 NOV 2020 7:20PM by PIB Hyderabad

 

'గంగానది ప్రక్షాళన నిరంతరం సాగే ప్రక్రియ. దీనిలో ప్రజలు భాగస్వాములు కావాలి. దీనికోసం ఒక కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించాలి. గంగానది మనకి ఏమి ఇస్తున్నది అన్న అంశంపై ప్రజలు అర్ధం చేసుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది.' అని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ శాఖావత్ అన్నారు. గంగా ఉత్సవ్ లాంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ఇది సాధ్యం అవుతుందని ఆయన అన్నారు. 2020 గంగా ఉత్సవ్ లో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ స్వచ్ఛంగా నిర్మలంగా నిరంతరాయంగా గంగానది పారాలంటూ ఇచ్చిన పిలుపు ప్రజాఉద్యమంగా మారిందని మంత్రి తెలిపారు. గంగానది ప్రక్షాళన అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని ప్రజల సహకారంతో ఇది సాగుతున్నదని మంత్రి వివరించారు. ' గంగానదిపై మనకి ఉన్న విశ్వాసం కర్తవ్యంగా మారడంతో ఇది సాధ్యం అయ్యింది.' అని మంత్రి అన్నారు. 'గంగా తీరంలో నేను గంగను స్ఫూర్తిగా తీసుకుని పాటలు పాడుతాను' అని పేర్కొన్న కైలాశ్ ఖర్ తన సంగీతంతో అలరించారు.

ఉత్సవ వివరాలను వెల్లడించిన నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగ (ఎన్ ఎం సి జి ) డైరెక్టర్ జనరల్ రాజీవ్ రంజన్ మిశ్రా ఉత్సవం తోలి రెండు రోజుల్లో దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు పాల్గొన్నారని తెలిపారు. నమామి గంగా మిషన్ కార్యక్రమాలను కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి యు.పి.సింగ్ అభినందించారు. ' సాయంకాలం పూట ఎక్సామ్ గంగా కే నామ్ పేరిట ప్రారంభమైన ఉత్సవం నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఆధ్వర్యంలో నిరంతరం సాగుతున్నదని ఆయన తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు గంగానదితో ప్రజల అనుబంధాలను మరింత పెంచుతాయని ఆయన అన్నారు.

చిత్రం ప్రారంభం:

' గంగా ఏరియల్ మూవీ'ని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ప్రాంరంభించారు. జాతీయ చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో గంగా నది పుట్టుక నుంచి తుది వరకు ఆకాశం నుంచి చిత్రీకరించారు. గంగానది అందాలు, నది ఘాట్లతో పాటు ఈ చిత్రంలో నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా నిర్వహిస్తున్న నీటి శుద్ధి ప్లాంటుల వివరాలను పొందుపరిచారు.

గంగా బాక్స్ ఆవిష్కరణ:

పాఠశాల విద్యార్థులలో గంగా నది పట్ల అవగాహన కల్పించి వారి ఆలోచనా సరళిలో మార్పు తేవాలన్న లక్ష్యంతో ' గంగానది ప్రక్షాళనకు మద్దతు ' పేరిట నేషనల్ మిషన్ఫోర్ క్లీన్ గంగతో కలసి జర్మన్ డెవలప్మెంట్ ఏజెన్సీ అమలు చేయనున్న కార్యక్రమాన్ని కేంద్ర మంత్రితో కలసి గంగా ఉత్సవ్-2020లో పాల్గొన్న జర్మనీ రాయబార కార్యాలయం డిప్యూటీ హెడ్ డ్రిక్‌స్టెఫ్స్-ఎన్ ప్రారంభించారు.

పట్టణ ప్రాంతాల నదీ యాజమాన్య ప్రణాళిక ప్రారంభం :

పట్టణ ప్రాంతాలలో ప్రవహిస్తున్న నదులకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేయాలని నేషనల్ గంగా మిషన్ సమావేశంలో ప్రధానమంత్రి సూచించిన మేరకు కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ పరిధిలో పని చేస్తున్న నేషనల్ ఇస్టిట్యూట్ అఫ్ అర్బన్ అఫైర్స్ తో కలసి గంగా మిషన్ రూపొందించిన పథకాన్ని మంత్రి ప్రారంభించారు. పట్టణ ప్రాంతాలలో ప్రవహిస్తున్న నదుల యాజమాన్య అంశాలకు ఈ పధకంలో ప్రాధాన్యత ఇస్తారు.

నమామి గంగా ప్రాజెక్ట్ బ్రాండ్ అంబాసిడర్ గా చాచా చౌదరి :

కంప్యూటర్ కన్నా వేగంగా పని చేసే మేధస్సు కలిగి ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందిన చాచా చౌదరి నమామి గంగా తో కలసి పనిచేయడానికి ముందుకు వచ్చారు. గంగానది ప్రాముఖ్యతను తెలియచేసి ప్రజలలో గంగానది పరిరక్షణ పట్ల అవగాహన కలిగించడానికి చాచా చౌదరి కామిక్స్ ను డైమండ్ టూన్స్ ప్రచురిస్తుంది. దీనికి సంబంధించిన లఘు చిత్రాన్ని గంగా ఉత్సవ్-2020లో ఆవిష్కరించారు.

నమో గంగ చిత్రాన్ని ఇండియా సైన్స్ ఛానల్ లో ప్రసారం చేయాలని నిర్ణయించారు. నమని గంగాకు సంబంధించిన అన్ని అంశాలను దీనిలో పొందుపరుస్తారు.

వసుమతి మిశ్రా బృందం నృత్య ప్రదర్శనతో కార్యక్రమం ముగిసింది. గంగా క్వెస్ట్ కార్యక్రమ విజేతలను ప్రకటించడం జరిగింది.

ప్రపంచం నలుమూలల నుంచి మూడు లక్షలకు పైగా ప్రజలు కార్యక్రమాన్ని తిలకించారు. ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ మిశ్రా ప్రధాన మంత్రి ఆదేశాల మేరకు నమని గంగ కార్యక్రమాన్ని ప్రజా కార్యక్రమంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల సహకారంతో గంగా నది ప్రక్షాళన విజయవంతంగా సాగుతున్నదని అన్నారు. గంగా మిషన్ దీనికోసం అనేక కార్యక్రమాలను రూపొందించిందని అన్నారు. ఇంకా ముందు హరిద్వార్ కుంభ్, గంగా క్వెస్ట్, జల్ శక్తి అభియాన్ లాంటి కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. రానున్న గంగా ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించి దేశంలో నదుల ఉత్సవాలను నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు.

గంగానది ప్రవహిస్తున్న వివిధ జిల్లాలలో ఉత్సవాలను నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా నిర్వహించిన పరుగు సహరాన్పూర్ లో ముగిసింది.

 



(Release ID: 1670285) Visitor Counter : 214