భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
"వర్షాకలపు మిషన్ , హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సదుపాయాలలో పెట్టుబడి , ఆర్ధిక ప్రయోజనాలను అంచనా వేయడం" పై కేంద్రమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఎన్సీఏఈఆర్ నివేదికను విడుదల చేశారు.
వీటిలో భారతదేశం దాదాపు 1,000 కోట్ల పెట్టుబడులు పెట్టడం వల్ల దారిద్య్రరేఖ దిగువన ఉన్న (బిపిఎల్) 1.07 కోట్ల గృహాలకు 50 వేల కోట్ల రూపాయల విలువైన ప్రయోజనాలు దక్కుతాయి. దేశంలోని 53 లక్షల బిపిఎల్ మత్స్యకారుల గృహాలకూ కూడా మేలు జరుగుతుంది: ఎన్‌సిఎఇఆర్ నివేదిక
Posted On:
03 NOV 2020 6:22PM by PIB Hyderabad
"ఎర్త్ సైన్సెస్ మినిస్ట్రీ (ఎంఓఈఎస్) , జాతీయ రుతుపవన మిషన్ , హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ప్రోగ్రామ్‌ల కోసం ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయికి, దేశం యాభై రూపాయల విలువైన ఆర్థిక ప్రయోజనాలను పొందుతుంది. రాబోయే ఐదేళ్ల కాలానికి ఇది పెట్టుబడిపై 50 రెట్లు ఎక్కువ లాభాన్ని ఇస్తుంది ” అని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్‌సిఎఇఆర్) ఇచ్చిన నివేదిక పునరుద్ఘాటించింది. ఇది స్వయప్రతిపత్తి గల, లాభాపేక్ష లేని సంస్థ. ఆర్థిక విధాన పరిశోధన కోసం ఢిల్లీలో ఏర్పాటైన మేధోసంస్థ. ఈ నివేదికను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ ఎర్త్ సైన్సెస్ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈ రోజు ఢిల్లీలోని పృథ్వీ భవన్ లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఎంఓఎస్ కార్యదర్శి డాక్టర్ ఎం. రాజీవన్, ఐఎండీ డీజీ డాక్టర్ ఎం.మహాపాత్ర, ప్రాజెక్ట్ డైరెక్టర్ , సైంటిస్ట్ డాక్టర్ పర్విందర్ మైనీ , ఎంఓఈఎస్, ఐఎండీకి చెందిన, పలువురు సీనియర్ అధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు, ఎంఓఈఎస్ అధీనంలోని అన్ని సంస్థలు వర్చువల్ ప్లాట్‌ఫామ్ ద్వారా సమావేశంలో పాల్గొన్నాయి.
పంటల రైతులు, పశువుల పెంపకందారులు , మత్స్యకారులకు ప్రత్యక్ష నగదు లాభాలుగా ఆర్థిక ప్రయోజనాలు అందుతాయని ఎన్‌సిఎఇఆర్ నివేదిక తెలిపింది. ఈ నివేదిక ప్రకారం, రుతుపవన మిషన్, హై పెర్మార్మెన్స్ కంప్యూటింగ్ సౌకర్యాల్లో 1,000 కోట్ల పెట్టుబడులు పెట్టడం వల్ల దారిద్య్రరేఖ దిగువన ఉన్న (బిపిఎల్) 1.07 కోట్ల గృహాలకు 50 వేల కోట్ల రూపాయల విలువైన ప్రయోజనాలు దక్కుతాయి. దేశంలోని 53 లక్షల బిపిఎల్ మత్స్యకార గృహాలకూ కూడా మేలు జరుగుతుంది
3,965 పంట రైతులు, 757 మంది సముద్ర మత్స్యకారులు , 1,376 పశువుల యజమానులతో సహా 6,098 మంది ప్రతివాదులతో చేసిన ముఖాముఖి సర్వే ఆధారంగా ఎన్‌సిఎఇఆర్ అధ్యయనం జరిగింది. ముఖాముఖి సర్వే ఫలితాలను నిర్ధారించడానికి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవిఆర్ఎస్) ద్వారా 2 లక్షల మంది రైతుల నుండి అభిప్రాయాలను తీసుకున్నారు. కీబోర్డ్ ద్వారా వాయిస్, ఇన్పుట్ ఉపయోగించడం ద్వారా కంప్యూటర్లతో మానవులు సంభాషించడానికి అనుమతించే సాంకేతికతే ఐవీఆర్. వర్షాకాలం, అనంతర కాలానికి సంబంధించిన డేటాను విలీనం చేయడం వల్ల జాతీయ రుతుపవన మిషన్ (2015 లో ఏర్పాటయింది) అమలుకు ముందు , తరువాత ప్రధాన పంటల ఉత్పత్తిని , దిగుబడిని విశ్లేషించడానికి వీలు కల్పించింది. 16 రాష్ట్రాల్లో మొత్తం 732 జిల్లాలు ఉండగా, 173 జిల్లాల్లో (మొత్తం 29 రాష్ట్రాల్లో) వ్యవసాయ-వాతావరణ మండలాలు, వర్షంతో కూడిన ప్రాంతాలు, ప్రధాన పంటల కవరేజ్ , అసాధారణ వాతావరణ పరిస్థితులను అధ్యయనం కోసం పరిశీలించారు.
చిన్న, మధ్యస్థ , సుదూర వాతావరణ సూచనల కోసం అత్యాధునిక, చలనశీల రుతుపవనాల అంచనా వ్యవస్థను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో 2012 లో జాతీయ రుతుపవన మిషన్ను ఎంఓఈఎస్ ప్రారంభించింది. హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సదుపాయాల వల్ల వాతావరణ మార్పులను పసిగట్టడంలో అద్భుత విజయాలు సాధించడం జరిగింది. స్వల్ప , మధ్య తరహా వాతావరణాల అంచనా కోసం 12 కిలోమీటర్ల దూరంలో గ్లోబల్ ఎన్సెంబుల్ ఫోర్కాస్ట్ సిస్టమ్ను 2018లో ఏర్పాటు చేశారు. జాతీయ రుతుపవన మిషన్ , 1-పెటాఫ్లోప్ నుండి 10 పేటాఫ్లోప్ వరకు అత్యధిక సామర్థ్యం గల కంప్యూటింగ్ సౌకర్యాల వల్ల ఇది సాధ్యమయ్యాయి.
వ్యవసాయ-వాతావరణ మండలం... అనువైన నేల రకం, వర్షపాతం, ఉష్ణోగ్రత , నీటి లభ్యత ఉన్న భోగోళిక ప్రాంతాన్ని సూచిస్తుంది. భారతదేశాన్ని 15 ప్రధాన వ్యవసాయ-వాతావరణ మండలాలుగా విభజించారు. మొత్తం 15 జోన్లోలో కరువు నుండి వరదలు వరకు అన్ని రుతుపవనాల వంటివి సంభవించే 10 జోన్లలో ఎన్సీఏఈఆర్ అధ్యయనం చేసింది. వర్షాధారిత ప్రాంతాలకు, పశువుల పెంపకానికి అనువైన ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, మొత్తం 173 జిల్లాలను సర్వే కోసం ఎంపిక చేశారు. భారతదేశంలో పండించిన అన్ని ప్రధాన పంటలలో 70 శాతానికి పైగా అధ్యయనం పరిధిలోకి వచ్చాయి. వీటిలో ఖరీఫ్ , రబీ రెండూ ఉన్నాయి.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసిఎఆర్) సహకారంతో ఇండియా వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) 'గ్రామీణ కృషి మౌసమ్ సేవ (జికెఎంఎస్)' కింద దాదాపు 40 మిలియన్ల మంది రైతులకు 130 వ్యవసాయ-క్షేత్ర క్షేత్ర యూనిట్ల ద్వారా జిల్లా స్థాయిలో వ్యవసాయ-వాతావరణ సలహాలను అందిస్తుంది. దేశంలోని అన్ని జిల్లాలకు వారానికి రెండుసార్లు సూచనలు ఇస్తుంది. ఈ సలహాలను మొబైల్, ఎస్ఎంఎస్, మేఘధూట్ వంటి యాప్స్, ఐఎండి వెబ్‌సైట్, కిసాన్ పోర్టల్, , టెలివిజన్, రేడియో , వార్తాపత్రికల వంటి సంప్రదాయ మాధ్యమాల ద్వారా రైతులకు తెలియజేస్తారు. విత్తనాల నిర్వహణ, పంట రకాన్ని మార్చడం, వ్యాధి నియంత్రణ కోసం పురుగుమందులను పిచికారీ చేయడం , నీటిపారుదల నిర్వహణ వంటి క్లిష్టమైన వ్యవసాయ కార్యకలాపాల కోసం ఈ సలహాలను రైతులు ఉపయోగించుకుంటారు.
భారతదేశంలోని 11 రాష్ట్రాల్లోని 121 జిల్లాలలో ఇంటర్వ్యూ చేసిన 3,965 పంట రైతులలో, అధిక శాతం మంది వాతావరణ సలహాలతో లాభం పొందామని చెప్పారు. క్లిష్టమైన వ్యవసాయ పద్ధతుల్లో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. పంట రకాలు లేదా జాతి, ఎరువులు లేదా పురుగుమందుల పిచికారీ, షెడ్యూల్, నీటిపారుదల లేదా పంట సమయం, నిల్వ చేయడానికి ఏర్పాట్లు మొదలైన వాటిలో మార్పులు చేసినట్లు వారు ధృవీకరించారు. దీనివల్ల నష్టాలు తగ్గి, ఆదాయాలు పెరిగాయని తెలిపారు. భారతదేశంలోని 10 రాష్ట్రాల్లోని 92 జిల్లాలలో ఇంటర్వ్యూ చేసిన మొత్తం 1,376 పశువుల యజమానుల నుండి సేకరించిన సమాచారం ప్రకారం, వాతావరణ సలహాలు వారి జీవనోపాధిపై సానుకూల ప్రభావాన్ని చూపుతున్నారని తేలింది. టీకాలు వేయడం, కొట్టాల మార్పు, మేతవేయడం వంటి విషయాల్లో ఐఎండీ జారీ చేసిన వాతావరణ పారామితుల ఆధారంగా పశువుల నిర్వహణ పద్ధతుల గురించి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. ఆవులు, మేకలు, కోళ్లను పెంచే చిన్న, సన్నకారు రైతులు అధ్యయనంలో పాల్గొన్నారు. రాబోయే ఐదేళ్లలో పశువుల రైతులకు సంవత్సరానికి దాదాపు 13 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని, రాబోయే ఐదేళ్ళలో దాదాపు 48 వేల కోట్ల రూపాయల ఆర్థిక లాభం వస్తుందని ఈ నివేదిక విశ్లేషించింది.
మొత్తం 53 లక్షల బిపిఎల్ లైన్ మత్స్యకారుల గృహాలు సంవత్సరానికి 663 కోట్ల రూపాయల చొప్పున లాభాలు పొందుతాయని అంచనా వేసింది. రాబోయే ఐదేళ్ళలో రెండువేల కోట్ల రూపాయలకు పైగా లాభం వస్తుంది. సర్వే చేసిన ఏడు రాష్ట్రాల్లోని 34 జిల్లాల్లోని 757 మంది సముద్ర మత్స్యకారులలో, మెజారిటీ జాలర్లు సముద్రంలోకి వెళ్ళే ముందు ఓషియన్ స్టేట్ సూచనలను పరిగణనలోకి తీసుకున్నారు. ఫలితంగా సముద్రం నుంచి ఖాళీగా వెనక్కి రావాల్సిన దుస్థితి తప్పింది. సముద్ర వాతావరణ సూచనల వల్ల వారి నిర్వహణ వ్యయం తగ్గి, జీవనోపాధిని గణనీయంగా మెరుగుపడింది. ఎన్‌సిఎఇఆర్ నివేదిక దేశంలోని వ్యవసాయ సంబంధిత మహిళలకు ఆర్థిక ప్రయోజనాలను కూడా అంచనా వేసింది. వివిధ వ్యవసాయ కార్యకలాపాలలో మహిళలు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఉదాహరణకు, మత్స్య రంగంలో వారు ఫైనాన్స్, సరఫరాలు, వనరులు, సిబ్బంది నిర్వహణ, ఎన్సీఏఈఆర్ మార్కెటింగ్‌విషయంలో కీలకపాత్ర పోషిస్తారు. ఖాతాదారుల వివరాలను నిర్వహిస్తూ వారి సంఖ్యను పెంచుతారు. చేపల ధరలు, వలలు, ఇతర ఫిషింగ్ ఆస్తుల వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. మహిళలకు వాతావరణ అంచనాల ప్రాముఖ్యతను గ్రహించిన ఎన్సీఏఈఆర్.. వారికే 13 వేల కోట్ల రూపాయల ప్రయోజనాలు దక్కుతాయని అంచనా వేసింది. జాతీయ రుతుపవనాల మిషన్, అధిక-సామర్థ్యం గల కంప్యూటింగ్ సౌకర్యాలు అందించే మొత్తం ప్రయోజనంలో ఇది 26 శాతం. సర్వేలో పాల్గొన్న ప్రతి మత్స్యకార గృహిణి ప్రతిరోజూ మెసేజింగ్ సేవల ద్వారా ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అందించే సముద్ర వాతావరణ సూచనలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్టు సర్వే వెల్లడించింది.
****
(Release ID: 1669971)
Visitor Counter : 208