ఆయుష్
కోవిడ్ -19 కు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న జన్ ఆందోళన్ ఆయుష్ రంగంలో సానుకూల ప్రభావాన్ని సాధించింది
Posted On:
31 OCT 2020 5:08PM by PIB Hyderabad
కోవిడ్-19 కి వ్యతిరేకంగా వేలాది మంది ఆయుష్ నిపుణులు జన్ ఆందోలణ్ ప్రచార కార్యక్రమంలో చేరడంతో, ఈ ఉద్యమం సాంప్రదాయ వైద్య విధానాలలో గణనీయమైన గుర్తింపు పొందింది. ఈ ఉద్యమం ఆయుష్ డిస్పెన్సరీలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, సంరక్షణ కేంద్రాలు మరియు ఇతర విభాగాలలో కూడా విస్తరించింది. ఆయుష్ నిపుణులు క్షేత్ర స్థాయిలో ప్రజలతో కలిసి పనిచేస్తారు, అందువల్ల వారు ఈ అవగాహన ప్రచారంలో ప్రజల ప్రవర్తనను ప్రభావితం చేయడం ద్వారా ప్రచారానికి మరింతగా దోహదపడుతున్నారు.
కోవిడ్-19 కు తగిన ప్రవర్తనలను ప్రచారం చేసే సందేశాలతో, ప్రత్యక్ష ముఖాముఖీ ప్రచారంతో పాటు వివిధ ఛానెళ్ళ ద్వారా, ఆయుష్ వాటాదారులు, 2020 అక్టోబర్, 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు 5 రోజుల వ్యవధిలో, 110 లక్షల మందికి చేరుకున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఉత్సవాల సమయంలో ప్రజలు అజాగ్రత్తగా ఉండటంతో, మహమ్మారి వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున, ఈ పండుగ సీజన్ ప్రజారోగ్య సవాళ్లను కలిగిస్తుంది. కోవిడ్ కు తగిన ప్రవర్తనలను అవలంబించడానికి, దేశవ్యాప్తంగా ప్రజలను ప్రోత్సహించే ప్రయత్నాలకు, ఆయుష్ నిపుణుల జోక్యం, తోడ్పడుతోందని భావిస్తున్నారు.
ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రైవేటు రంగ పరిశ్రమలు మరియు అకాడెమియాతో జతచేయబడిన మరియు సబార్డినేట్ కార్యాలయాల ద్వారా ఏర్పరచుకున్న భాగస్వామ్యాలు చాలా మంది వాటాదారులను ఈ చర్యలో చేర్చుకోవడంలో విజయవంతమయ్యాయి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని ఆయుష్ డైరెక్టరేట్లు, ఆయుష్ మంత్రిత్వ శాఖ యొక్క జాతీయ ఆయుష్ మిషన్ మద్దతుతో, ఆయుష్ డిస్పెన్సరీలు కలిసి సంయుక్తంగా, తక్షణం చేపట్టవలసిన ప్రవర్తనలో మార్పు సమాచారాన్ని, వ్యాప్తి చేయడానికి ఒక ప్రధాన నెట్ వర్క్ వ్యవస్థగా సేవలందించాయి. అనేక రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలకు చెందిన ఆరోగ్యశాఖ కార్యదర్శులు, ఈ సందేశాలతో అనుసంధానించబడిన ప్రచారాలను కూడా ప్రారంభించారు.
వివిధ ఆయుష్ యూనిట్లు (ఆయుష్ డిస్పెన్సరీలు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు మొదలైనవి) ఈ 5 రోజుల వ్యవధిలో వివిధ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని వివిధ సంస్థలలో ఇందుకు సంబంధించిన సందేశాలతో దాదాపు 5000 పోస్టర్లు మరియు 8000 బ్యానర్లను ఏర్పాటు చేశాయి. వీటిలో “మాస్కు ధరించడం, చేతులు కడుక్కోవడం మరియు శారీరక దూరం పాటించడం” మొదలైన వాటిపై ప్రామాణిక సందేశాలు అలాగే ఆయుష్ రోగనిరోధక శక్తి పద్ధతులు, సంబంధిత యోగాసనాలను వివరించే సందేశాలు ఉన్నాయి.
ఈ 5 రోజుల వ్యవధిలో ఆయుష్ వాటాదారుల కృషికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, దాదాపు 200 వార్తాపత్రిక కథనాలు ప్రచురించబడ్డాయి మరియు దాదాపు 300 ముద్రణ ప్రకటనలు జారీ చేయబడ్డాయి. ఇంకా, రోగులకు అవసరమైన విషయ పరిజ్ఞానాన్ని అందించే ప్రయత్నాల్లో భాగంగా, దాదాపు 3 లక్షల కరపత్రాలు, బ్రోచర్‌లను పంపిణీ చేశారు. కొన్ని సంస్థలు ఈ-న్యూస్ లేఖలను కూడా ప్రచురించాయి. సుమారు 750 ఆయుష్ వైద్య కళాశాలలు తమ విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఘాలతో కలిసి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాయి.
ఐదు రోజుల వ్యవధిలో ఆయుష్ సంస్థలు ఈ విషయంపై సామాజిక మాధ్యమాల ద్వారా పంపిన 200 సోషల్ మీడియా సందేశాలు 5 లక్షల మందికి చేరుకున్నాయి. ఆరోగ్య అవగాహన మరియు కోవిడ్ తగిన ప్రవర్తనలపై చర్చలు మరియు వార్తా అంశాలను, 78 సందర్భాలలో టీవీ మరియు రేడియోలలో ప్రసారం చేయడం జరిగింది. ఈ అంశాలపై నిర్వహించిన వివిధ వెబినార్ల ద్వారా, ఆయుష్ సంస్థలు, వేలాది మందిని చేరుకున్నాయి.
కొన్ని సంస్థలు ఔషధ మొక్కలు, ఆయుష్ రక్షా వస్తు సామగ్రి, మాస్కులతో పాటు రోగనిరోధక మందుల పంపిణీ వంటి అధిక-విలువైన ప్రచార కార్యకలాపాలను చేపట్టాయి. వివిధ రాష్ట్రాల్లో దాదాపు 9 లక్షల మంది లబ్ధిదారులు వీటిని అందుకున్నారు. మాస్కులు సరిగ్గా ధరించే విధానం, చేతులు కడుక్కోవడం మరియు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి తగిన ఆహారపు అలవాట్ల గురించి ఓ.పి.డి. రోగులు మరియు 'ఆయుష్ గ్రామ్' యొక్క నివాసితుల కోసం అనేక ప్రాంతాల్లో నిర్వహించిన ప్రదర్శనలకు, అధిక సంఖ్యలో ప్రజలు, ఆసక్తిగా హాజరయ్యారు. రద్దీగా ఉండే ప్రదేశాలలో స్వీయ రక్షణ కోసం తీసుకోవలసిన చర్యలకు సంబంధించిన అంశాలపై, కొన్ని సంస్థలు కూడా ఉపన్యాసాలు ఏర్పాటు చేశాయి.
ఆయుష్ సంస్థలు చేపట్టిన ఇతర కార్యక్రమాలలో అవగాహన శిబిరాలు, వర్క్ షాపులు, ఉపన్యాసాలు, ప్రతిజ్ఞ తీసుకోవడం, యోగా ప్రదర్శనలు మరియు ఆరోగ్య శిబిరాలు కూడా ఉన్నాయి.
*****
(Release ID: 1669196)
Visitor Counter : 194