యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

200 కిలోమీటర్ల ‘ఫిట్ ఇండియా వాకథాన్‌’ను ప్రారంభించిన‌ కేంద్ర క్రీడా మంత్రి శ్రీ కిర‌ణ్‌ రిజిజూ


సాయుధ బ‌ల‌గాలు చేప‌డుతున్న‌ వాక‌థాన్, ఫిట్‌నెస్ ఉద్య‌మంలో పౌరుల భాగ‌స్వామ్యులు అయ్యేల‌ ప్రేరేపిస్తుందిః కేంద్ర క్రీడా మంత్రి

Posted On: 31 OCT 2020 5:29PM by PIB Hyderabad

అక్టోబర్ 31న 'జాతీయ ఐక్యత దినోత్సవం' సందర్భంగా (సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా) కేంద్ర క్రీడా మంత్రి శ్రీ కిర‌ణ్‌ రిజిజు, బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్‌తో క‌లిసి 200 కిలో మీటర్ల పొడవైన ‘ఫిట్ ఇండియా వాక‌థాన్’ను రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జెండా ఊపి ప్రారంభించారు.

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీసీ) ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్య‌క్ర‌మం 3 రోజుల పాటు జ‌రుగ‌నుంది. ఇందులో 100 ఐటీబీపీ జవాన్లు మరియు వివిధ కేంద్ర సాయుధ పోలీసు దళాలకు చెందిన (సీఏపీఎఫ్) సిబ్బంది 200 కిలోమీటర్లకు పైగా న‌డువ‌నున్నారు. ఈ వాక్‌థాన్ మార్చ్ పగలు మరియు రాత్రి కొనసాగుతుంది. భారత-పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న ప్రాంతంలో, థార్ ఎడారి దిబ్బల గుండా వాక్‌థాన్ ముందుకు ‌సాగ‌నుంది. మార్చ్ ట్రాక్ చాలా వరకు ఈ అనేక పొరులు మరియు యుద్ధాలకు ప్రసిద్ధి చెందిన అంతర్జాతీయ సరిహద్దు గుండా కొన‌సాగ‌నుంది. ఈ మార్గంలో కిషన్‌ఘ‌ర్‌ కోట ఒక ప్రముఖ ప్రదేశం. క్రీడా మంత్రి శ్రీ కిర‌ణ్‌ రిజిజు కూడా బలగాలతో పాటు వాకథాన్‌లోని తొల‌త కొన్ని కిలోమీటర్ల మేర నడిచారు.

 "ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రజల ఉద్యమంగా మార్చి దేశంలోని ప్రతి మూలకు తీసుకెళ్లడం మన ప్రధానమంత్రి ఆకాంక్ష‌. జైసల్మేర్ సరిహద్దుల్లో దాదాపు 200 కిలోమీటర్లు నడవడం ద్వారా దేశంలోని ప్రతి పౌరుడిని 200 కిలోమీటర్ల దూరం వాక్‌థాన్‌గా కవర్ చేయగలిగితే, ప్రతి పౌరుడు ఒక రూపంలో లేదా మరొక రూపంలో ఫిట్‌నెస్‌ను చేపట్టగలరని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు." అని మంత్రి అన్నారు. ప్ర‌ముఖ నటుడు మరియు ఫిట్నెస్ ఐకాన్ విద్యత్ జమ్వాల్ మాట్లాడుతూ "ఇది ప్రభుత్వం తీసుకుంటున్న గొప్ప ప్రయత్నం, ఫిట్ ఇండియా దేశంలోని ప్రతి మూలలోనూ చేరుకోవాలి.  ఫిట్నెస్ ఈవెంట్స్  పట్టణ కేంద్రాలలో, పెద్ద పట్టణాల్లో మాత్రమే ఉంటే సరిపోదు కానీ వాస్తవానికి ప్రతి చిన్న ప్రదేశానికి తీసుకెళ్లాల్సి ఉంది. ఈ కార్యక్రమాన్ని తీవ్ర ఎడారిలో నిర్వహించబడుతున్నందున ఈ ఫిట్ ఇండియా చొరవను దేశంలోని ప్రతి వీధివీధికి మరియు మూల‌మూలకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం కృత నిశ్చ‌యంతో ఉందన్న విష‌యాన్ని సూచిస్తుంది." అని అన్నారు.

ఈ మార్చ్‌లో ఐటీబీపీతో స‌హా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్), నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ (ఎన్‌డీఆర్ఎఫ్‌), రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఐఎఫ్), అస్సాం రైఫిల్స్ (ఏఆర్‌), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ త‌దిత‌ర సాయుధ ద‌ళాల‌కు చెందిన అధికారుల ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. భారతదేశంలో ధారుడ్యం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి అవగాహన కల్పించడమే లక్ష్యంగా ‘ఫిట్ ఇండియా వాక్‌థాన్’ చేప‌ట్టారు. ఇటీవలే ముగిసిన ‘ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్’ భారత దేశంలో 6.5 కోట్లకు పైగా ప్రజలు పాల్గొన్నారు.

***


(Release ID: 1669195) Visitor Counter : 197