జల శక్తి మంత్రిత్వ శాఖ
చత్తీస్ గఢ్ లో జలజీవన్ మిషన్ ప్రగతి పనుల అమలుపై మధ్యకాలిక సమీక్ష
Posted On:
30 OCT 2020 4:41PM by PIB Hyderabad
వివిధ రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో జలజీవన్ మిషన్ అమలు ప్రగతిపై కొసాగుతున్న సమీక్షలో భాగంగా చత్తీస్ గఢ్ రాష్ట్రం కూడా తన సమీక్షా నివేదికను జాతీయ జలజీవన్ మిషన్ కు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమర్పించింది. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జలజీవన్ మిషన్ పనుల ప్రగతిపై మధింపు లక్ష్యంగా ఈ సమీక్షా ప్రక్రియను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సాగిస్తోంది. జలజీవన్ మిషన్ పథకాన్ని సార్వత్రికంగా అమలుచేయాలన్న లక్ష్య సాధనకోసం జలశక్తి మంత్రిత్వ శాఖ ఈ ప్రక్రియ నిర్వహిస్తోంది. 2024నాటికి దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ఇళ్లకూ నీటిసరఫరా కుళాయిలను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో జలజీవన్ మిషన్ కార్యక్రమాన్ని రూపొందించారు. జలజీవన్ మిషన్ పనుల ప్రగతిపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు క్రమం తప్పకుండా తమతమ స్థాయీ నివేదికనుల సమర్పిస్తూ వస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నీటి కుళాయిల కనెక్షన్ల పనుల్లో ప్రగతి, ఇందుకు సంబంధించిన సంస్థాగతంగా చేసిన ఏర్పాట్లు తదితర వివరాలను సమర్పిస్తూ వస్తున్నాయి.
జలజీవన్ మిషన్ కింద 2023కల్లా ఇంటింటికీ మంచినీటి కుళాయిలు అమర్చడం వందశాతం పూర్తి చేయాలని చత్తీస్ గఢ్ ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్రంలోని మొత్తం 45లక్షల ఇళ్లలో 5.66లక్షల ఇళ్లకు మాత్రమే నీటి కుళాయిల కనెక్షన్లు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది 20లక్షల మేర ఇళ్లకు మంచినీటి కుళాయిల కనెక్షన్లు అందించాలని రాష్ట్రప్రభుత్వం సంకల్పించింది.
ఈ పథకం కోసం 2020-21లో చత్తీస్ గఢ్ రాష్ట్రానికి రూ. 445.52కోట్లు కేటాయించారు. దీనికి తోడు గ్రామీణ స్థానిక సంస్థలకు ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధుల కింద చత్తీస్ గఢ్ కు రూ. 1,454కోట్లు కేటాయించారు. ఈ మొత్తంలో 50శాతాన్ని తప్పనిసరిగా తాగునీరు, పారిశుద్ధ్య కార్యక్రమాలకే వినియోగించవలసి ఉంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, జలజీవన్ మిషన్, స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ), 15వ ఆర్థిక సంఘం నిధులు, జిల్లా ఖనిజాభివృద్ధి సంస్థ నిధులు, అటవీ అభివృద్ధి నిధుల నిర్వహణ, స్థానిక ప్రాంత అభివృద్ధి నిధి వంటి వాటిని గ్రామాల స్థాయిలో మంచినీటి సరఫరా కార్యక్రమాల అమలుకోసం బదలాయించుకోవాలని రాష్ట్రానికి సూచించారు. అన్ని వనరులనుంచి నిధులను సమంజసంగా వినియోగించుకునేలా గ్రామాల స్థాయిలో ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళిలు తయారు చేసుకోవాలని కూడా సూచించారు.
గ్రామాల స్థాయిలో కార్యచరణ ప్రణాళికలను తయారు చేసుకోవాలని, గ్రామ మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని, ఆ కమిటీలకు ఉపసంఘాలుగా గ్రామపంచాయతీల స్థాయిలో పానీ సమితులను నియమించుకోవాలని, వాటిల్లో 50శాతం సభ్యులు మహిళలే ఉండేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమాలన్నింటికీ ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సూచించింది. గ్రామాల్లో నీటి సరఫరా మౌలిక సదుపాయాల నిర్వహణా ప్రణాళిక రచన, అమలు కార్యకలాపాలకు సంబంధించి పానీ సమితుల సభ్యులు పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అన్ని గ్రామాలు తప్పనిసరిగా గ్రామ కార్యాచరణ ప్రణాళికలు తయారు చేసుకోవాలి. తాగునీటి వనరుల అభివృద్ధి, మురుగునీటి పారుదల వ్యవస్థల ఏర్పాటు, వాటి నిర్వహణ తదితర అంశాలను ఈ ప్రణాళికల్లో పొందుపరచాల్సి ఉంటుంది. జలజీవన్ మిషన్ కార్యక్రమాన్ని సిసలైన ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దేందుకు ప్రజా సమీకరణతో అధునాతన సదుపాయాలతో అన్ని గ్రామాల్లో అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది.
చత్తీస్ గఢ్ రాష్ట్రం చాలా కాలంగా,. భూగర్భజలాల క్షీణత, నీటి కాలుష్యం వంటి సమస్యలను ఎదుర్కొంటూ వస్తోంది. దీనితో,.. నీటి నాణ్యత ఆవశ్యకతపై అవగాహన కల్పంచేందుకు సంబంధితత సంస్థలన్నింటి భాగస్వామ్యంతో చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని చత్తీస్ గఢ్ ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. జలజీవన్ మిషన్ కింద నీటి నాణ్యతపై నిఘాకోసం స్థానిక ప్రజాసంఘాల ప్రమేయంతో తగిన ప్రాధాన్యం ఇస్తున్నారు. నీటి నాణ్యతను పరీక్షించేందుకు ప్రతి గ్రామంలో ఐదుగురు మహిళలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. నీటి సరఫరాకు ఉపయోగించే ప్రతి నీటి వనరునూ, రసాయన అవశేషాల ఉనికిపై, ప్రతి ఏడాదీ పరీక్షించవలసి ఉంటుంది. బాక్టీరియా కాలుష్యాల ఉనికిని ధ్రువీకరించుకునేందుకు ఏడాది రెండుసార్లు పరీక్షించవలసి ఉంటుంది.
రాష్ట్రంలోని 1,698 పాఠశాలలకు ఎలాంటి మంచినీటి సరఫరా సదుపాయం లేదని అధికారులు తాజా సమీక్షలో తెలిపారు. రాష్ట్రంలోని 50,518 అంగన్ వాడీ కేంద్రాలకు గాను, 31,031 కేంద్రాల్లో తాగునీటి సదుపాయం ఉంది. అయితే, ఈ కేంద్రాల్లో నీటి సరఫరా సుదుపాయం స్వభావం, నీటి పరిమాణం, నీటి నాణ్యత, అమలు ప్రణాళిక,.. తదితర అంశాలపై ఇంకా సవివర విశ్లేషణ, సమీక్ష జరగవలసి ఉంది. దేశంలోని పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలకు వందరోజుల్లోగా నీటి సరఫరా కనెక్షన్ల ఏర్పాటు చేయాలంటూ 2020, అక్టోబరు 2న ప్రారంభించిన కార్యక్రమం అమలుకోసం గట్టిగా కృషి చేయాలని చత్తీస్ గఢ్ రాష్ట్రానికి కేంద్రం సూచించింది.
****
(Release ID: 1668920)
Visitor Counter : 161