ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, కేరళలో కోవిడ్–19 కేసులు, ప్రజారోగ్య ప్రతిస్పందన చర్యలను కేంద్ర ఆరోగ్య కార్యదర్శి సమీక్షించారు


పండుగ సీజన్లో “పరీక్ష, ట్రాకింగ్ & చికిత్స” వ్యూహాన్ని రూపొందించాలని రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించారు.

కోవిడ్ నియంత్రణపై ప్రజలకు అవగాహన కలిగించడానికి ప్రాముఖ్యం ఇవ్వాలని సూచించారు.

Posted On: 29 OCT 2020 4:55PM by PIB Hyderabad

పశ్చిమ బెంగాల్, కేరళ, ఢిల్లీ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోవిడ్ కేసులు, వారి ప్రజారోగ్య ప్రతిస్పందన చర్యలను కేంద్ర ఆరోగ్య కార్యదర్శి  రాజేష్ భూషణ్ ఈ రోజు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించిన సమావేశంలో సమీక్షించారు,  నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వికె పాల్, ఐసిఎంఆర్ డీజీ డాక్టర్ బలరామ్ భార్గవ,. రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్యశాఖల కార్యదర్శులు, నేషనల్ హెల్త్ మిషన్ ఎండీ, డిజిహెచ్ఎస్ ఇతర సీనియర్ ఆరోగ్య అధికారుల ఈ వర్చువల్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ రాష్ట్రాలలో / కేంద్ర పాలిత ప్రాంతాల్లో పెరుగుతున్న కేసులపై సమావేశంలో కూలంకషంగా చర్చించారు.

ప్రస్తుతం ఢిల్లీలో 29,378 క్రియాశీలక కేసులు ఉన్నాయి, మరణాల రేటు 1.76శాతం  ఉంది. పాజిటివిటీ రేటు 7.9 శాతం నమోదయింది. గత 24 గంటల్లో 5,673 కొత్త కేసులు నమోదయ్యాయి. గత నాలుగు వారాలలో కొత్త కేసులలో దాదాపు 46శాతం పెరుగుదల ఉంది.  గత నాలుగు వారాలలో పాజిటివిటీ రేటు దాదాపు తొమ్మిది శాతం పెరిగింది. పండగ ఉత్సవాల సందర్భంగా సామాజిక సమావేశాలు, క్షీణిస్తున్న గాలి నాణ్యత, శ్వాసకోశ రుగ్మతలు , పని ప్రదేశాలలో పాజిటివ్ కేసుల సమూహాల వల్ల కేసులు పెరుగుతున్నాయి.  ఫ్రంట్‌లైన్ కార్మికుల్లో అలసటపైనా చర్చ జరిగింది.   ఆర్టీ‌‌ పీసీఆర్ పరీక్షల దూకుడును పెంచడం, కాంటాక్ట్ ట్రేసింగ్‌పై దృష్టి పెట్టడం,  గుర్తించిన కాంటాక్టులను 72 గంటలలోపు వేరుచేయడం వంటి చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతానికి సూచించారు. కంటోన్మెంట్, జోన్లపై దృష్టి పెట్టాలని, కేంద్ర హోంమంత్రిత్వశాఖ మార్గదర్శకాల ప్రకారం కఠినమైన చుట్టుకొలత నియంత్రణలను అమలు చేయాలని సూచించారు. ఆరోగ్య అధికారులు ఐఇసి పద్ధతులకు అదనపు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడంతోపాటు,  ఇతర కోవిడ్ నిబంధనలను పాటించడాన్ని ప్రోత్సహించాలని సూచించారు.

పశ్చిమ బెంగాల్‌లో ప్రస్తుతం 37,111 క్రియాశీల కేసులు ఉన్నాయి.  మరణాల రేటు 1.84శాతం , పాజిటివిటీ రేటు 8.3శాతం నమోదయింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 3,924 కొత్త కేసులు వెలుగు చూశాయి. గత నాలుగు వారాలలో సగటున రోజువారీ కేసులు 23శాతం పెరిగాయి. గత నాలుగు వారాలలో పాజిటివిటీ రేటులో ఒకశాతం పెరుగుదల ఉంది. డార్జిలింగ్, నదియా, మెదినీపూర్ వెస్ట్, జల్పాయిగురి, హూగ్లీలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కాగా, ముర్షిదాబాద్, నదియా, కూచ్‌బిహార్, కోల్‌కతా, డార్జిలింగ్‌జిల్లాల్లో గత వారం మరణాలు పెరిగాయి. పది లక్షల మందికి పరీక్షల సంఖ్య (టిపిఎం) 41,261 కాగా, జాతీయ టిపిఎం 77,220గా ఉంది.  ‘టెస్ట్-ట్రాక్-ట్రీట్’ వ్యూహాన్ని ఖచ్చితంగా పాటించాలని ఈ రాష్ట్రానికి సూచించారు. పరీక్షల్లో రాజీ పడవద్దని, రోజువారీ పరీక్షలను, ఆర్టీ-పిసిఆర్ పరీక్షలను పెంచాలని పశ్చిమ బెంగాల్ ఆరోగ్య అధికారులకు సూచించారు. కోవిడ్ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు, కేసులను ముందుగా గుర్తించాలని, వారిని త్వరగా ఆస్పత్రులకు తరలించాలని  సూచించారు. హోం ఐసోలేటెడ్ రోగులలో రోగలక్షణాలను,  హాస్పిటలైజేషన్ ధోరణులను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు.   వేగవంతమైన కాంటాక్ట్ ట్రేసింగ్‌పై దృష్టి పెట్టాలని,  కనుగొన్న కాంటాక్టులను త్వరగా వేరుచేయాలని రాష్ట్ర అధికారులకు ఉన్నతాధికారుల బృందం స్పష్టం చేసింది.

కేరళలోనూ కేసుల పెరుగుదల కనిపిస్తోంది.  ఇప్పటి వరకు మొత్తం క్రియాశీల కేసులు 93,369 ఉన్నాయి. గత నాలుగు వారాలలో సగటు రోజువారీ కేసులు 11శాతం పెరిగాయి. గత 14 రోజుల్లో కొత్త కేసుల సంఖ్య 98,778లకు చేరింది. గత 24 గంటల్లో కేరళలో అత్యధికంగా 8,790 కేసులు నమోదయ్యాయి. త్రిస్సూర్, అలప్పుజ, కొట్టాయం, పతనంతిట్ట, మలప్పురం జిల్లాలో కేసులు ఎక్కువ అవుతున్నాయి. కోవిడ్ మరణాలను తగ్గించడంలో రాష్ట్రం మంచి ఫలితాలను ప్రదర్శించింది. త్రిస్సూర్ (133శాతం), కొల్లం (75శాతం), అలప్పుజ (31శాతం), ఎర్నాకుళం (30శాతం), కన్నూర్ (15శాతం)  జిల్లాలో మరణాలు రేటు ఉంది. ఈ రాష్ట్రంలో   ప్రతి పది లక్షల మందికి పరీక్షల (టీపీఎం) సంఖ్య 66,755గా ఉంది..  పాజిటివిటీ రేటు గణనీయంగా 16.5శాతం  ఉంది. పాజిటివిటీ రేటు గత నాలుగు వారాలలో 41శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఉత్సవాల కారణంగా కొత్త కేసుల పెరుగుదల తీవ్ర ఆందోళన కలిగిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఐఇసి పద్ధతులను వేగవంతం చేయాలని, మాస్క్ ధరించడాన్ని మరింత కఠినంగా అమలు చేయాలని రాష్ట్రానికి సూచించారు. పొరుగు జిల్లాలు  రాష్ట్రాలతో సరిహద్దుల్లో కాంటాక్ట్ ట్రేసింగ్ను కేరళ పర్యవేక్షిస్తున్నది. మలప్పురం వంటి చాలా ఎక్కువ పాజిటివిటీ రేట్లు ఉన్నందున, అక్కడ నిబంధనలను మరింత కఠినతరం చేయాలి. సామాజిక దూరం, పరిశుభ్రత పాటించడం, మాస్కులు ధరించడం వంటి వాటిని తప్పనిసరి చేయాలని రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉన్నతాధికారులు సూచించారు.

 

***



(Release ID: 1668866) Visitor Counter : 177