ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో త‌నిఖీలు నిర్వ‌హించిన ఆదాయ‌ప‌న్ను శాఖ‌


Posted On: 29 OCT 2020 7:19PM by PIB Hyderabad

 

బిజ్‌నోర్ కు చెందిన ఒక రియ‌ల్  ఎస్టేట్ గ్రూప్‌, దాని అనుబంధ సంస్థ‌ల‌పై ఆదాయ‌ప‌న్ను శాఖ 28-10-2020 న త‌నిఖీలు ప్రారంభించింది. ఈ గ్రూపు కంపెనీలకు పెద్ద మొత్తంలో ప్రీమియం సెక్యూరిటీ రిజ‌ర్వులు ఉండ‌డం, రుణాలు,  తీసుకున్న‌ఇత‌ర అడ్వాన్సులు చెల్లించాల్సిఉండ‌డం, ఇత‌ర చెల్లింపులు , అయినా ఇత‌రుల‌కు చెప్పుకోద‌గిన స్థాయిలో ఇత‌రుల‌కు రుణాలు ఇవ్వ‌డం వంటి ఆరోప‌ణ‌లు ఈ గ్రూప్‌పై ఉన్నాయి. సంస్థ చూపుతున్న రుణాలు, అడ్వాన్సుల స్థాయిలో అమ్మ‌కాలు క‌నిపించ‌డం లేదు.

త‌నిఖీల సంద‌ర్భంగా 50 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు పైగా న‌గ‌దు, త‌గిన వివ‌ర‌ణ‌ లేని రెండున్న‌ర కేజీల ఆభ‌ర‌ణాలు ఇప్ప‌టివ‌ర‌కూ  క‌నుగొన్నారు. షేర్ ప్రీమియంకు సంబంధించిన ఆరోప‌ణ‌లు వాస్త‌వ‌మ‌ని త‌నిఖీల‌లో గుర్తించారు. ఇవి సంబంధిత షేరోహోల్డ‌ర్ల రాబ‌డికి అనుగుణంగా లేవ‌ని, వీటి రాబ‌డి ఎక్కిడినుంచో వివ‌రాలు లేవ‌ని గుర్తించారు.

ఒకే ప్రాంగ‌ణం నుంచి 20 కంపెనీలకు పైగా న‌డుస్తున్న‌ట్టు త‌నిఖీల సంద‌ర్భంగా గుర్తించారు. వీటిలో చాలావ‌ర‌కు డ‌మ్మీకంపెనీలు. ఇవి ఎలాంటి కార్య‌క‌లాపాలు నిర్వ‌హించ‌డం లేదు. వీటికి ఎలాంటి విలువ లేక‌పోయినా వాటి షేర్లు ప్రీమియం ను సూచిస్తున్నాయి.ఈ డ‌మ్మీ కంపెనీల‌ను నిధుల మ‌ళ్లింపున‌కు వాడుకుంటున్న‌ట్టు గుర్తించారు.

ఈ గ్రూపంఉ కంపెనీలోని ఒక‌రికి బ్రిట‌న్ కు చెందిన విదేశీ కంపెనీలో ఆర్ధిక ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. లండ‌న్‌లో ఒక ఆస్థి ఉంది. అక్క‌డి పెట్టుబ‌డుల‌పై కూడా ఆదాయ‌ప‌న్ను శాఖ ఆరాతీస్తోంది. ప‌లుచోట్ల జ‌రిపిన త‌నిఖీల‌లో చాలాఆస్థుల‌లో పెట్టుబ‌డుల‌కు సంబంధించిన ప‌త్రాల‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ప‌రిశీలిస్తున్నారు. ఈ ఆస్తుల‌లో పెట్టుబ‌డుల‌పై ప‌రిశీలిస్తున్నారు. ఈ గ్రూపు కుగ‌ల ఆస్తుల‌లో పెట్టుబ‌డుల‌కు నిధులు ఎక్క‌డినుంచి వ‌చ్చాయ‌న్న‌ది త‌నిఖీ చేస్తున్నారు.  కొన్ని చెల్లింపుల‌కు సంబంధించి చేతితో రాసిన ప‌త్రాలు,ర‌శీదులు కూడా త‌నిఖీల‌లో స్వాధీనం చేసుకున్నారు. వాటిని కూడా ప‌రిశీలిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఆరు బ్యాంకు లాక‌ర్ల‌ను క‌నుగొన్నారు. త‌నిఖీలు కొన‌సాగుతున్నాయి.

 

*****

 


(Release ID: 1668763) Visitor Counter : 139


Read this release in: English , Urdu , Hindi , Manipuri