శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

డిఎస్టి ఆధ్వర్యంలో ఎస్ఈఆర్బి-పవర్ (అన్వేషణాత్మక పరిశోధనలో మహిళలకు అవకాశాలను ప్రోత్సహించడం) అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించిన డాక్టర్ హర్ష్ వర్ధన్

భారతీయ విద్యాసంస్థలు మరియు ఆర్ అండ్ డి ప్రయోగశాలలలోని వివిధ ఎస్ & టి కార్యక్రమాలలో సైన్స్ మరియు ఇంజనీరింగ్ పరిశోధన ఆర్ధిక సహాయ కార్యక్రమాల్లో లింగ అసమానతను తగ్గించేందుకు ఉద్దేశించిన పథకం ఇది.

"పరిశోధన రంగంలో మహిళలు భాగస్వామ్యం పెంచి వారికి ప్రోద్బలం ఇవ్వడం మా ప్రభుత్వ అధిక ప్రాధాన్యత అంశం": డాక్టర్ హర్ష్ వర్ధన్

Posted On: 29 OCT 2020 7:14PM by PIB Hyderabad

కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ఒక కార్యక్రమంలో మహిళా శాస్త్రవేత్తల కోసం ప్రత్యేకంగా రూపొందించిన “సెర్బ్-పవర్ (అన్వేషణాత్మక పరిశోధనలో మహిళలకు అవకాశాలను ప్రోత్సహించడం)” అనే పథకాన్ని ప్రారంభించారు. ఈ-ప్లాట్‌ఫాం. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ (ఎస్‌ఇఆర్‌బి) అనేది, కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డిఎస్‌టి) చట్టబద్దమైన సంస్థ, సైన్స్ మరియు ఇంజనీరింగ్ పరిశోధనలలో లింగ అసమానతలను తగ్గించడానికి భారతీయ విద్యాసంస్థలు మరియు ఆర్ అండ్ డి ప్రయోగశాలలలో వివిధ ఎస్ & టి కార్యక్రమాలకు సంబంధించి ఒక పథకాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తోంది.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఎస్ అండ్ టి పరిథి‌లో మహిళా పరిశోధకులను శక్తివంతం చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. “పరిశోధనా రూపకల్పనలో లింగ కోణాన్ని ఏకీకృతం చేయడం ప్రపంచ దృశ్యంలో గణనీయమైన దృష్టిని ఆకర్షించింది. పరిశోధనా శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం మరియు ప్రమోషన్ పెరగడం మా ప్రభుత్వం యొక్క ప్రధాన ప్రాధాన్యతలలో ఒకటి ”. ఉమెన్ ఫెలోషిప్ పథకం ద్వారా డిఎస్టి కొన్ని ముఖ్యమైన మహిళా సాధికారత విధానాలను ప్రవేశపెట్టిందని మరియు గతంలో వేలాది మంది మహిళా పరిశోధకులకు దిశానిర్దేశం ఇచ్చిందని ఆయన ప్రశంసించారు.

 

 సెర్బ్-పవర్ పథకం లో రెండు అంశాలు ఉంటాయి.(i) సెర్బ్-పవర్ ఫెలోషిప్  (ii) సెర్బ్-పవర్ పరిశోధన నిధులు. 

A. సెర్బ్-పవర్ ఫెలోషిప్ :

a)         లక్ష్యం: 35-55 ఏళ్ల మధ్య వయస్కులైన మహిళా పరిశోధకులు. ఐ సంవత్సరానికి 25 వరకు ఫెలోషిప్ లు, 75 మించకుండా 

b)        సహాయం: నిత్యం వచ్చే ఆదాయంతో పటు నెలకు రూ.15,000/- తో ఫెలోషిప్; పరిశోధన గ్రాంటు ఏడాదికి రూ. 10 లక్షలు; దీనితో పాటు ఏడాదికి ప్రతి ఒక్కరిపై చేసే ఖర్చు రూ.90,000/-

c).       వ్యవధి: పొడిగింపునకు ఆస్కారం లేకుండా మూడేళ్ళ వ్యవధి. మొత్తం తన కెరీర్ లో ఒక సరే అవకాశం. 

B. సెర్బ్-పవర్ పరిశోధన గ్రాంటు:

a)        పవర్ గ్రాంటు మహిళా పరిశోధకులకు సాధికారతగా ఉంటుంది. 

i.       స్థాయిI  (ఐఐటీలు, ఐసెర్ లు, ఐఐఎస్సి, నిట్ లు, కేంద్ర విశ్వవిద్యాలయాలు మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థల జాతీయ ప్రయోగశాలల నుండి దరఖాస్తుదారులు): మూడేళ్ళకు రూ.60 లక్షల వరకు నిధుల స్థాయి ఉంటుంది.

ii.    స్థాయి II (రాష్ట్ర విశ్వవిద్యాలయాలు / కళాశాలలు మరియు ప్రైవేట్ విద్యాసంస్థల నుండి దరఖాస్తుదారులు): మూడేళ్లపాటు నిధుల స్థాయి రూ.30 లక్షల వరకు ఉంటుంది. 

b.        సెర్బ్-సిఆర్జి (సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్-కోర్ రీసెర్చ్ గ్రాంట్) మార్గదర్శకాలకు అనుగుణంగా రిఫరెన్స్ నిబంధనల ద్వారా పవర్ గ్రాంట్ నియంత్రించబడుతుంది. 

            ఈ ప్రయోజనం కోసం ఏర్పాటు చేసిన సెర్చ్-కమ్-సెలక్షన్ కమిటీ పవర్ ఫెలోషిప్‌ను గుర్తించడంలో సహాయపడుతుంది, అయితే పవర్ రీసెర్చ్ గ్రాంట్స్‌ను ఎంచుకోవడానికి ప్రస్తుత ప్రోగ్రామ్ అడ్వైజరీ కమిటీ (PAC) విధానం ఉపయోగించబడుతుంది.

ఇది ఏటా 25 పవర్ ఫెలోషిప్‌లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించబడింది. సంవత్సరానికి లెవల్ I & లెవల్ II లో మొత్తం 50 పవర్ గ్రాంట్లు మంజూరు చేయబడతాయి. 

సెర్బ్-పవర్ ఫెలోషిప్‌లు మరియు గ్రాంట్లు కూడా జాతీయ దృష్టాంతంలో గుర్తింపు యొక్క ప్రమాణంగా ఉపయోగపడతాయని భావించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సెర్బ్ చైర్మన్ & డిఎస్టి సెక్రటరీ ప్రొఫెసర్ అశుతోష్ శర్మ, సెర్బ్ కార్యదర్శి ప్రొఫెసర్ సందీప్ వర్మ హాజరయ్యారు. 

 

 

*****



(Release ID: 1668721) Visitor Counter : 246