ఆర్థిక మంత్రిత్వ శాఖ
వివాద్ సే విశ్వాస్ పథకం చెల్లింపు తేదీ పొడిగింపు
పన్ను చెల్లింపుదారులతో మాట్లాడాలని ఐటీశాఖను కోరిన ఆర్థిక కార్యదర్శి
Posted On:
27 OCT 2020 10:36PM by PIB Hyderabad
వివాద్ సే విశ్వాస్ పథకం కింద వివాదాలను పరిష్కరించుకోవాలనుకునే పన్ను చెల్లింపుదారులకు మరింత ఉపశమనం కలిగించడానికి, ప్రభుత్వం 2020 డిసెంబర్ 31 నుండి 2021 మార్చి 31 వరకు అదనపు మొత్తం లేకుండా చెల్లింపుల తేదీని పొడిగించింది. ఈ పథకం కింద డిక్లరేషన్ ఇవ్వడానికి చివరి తేదీని 2020 డిసెంబర్ 31 వరకు పొడగించారు. ఈ రోజు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, వివాద్ సే విశ్వాస్ పథకం కింద డిక్లరేషన్ను 2020 డిసెంబర్ 31 లోపు ఇవ్వవలసి ఉంటుంది. ఇందుకు సంబంధించిన డిక్లరేషన్లకు సంబంధించి మాత్రమే అదనపు మొత్తం చెల్లించాల్సిన అవసరం లేకుండా 2021 మార్చి 31 వరకు డబ్బు కట్టవచ్చు.
వివాద్ సే విశ్వాస్ పథకంపై ఆదాయపు పన్ను శాఖ ఇప్పటివరకు సాధించిన పురోగతిని ఆర్థిక కార్యదర్శి డాక్టర్ అజయ్ భూషణ్ పాండే ఈ రోజు సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సిబిడిటి చైర్మన్ బోర్డు సభ్యులతో పాటు ఆదాయపు పన్ను ప్రధాన ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్లతో మాట్లాడారు. పన్ను చెల్లింపుదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్న ఈ పథకాన్ని వేగవంతం చేయాలని సూచించారు. "వివాద్ సే విశ్వాస్ పథకాన్ని పట్టుదలతో ముందుకు తీసుకెళ్లాలి. పన్ను చెల్లింపుదారులకు అవసరమైన సాయం చేయడానికి వారిని సంప్రదించాలి" అని ఆయన అన్నారు.
ఈ పథకాన్ని నిర్దుష్టసమయంలో విజయవంతంగా అమలు చేయడానికి ఉపయోగపడే కార్యాచరణ ప్రణాళికకు సంబంధించి క్షేత్రస్థాయి అధికారుల సూచనలపై, వ్యాఖ్యలపై ఈ సందర్భంగా చర్చించారు. ఆర్థిక కార్యదర్శి డాక్టర్ పాండే మాట్లాడుతూ, "ఇది పన్ను చెల్లింపుదారుల ప్రయోజనం సౌలభ్యం కోసం రూపొందించిన పథకం. ఎందుకంటే వ్యాజ్యపు ఖర్చులు లేకుండా వివాదాన్ని తక్షణం పరిష్కరించుకోవచ్చు. జరిమానా, వడ్డీ, ప్రాసిక్యూషన్ ఖర్చుల మాఫీ వల్ల రూపంలో ద్రవ్య ప్రయోజనాలు దక్కుతాయి. ఈ పథకం వల్ల పన్ను చెల్లింపుదారుడిపై ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారాన్ని మరింత విస్తరించుకోవచ్చు. మరోవైపు, ప్రభుత్వం దాని దీర్ఘకాలిక బకాయిలను పొందుతుంది. వివాదాలు వల్ల ఖర్చయ్యే వనరులు ఆదా అవుతాయి”అని ఆయన వివరించారు. సమావేశంలో సిబిడిటి చైర్మన్ పి.సి. మోడీ మాట్లాడుతూ ఈ పథకం కింద సులభంగా డిక్లరేషన్లను దాఖలు చేయడం ఎంత ముఖ్యమో వివరించారు.. పెండింగ్‌లో ఉన్న దిద్దుబాట్లను సరిచేడం, అప్పీళ్లను పరిష్కరించడం, డూప్లికేట్ డిమాండ్లను తొలగించడం వంటి పనులను త్వరితం చేయాలని ఐటీశాఖ ఉన్నతాధికారులను కోరారు. దీనివల్ల పన్ను చెల్లింపుదారుడు ఫైనల్ డిమాండ్కు రావడానికి అవకాశం ఉంటుందని వివరించారు. వివాద్ సే విశ్వాస్ పథకం కింద పన్ను చెల్లింపుదారుడు ఫారం 1 లేదా 2 కింద ఫైల్ చేసినప్పుడు సంబంధిత ఆదాయపు పన్ను కమిషనర్ ఫారం 3 ను వెంటనే జారీ చేయవచ్చని మోదీ వివరించారు.
పన్ను చెల్లింపుదారులను నేరుగా సంప్రదించడం, డిక్లరేషన్లు దాఖలు చేయడంలో వారికి మార్గనిర్దేశం చేయడం, సౌకర్యాలు కల్పించడం, పథకాన్ని పొందడంలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు లేదా సమస్యలను తొలగించేలా పథకం అమలుకు క్రియాశీల విధానాన్ని అనుసరించాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రతి పక్షం రోజులకు ఒకసారి పథకం పురోగతిపై సమీక్షించాలని నిర్ణయించారు. పెండింగ్‌లో ఉన్న ఆదాయపు పన్ను వ్యాజ్యాలను తగ్గించడం, ప్రభుత్వానికి సకాలంలో ఆదాయాన్ని సంపాదించడం, పన్ను చెల్లింపుదారులకు మనశ్శాంతిని కల్పించడానికి ఈ ఏడాది మార్చి 17 న ప్రత్యక్ష పన్ను వివాద్ సే విశ్వాస్ చట్టం తెచ్చారు. దీనివల్ల సమయం, వనరులు ఆదా అవుతాయి. లేకపోతే వ్యాజ్యాల పరిష్కారానికి సుదీర్ఘకాలం పడుతుంది. వివాదాలను పరిష్కరించడానికి పన్ను చెల్లింపుదారులకు ఎక్కువ సమయం ఇవ్వడానికి, వివాద్ సే విశ్వాస్ కింద డిక్లరేషన్ దాఖలు చేయడానికి అదనపు మొత్తం లేకుండా చెల్లింపు చేయడానికి ఇది వరకే 2020 మార్చి 31 నుండి 2020 జూన్ 30 వరకు గడువు పొడిగించారు. తరువాత, ఈ తేదీని డిసెంబరు 31 వరకు పొడిగించారు. అందువల్ల, అంతకుముందు డిక్లరేషన్ వివాద్ సే విశ్వాస్ కింద ఇచ్చిన డిక్లషరేషన్లపై అదనపు మొత్తం లేకుండా 2020 డిసెంబర్ 31 లోపు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.
****
(Release ID: 1668123)
Visitor Counter : 190