కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ఇండియా పోస్ట్ మరియు యునైటెడ్ స్టేట్స్ పోస్టల్ సర్వీస్ (యుఎస్పిఎస్) రెండు దేశాల మధ్య మార్పిడి జరిగే పోస్టల్ సరుకులకు సంబంధించిన కస్టమ్స్ డేటా ఎలక్ట్రానిక్ ఎక్స్ఛేంజ్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నాయి

తపాలా మార్గాల ద్వారా చిన్న మరియు పెద్ద ఎగుమతిదారులకు సౌలభ్యంగా ఉండేలా
‘సులభతర ఎగుమతులు' ఈ ఒప్పందం లక్ష్యం

Posted On: 27 OCT 2020 6:56PM by PIB Hyderabad

ఇరు దేశాల మధ్య మార్పిడి చేసిన పోస్టల్ సరుకులకు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ కస్టమ్స్ డేటా కోసం భారత పోస్టల్ విభాగం, యునైటెడ్ స్టేట్స్ పోస్టల్ సర్వీస్ (యుఎస్పిఎస్) ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం అంతర్జాతీయ తపాలా వస్తువులు గమ్యస్థానానికి రాకముందే ఎలక్ట్రానిక్ డేటాను ప్రసారం చేయడానికి, స్వీకరించడానికి వీలు కల్పిస్తుంది. అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ పోస్టల్ ఫ్రేమ్‌వర్క్‌కు అనుగుణంగా ముందుగానే పోస్టల్ వస్తువులను కస్టమ్స్ క్లియరెన్స్ చేస్తుంది. ఇది విశ్వసనీయత, దృశ్యమానత మరియు భద్రత పరంగా పోస్టల్ సేవల పనితీరును మెరుగుపరుస్తుంది.

Photo Source:  PTI

భారత ఎగుమతులకు గమ్యం అమెరికా (~ 17%), ఇది పోస్టల్ ఛానల్ ద్వారా వస్తువుల మార్పిడిలో కూడా ప్రతిబింబిస్తుంది. 2019 లో, ఇండియా పోస్ట్ ప్రసారం చేసిన 20% బయటకు వెళ్లే ఈఎంఎస్, 30% ఉత్తరాలు, చిన్న ప్యాకెట్లు అమెరికా గమ్యస్థానం గా చేరవేయాల్సి ఉండగా, ఇండియా పోస్ట్ అందుకున్న 60% పార్శిల్‌లు అమెరికా నుండి వచ్చాయి. ఒప్పందం ప్రకారం ఎలక్ట్రానిక్ అడ్వాన్స్ డేటా ఎక్స్ఛేంజ్ (ఈఏడి) పరస్పర వాణిజ్యాన్ని ప్రోత్సహించే దిశగా పోస్టల్ ఛానల్ ద్వారా భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి యుఎస్ఎకు ఎగుమతులకు ప్రాధాన్యతనిస్తూ పోస్టల్ ఛానల్ ద్వారా యుఎస్ఎ ఇక్కడి ఎంఎస్ఎంఈల రత్నాలు & ఆభరణాలు, ఔషధాలు మరియు ఇతర స్థానిక ఉత్పత్తులు ఉత్పత్తుల ప్రధాన గమ్యం, . ఎగుమతి వస్తువుల కస్టమ్స్ అనుమతులను వేగవంతం చేయడానికి ఎగుమతి పరిశ్రమ యొక్క ప్రధాన డిమాండ్‌ను ఇది నెరవేరుస్తుంది. ఈ ఒప్పందం ద్వారా అందించబడే ప్రాధమిక లక్ష్యం దేశంలోని వివిధ ప్రాంతాల నుండి పోస్టల్ చానెళ్ల ద్వారా చిన్న మరియు పెద్ద ఎగుమతిదారులకు 'ఎగుమతుల సౌలభ్యాన్ని' సులభతరం చేయడం మరియు భారతదేశాన్ని ప్రపంచానికి ఎగుమతి కేంద్రంగా మార్చడానికి దోహదం చేస్తుంది. ఈ ఒప్పందంపై భారత ప్రభుత్వ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఇంటర్నేషనల్ రిలేషన్స్ & గ్లోబల్ బిజినెస్) ప్రణయ్ శర్మ, యునైటెడ్ స్టేట్స్ పోస్టల్ సర్వీస్ యొక్క గ్లోబల్ బిజినెస్ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ రాబర్ట్ హెచ్. రైన్స్ జూనియర్ సంతకాలు చేశారు. 

***



(Release ID: 1667989) Visitor Counter : 239