వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

2020-21 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ లో ఎమ్.ఎస్.పి. ఆపరేషన్లు

ఇప్పటికే కొనసాగుతున్న కె.ఎం.ఎస్. సేకరణ కార్యకలాపాల ద్వారా సుమారు 12.98 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు

Posted On: 26 OCT 2020 4:02PM by PIB Hyderabad

కొనసాగుతున్న 2020-21 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కె.ఎం.ఎస్) లో, గత సీజన్లలో చేసినట్లుగా, ప్రస్తుత ఎమ్.ఎస్.పి. పథకాల ప్రకారం ప్రభుత్వం తన ఎం.ఎస్.పి. వద్ద 2020-21 ఖరీఫ్ పంటలను రైతుల నుండి కొనుగోలు చేస్తూనే ఉంది.

వరి పండించే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలైన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్యు, తమిళనాడు, ఉత్తరాఖండ్, చండీగఢ్, జమ్మూ-కశ్మీర్, గుజరాత్, కేరళ లో, 2020-21 ఖరీఫ్ వరి సేకరణ, సజావుగా సాగుతోంది.  గత ఏడాది ఇదే కాలంలో కొనుగోలు చేసిన 125.05 లక్షల మెట్రిక్ టన్నుల వరి తో పోలిస్తే ఈ ఏడాది, 25.10.2020 తేదీ వరకు కొనుగోళ్ళు 20.89 శాతం ఎక్కువగా అంటే 151.17 లక్షల మెట్రిక్ టన్నుల మేర వరి కొనుగోళ్ళు జరిగాయి. మొత్తం 151.17 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలులో, కేవలం పంజాబ్ లోనే 100.89 లక్షల మెట్రిక్ టన్నుల మేర వరి కొనుగోళ్ళు జరిగాయి. ఇది మొత్తం సేకరణలో 66.719 శాతంగా ఉంది. మెట్రిక్ టన్ను 18,880 రూపాయల ఎం.ఎస్.పి. ధరతో, 28,542.59 కోట్ల రూపాయల మేర ఎం.ఎస్.పి. విలువతో, సుమారు 12.98 లక్షల మంది రైతులు ఇప్పటికే కొనసాగుతున్న ఈ కె.ఎం.ఎస్. సేకరణ కార్యకలాపాల నుండి లబ్ధి పొందారు. 

వీటితో పాటురాష్ట్రాల ప్రతిపాదనల ఆధారంగాతమిళనాడుకర్ణాటకమహారాష్ట్రతెలంగాణగుజరాత్హర్యానాఉత్తర ప్రదేశ్ఒడిశారాజస్థాన్ఆంధ్రప్రదేశ్  రాష్ట్రాలలో ధరల మద్దతు పధకం (పి.ఎస్.ఎస్) కింద 2020-21 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కోసం 45.10 లక్షల మెట్రిక్ టన్నుల పప్పులునూనె గింజలను సేకరించడానికి అనుమతి ఇవ్వడం జరిగింది  వీటితో పాటుఆంధ్రప్రదేశ్కర్ణాటకతమిళనాడుకేరళ రాష్ట్రాలకు 1.23 లక్షల మెట్రిక్ టన్నుల కొబ్బరి (బహు వార్షిక పంట) కొనుగోలుకు అనుమతి ఇవ్వబడింది.  ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల కోసం ధర మద్దతు పథకం (పి.ఎస్.ఎస్) కింద పప్పుధాన్యాలునూనెగింజలుకొబ్బరి సేకరణకు కూడా ప్రతిపాదనలు స్వీకరించినప్పుడు అనుమతి ఇవ్వబడుతుంది.   అందువలనసంబంధిత రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలలోగుర్తించిన పంట కాలం వ్యవధిలో మార్కెట్ రేటు ఎం.ఎస్.పి. కంటే తక్కువగా ఉన్నట్లయితేరాష్ట్రాలు గుర్తించిన సేకరణ  ఏజెన్సీల ద్వారా సెంట్రల్ నోడల్ ఏజెన్సీలుఎఫ్..క్యూ. గ్రేడ్ కు చెందిన  పంటలను నమోదు చేసుకున్న రైతుల నుండి నేరుగా 2020-21 సంవత్సరానికి ప్రకటించిన ఎం.ఎస్.పి. వద్ద సేకరించవచ్చు. 

2020 అక్టోబర్, 25వ తేదీ వరకు తమిళనాడుమహారాష్ట్రహర్యానా రాష్ట్రాల్లోని 923 మంది రైతుల నుండి 7.09 కోట్ల రూపాయల మేర ఎమ్.ఎస్.పి. విలువ కలిగిన 986.39 మెట్రిక్ టన్నుల పెసలు మరియు మినుములను ప్రభుత్వం తన నోడల్ ఏజెన్సీ  ద్వారా సేకరించింది.      అదేవిధంగా,  కర్ణాటకతమిళనాడు రాష్ట్రాలలోని 3,961 మంది రైతులకు లబ్ది చేకూరే  విధంగా 52.40 కోట్ల రూపాయల మేర ఎమ్.ఎస్.పివిలువ కలిగిన 5,089 మెట్రిక్ టన్నుల కొబ్బరి ని సేకరించడం జరిగింది.       కొబ్బరిమినుముల ధరల విషయానికి వస్తేవీటిని ప్రధానంగా పండించే చాలా రాష్ట్రాల్లోవీటి ధరలు ఎమ్.ఎస్.పి.  కంటే ఎక్కువగా  ఎక్కువగా ఉన్నాయి.   ఖరీఫ్ పప్పుధాన్యాలునూనెగింజలకు సంబంధించిఆయా రాష్ట్రాలు నిర్ణయించిన తేదీ నుండి సంబంధిత రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు సేకరణను ప్రారంభించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాయి.   

ఎం.ఎస్.‌పి. కింద పత్తి విత్తన (కపాస్) సేకరణ కార్యకలాపాలు పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సజావుగా జరుగుతున్నాయి.  2020 అక్టోబర్, 25 తేదీ వరకు 68,419 మంది రైతులకు లబ్ధి చేకూరే విధంగా మొత్తం 1,04,790.17 లక్షల రూపాయల మేర ఎమ్.ఎస్.పి. విలువ కలిగిన 3,53,252 బేళ్ళను సేకరించడం జరిగింది. 

*****



(Release ID: 1667668) Visitor Counter : 106