మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

జంషెడ్‌పూర్ ఎన్ఐటీ వజ్రోత్సవ లెక్చర్ హాల్ సముదాయాన్ని ప్రారంభించిన కేంద్ర విద్యా శాఖ మంత్రి

Posted On: 20 OCT 2020 6:39PM by PIB Hyderabad

జంషెడ్‌పూర్  నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ)లో కొత్తగా నిర్మించిన  లెక్చర్ హాల్ సముదాయాన్ని కేంద్ర విద్యా శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ ఈ రోజు దృశ్య శ్రవణ విధానంలో ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జంషెడ్‌పూర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ కరుణేష్ శుక్ల ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తన ప్రారంభ ఉపన్యాసంలో ప్రొఫెసర్ కరుణేష్ శుక్ల ఆన్ లైన్ లో కార్యక్రమంలో పాల్గొన్న వారికి స్వాగతం పలికారు.

       ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి శ్రీ  పోఖ్రియాల్ భవిషత్తులో భారతదేశం విద్యా రంగంలో ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు. నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు గతంలో ప్రపంచ దేశాల విద్యార్థులకు  విద్యను అందించాయని తిరిగి ఇదే తరహాలో వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు విద్యను అభ్యసించడానికి భారతదేశానికి  వస్తున్నారని మంత్రి వివరించారు. సి ఎఫ్ టిఐల విద్యార్థులు పారిశ్రామిక వేత్తలుగా మారి మరింత మందికి ఉపాధి కల్పించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపు ఇచ్చారు. పూర్వ విద్యార్థులు దేశాభివృధికి అందించిన సహకారాన్ని గుర్తు చేసిన మంత్రి వారిని సంప్రదించి వారి నైపుణ్యం, అనుభవాలను సంస్థ అభివృద్ధితో పాటు దేశాభివృద్ధికి ఉపయోగించుకోవచ్చునన్న అంశాన్ని పరిశీలించాలని మంత్రి సూచించారు.

   ఉన్నత  భారత అభియాన్ కార్యక్రమం కింది సంస్థ తన చుట్టుపక్కల ఉన్న గ్రామాలను దత్తత తీసుకొని వాటి అభివృద్ధికి కృషి చేస్తున్నాదని మంత్రి తెలిపారు. సంస్థ అమలు చేస్తున్న కార్యక్రమాలను అభినందించిన మంత్రి కోవిడ్ తగ్గిన తరువాత సంస్థను సందర్శిస్తానని తెలిపారు. అతి తక్కువ కాలంలో ప్రొఫెసర్ శుక్ల నేతృత్వంలో సంస్థ జాతీయ స్థాయిలో తన ర్యాంకును మెరుగు పరచుకోవడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.యూ ఏ ఈకి చెందిన అజ్మన్ విశ్వవిద్యాలయంతో కలసి కోవిడ్ సంబంధిత అంశాలపై గణిత విభాగంలో సంస్థ చేపట్టిన పరిశోధనా కార్యక్రమాలను మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

       లెక్చర్ హాల్ సముదాయంలో ఏర్పాటు చేసిన HD ప్రొజెక్టర్లు వర్చ్యువల్ తరగతులు, స్మార్ట్ తరగతులు లాంటి అత్యాధునిక సౌకర్యాల పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఇంధనాన్ని ఆదా చేయడానికి తీసుకొంటున్న చర్యల వాళ్ళ సంస్థకు గ్రిహ  రేటింగ్ వస్తుందన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. 2020 విద్యావిధానం కింద నిర్ణయించుకున్న లక్ష్యాలను ముఖ్యంగా డిజిటల్ విద్య రంగలక్ష్యాలను సాధించే అంశంలో జంషెడ్‌పూర్ ఎన్ఐటి తన వంతు సహకారాన్ని అందిస్తుందని మంత్రి అన్నారు.

      సంస్థ రిజిస్ట్రార్ గా త్వరలో భాద్యతలు చేపట్టనున్న ప్రొఫెసర్ ఎ కె చౌదరి వందన సమర్పణ చేశారు.

***



(Release ID: 1666253) Visitor Counter : 106