భారత ఎన్నికల సంఘం
బిహార్ శాసనసభ ఎన్నికల 'వ్యయ పర్యవేక్షణ ప్రక్రియ'లో రికార్డు స్థాయిలో రూ.35.26 విలువైన స్వాధీనాలు
प्रविष्टि तिथि:
20 OCT 2020 6:06PM by PIB Hyderabad
ప్రస్తుత బిహార్ ఎన్నికల్లో నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు, 67 మంది వ్యయ పరిశీలకులను భారత ఎన్నికల సంఘం నియమించింది. విశ్రాంత ఐఆర్‌ఎస్ (ఐటీ) అధికారులు మధు మహాజన్, బాలకృష్ణన్‌ను కూడా ప్రత్యేక వ్యయ పరిశీలకులుగా నియమించింది. సంబంధిత రంగంలో వీరికి అపార అనుభవం, నిజాయతీపరులుగా గుర్తింపు ఉంది.
బిహార్ ఎన్నికల వ్యయానికి సంబంధించి 91 నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎన్నికల అధికారులు నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యయ పరిశీలన కోసం 881 చలన బృందాలను, 948 స్థిర నిఘా బృందాలను ఏర్పాటు చేశారు. వ్యయ పర్యవేక్షణపై, బిహార్‌తోపాటు పొరుగు రాష్ట్రాల అధికారులతో ఈసీఐ అనేక సమావేశాలు నిర్వహించింది.
ఓటర్లను ప్రభావితం చేసేలా నగదు, మద్యం, లేదా ఇతర రూపాల్లో తాయిలాల పంపకం చట్ట విరుద్ధం. ఇది 'లంచం' కిందకు వస్తుంది. ఐపీసీ 171బి, ఆర్‌పీ చట్టం కింద ఇది నేరం. ఆ తరహా వస్తువులపై ఖర్చు చేయడం చట్టవిరుద్ధం. దీనికి సంబంధించి, ఈనెల 19వ తేదీ వరకు అధికారులు జరిపిన స్వాధీనాల వివరాలు క్రింది పట్టికలో ఉన్నాయి. 2015 ఎన్నికల్లో పట్టుకున్న రూ.23.81 కోట్ల విలువైన స్వాధీనాలతో పోలిస్తే ఇది రికార్డు.
|
|
శాసనసభ ఎన్నికలు, 2020 (19.10.2020 వరకు)
( రూ. కోట్లలో )
|
శాసనసభ ఎన్నికలు, 2015
(రూ. కోట్లలో)
|
|
మొత్తం
|
రూ. 35.26 కోట్లకుపైగా
రూ.79.85 లక్షలు (నేపాల్ నగదు)
|
రూ.23.81 కోట్లు
|
*******
(रिलीज़ आईडी: 1666199)
आगंतुक पटल : 127