జల శక్తి మంత్రిత్వ శాఖ

మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలోని మజ్గువాన్ ఖుర్ద్ వద్ద నీటి సరఫరా సరిగా లేని దయనీయ స్థితి, దశాబ్దాల గొడ్డు చాకిరీ,

మహిళలకు కలిగే బాధలను తగ్గించడానికి జల్ జీవన్ మిషన్

నాడు పోస్టు చేయడమైనది: 20 OCT 2020 4:18PM by PIB Hyderabad

 

మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలోని బీజావర్ బ్లాక్‌లోని మజ్గువాన్ ఖుర్ద్ బ్లాక్ ప్రాంతంలో నీటి పరిస్థితి కారణంగా మహిళలు ఎదుర్కొంటున్న దశాబ్దాల దుఃఖ బాధలను తొలగించే ఉద్దేశ్యంతో జల్ జీవన్ మిషన్ గ్రామ కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. దిగువ స్థాయి వరకు ప్రణాళిక విధానంతో, స్థానిక సమాజం, గ్రామ పంచాయతీల సాధికారత మరియు సమాజ సహకారాన్ని అందించేలా కేంద్రం నుండి జల్ జీవన్ మిషనిస్ కమ్యూనిటీల వరకు భాగస్వామ్యం అయ్యేలా చర్యలు చేపట్టారు. ఇది స్థానిక సమాజంలో యాజమాన్యం భావాన్ని కలిగిస్తుంది, విశ్వసనీయ వాతావరణాన్ని సృష్టిస్తుంది, దేశంలో నీటి సరఫరా రంగం మెరుగైన అమలు, దీర్ఘకాలిక స్థిరత్వానికి దారితీసే పారదర్శకతను తీసుకువస్తుంది.

మజ్గువాన్ ఖుర్డ్ 1,652 మంది జనాభా, వ్యవసాయంతో వారి ప్రధాన వృత్తి. ఈ గ్రామం 100% భూగర్భ జలాలపై ఆధారపడి ఉంది. గోధుమ సాగుకు పెద్ద మొత్తంలో నీరు వినియోగించబడుతున్నందున తాగునీటి కోసం భూగర్భజల వనరు డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు క్షీణిస్తుంది. గరిష్ట వేసవిలో భూగర్భజల మట్టం జూన్‌లో కనిష్ట స్థాయికి పడిపోతుంది. అందుబాటులో ఉన్న భూగర్భ జలాలను ఎక్కువగా వినియోగించేయడంతో క్లిష్టమైన కాలంలో సంక్షోభాన్ని సృష్టిస్తుంది.

ప్రస్తుతం ఉన్న నీటి వనరులను, చేతి పంపుల లభ్యత, పనికిరాని ట్యాప్ కనెక్షన్లను మ్యాప్ చేయడానికి గ్రామ పంచాయతీలో నిర్వహించిన సర్వే ఆధారంగా గ్రామ కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. గ్రామంలోని 20% గృహాలలో మాత్రమే నీటి కనెక్షన్ ఉంది మరియు 8 చేతి పంపులు గ్రామంలోని నీటి అవసరాలను తీర్చడానికి ఉపయోగించబడతాయి. గ్రామ కార్యాచరణ ప్రణాళిక పనిచేయని ట్యాప్ కనెక్షన్లను జాబితా తయారు చేసింది, పైపుల నీటి సరఫరాను తిరిగి అమర్చడానికి కేటాయించిన నిధులను ఒక పక్క పెట్టుకున్నారు. సర్వే నిర్వహించారు. ఒక సాధారణ ట్యూబ్‌వెల్ నిర్మించాలని, పంప్ సెట్‌ను ఏర్పాటు చేయాలని, ఓవర్‌హెడ్ ట్యాంక్‌ను రక్షించడానికి సరిహద్దు గోడను నిర్మించాలని, విద్యుత్ సరఫరా సౌకర్యం కలిపించాలని సంఘం నిర్ణయించింది. ప్రజారోగ్య, ఇంజనీరింగ్ విభాగం అధికారులు స్థానిక సమాజానికి సాంకేతిక వివరాలను అందించారు. జల్ జీవన్ మిషన్ కింద 55 ఎల్‌పిసిడి నీటిని అందించడానికి సదుపాయం కల్పిస్తామని గ్రామ పంచాయతీ సభ్యులకు తెలియజేశారు.

ప్రతి ఇంటికి సరఫరా చేయబడిన మొత్తం నీటిలో 60-70% గా మారిన వృధా నీటి నిర్వహణ గ్రామస్తులచే ప్రణాళిక చేయబడింది, అందుకు ఇంకుడు గుంతలు నిర్మించడానికి స్థలం లేని ఇళ్ళ కోసం,  ప్రణాళిక ప్రకారం ప్రతిపాదించబడ్డాయి. 

డిపార్ట్మెంట్ చేపట్టిన 3 నెలల ట్రయల్ రన్ తరువాత, నీటి సరఫరా నిర్మాణం నిర్వహణ గ్రామ పంచాయతీ / విలేజ్ వాటర్ & శానిటేషన్ కమిటీకి అప్పగించబడుతుంది, వారు నిర్మాణ బాధ్యత వహిస్తారు.  గ్రామం నిర్ణయించిన విధంగా సంఘం నుండి వినియోగదారు ఛార్జీలను వసూలు చేస్తారు. మిషన్ కింద రూపుదిద్దుకున్న మౌలిక సదుపాయాల ప్రణాళిక, అమలు, ఆపరేషన్ మరియు నిర్వహణ బాధ్యతను మజ్గువాన్ ఖుర్ద్ ప్రజలు తీసుకుంటారని గ్రామసభ తన సమావేశంలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. గ్రామంలోని ప్రతి సభ్యుడు ఈ పథకం కింద అభివృద్ధి చేసిన నీటి వనరులను కాపాడుకోవాలని ఒక అభిప్రాయానికి వచ్చారు. గ్రామానికి చెందిన ఎవరూ నీటి వనరులను కలుషితం చేయకూడదు మరియు ప్రతి ఇంటికి పంపు నీరు చేరి తాగునీటిని ఆదా చేసిన తర్వాత ఉత్పత్తి అయ్యే వ్యక్తిగత వృధా నీటిని సక్రమంగా నిర్వహించడానికి ప్రతిజ్ఞ చేశారు.

 

*****


(రిలీజ్ ఐడి: 1666159) సందర్శకుల సూచీ సంఖ్య : : 168
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Manipuri , Punjabi , Tamil