ఆర్థిక మంత్రిత్వ శాఖ

మహారాష్ట్రలోని రాష్ట్ర రహదారులను అభివృద్ధికోసం అసియా అభివృద్ధి బ్యాంకు, భారత్ మధ్య 177 మిలియన్ డాలర్ల రుణం కోసం ఒప్పందం కుదిరింది.

Posted On: 19 OCT 2020 5:45PM by PIB Hyderabad

మహారాష్ట్రలోని 450 కిలోమీటర్ల  రాష్ట్ర రహదారులు మరియు ప్రధాన జిల్లా రహదారులను అభివృద్ధి చేయడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎడిబి) మరియు భారత ప్రభుత్వాలు ఈ రోజు 177 మిలియన్ డాలర్ల రుణానికి సంబంధించిన ఒప్పందంపై సంతకం చేశాయి.

మహారాష్ట్ర రాష్ట్ర రహదారి అభివృద్ధి ప్రాజెక్టుపై భారత ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి (ఫండ్ బ్యాంక్ మరియు ఎడిబి) శ్రీ సమీర్ కుమార్ ఖరే , ఏడీబీ తరఫున  ఏడీబీ ఇండియా మిషన్ కంట్రీ డైరెక్టర్ శ్రీ కెనిచి యోకోయమ సంతకం చేశారు.

ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలు మరియు పట్టణ కేంద్రాల మధ్య అనుసంధానం పెరుగుతుందని అలాగే గ్రామీణ వర్గాలకు మెరుగైన మార్కెట్లు, ఉపాధి అవకాశాలు మరియు సేవలను పొందటానికి వీలు కలుగుతుందని రుణ ఒప్పందంపై సంతకం చేసిన తరువాత శ్రీ సమీర్ కుమార్ ఖరే పేర్కోన్నారు. మెరుగైన రవాణా సదుపాయం ద్వారా రాష్ట్రంలోని ప్రధాన పట్టణ కేంద్రాల వెలుపల అభివృద్ధి మరియు జీవనోపాధి అవకాశాలుపెరుగుతాయని ..ద్వితీయ శ్రేణి నగరాలు మరియు పట్టణాలకు అభివృద్ధి విస్తరించడం వల్ల.. ప్రజల మధ్య ఆదాయ అసమానతలు తగ్గుతాయని చెప్పారు.

కార్యక్రమంలో శ్రీ కెనిచి యోకోయమ మాట్లాడుతూ..ఈ ప్రాజెక్ట్ లో అంతర్జాతీయంగా ఖ్యాతి చెందిన ఉత్తమ పద్దతులను అనుసరించడంతో పాటు వృద్ధులు, మహిళలు మరియు పిల్లల రక్షణకు చర్యలు చేపట్టామని ఆ మేరకు నిపుణుల పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. అలాగే రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత ఐదేళ్లపాటు రోడ్డును నిర్మించిన కాంట్రాక్ట్ సంస్థ దాని నిర్వహణ బాధ్యతచూస్తుందని తద్వారా జవాబుదారీ తనం మెరుగవుతుందని చెప్పారు. ఉత్తమమైన రోడ్లను నిర్మించేందుకు ఈ పద్దతిని అనుసరిస్తున్నామని వివరించారు. అదే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య లక్ష్యమని చెప్పారు.

మొత్తంమీద ఈ ప్రాజెక్ట్ ద్వారా రెండు ప్రధాన జిల్లాల్లో రోడ్ల అభివృద్ధితో పాటు  450 కిలోమీటర్ల పొడవు గల 11  రాష్ట్ర రహదారులను రెండు వరుసల రోడ్లుగా అభివృద్ధి చెందుతాయి. అలాగే ఏడు జిల్లాల్లోని జాతీయ రహదారులు, అంతరాష్ట్ర రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాలు, రైలు కేంద్రాలతో జిల్లాకు అనుసంధానం పెరుగుతుంది.  ప్రధాన కార్యాలయాలు, పారిశ్రామిక ప్రాంతాలు, సంస్థల ప్రధాన కార్యలయాలు వ్యవసాయ  ప్రాంతాల మధ్య అనుసంధానం మెరుగవుతుంది.

రహదారి రూపకల్పన మరియు రోడ్ల నిర్వహణ ప్రణాళిక, రహదారి భద్రతలో మహారాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్ సిబ్బంది పనితీరును మెరుగుపరడంతో ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది. అలాగే వారి  సామర్థ్యాన్ని పెంచడంతో పాటు విపత్తుల సమయాల్లో పనితీరు మెరుగుపర్చుకోవడంలోనూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం అన్వయించుకోవడంలోనూ ఉపయోగపడుతుంది.

ఆసియా,పసిపిక్ ప్రాంతంలో పేదరిక నిర్మూలనతోపాటు సుస్థిరమైన స్థిరమైన అభివృద్ధిని సాధించేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు తీవ్రంగా కృషి చేస్తోంది. 1966 లో ఈ రీజియన్ లో స్థాపించబడిన సంస్థలో  68 మంది సభ్యులకు గాను 49 మంది సభ్యులు ఈ ప్రాంతానికి సంబంధించిన వారు  ఉన్నారు.

***



(Release ID: 1665978) Visitor Counter : 146