ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ

న్యూఢిల్లీలో ఉత్తమ్ చక్మా నాయకత్వంలోని ఈశాన్య ప్రాంత చక్మా ప్రతినిధివర్గం నుంచి వినతిపత్రాన్ని అందుకున్న కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

ఈశాన్య రాష్ర్టాలకు చేసిన కేటాయింపుల్లో 30 శాతం నిరాదరణకు గురైన వర్గాలకే చేరుతుందన్న డాక్టర్ సింగ్

Posted On: 16 OCT 2020 7:31PM by PIB Hyderabad

ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి చేసిన కేటాయింపుల్లో 30 శాతం నిరాదరణకు గురైన వర్గాలకే చెందుతుందని  ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి వ్యవహారాల కేంద్ర సహాయ (స్వతంత్ర హోదా) మంత్రి, ప్రధానమంత్రి కార్యాలయంలో సిబ్బంది వ్యవహారాలు, ప్రజాఫిర్యాదులు, పింఛన్లు, అణు ఇంధనం, అంతరిక్ష శాఖల సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

అరుణాచల ప్రదేశ్ కు చెందిన “చక్మా, హజాంగ్ వర్గాల పౌరసత్వ హక్కుల కమిటీకి ప్రాతినిథ్యం వహించిన చక్మా ప్రతినిధివర్గం”తో డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న ఈశాన్య ప్రాంతమండలి హోంమంత్రి శ్రీ అమిత్ షా సూచన మేరకు చేసిన ప్రతిపాదనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్ర మంత్రిమండలి ఆమోదించిందని చెప్పారు. అందుకు అనుగుణంగా కొత్త ప్రాజెక్టుల కోసం ఈశాన్య ప్రాంత కౌన్సిల్ కు చేసే కేటాయింపుల్లో 30 శాతం నిధులను సమాజంలో నిరాకరణ, నిరాదరణకు గురవుతున్న వర్గాలు, ఈశాన్య రాష్ర్టాల్లో వృద్ధిపథంలో ఉన్న రంగాల అభివృద్ధికే కేటాయించాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు.

ఈశాన్య ప్రాంత సమాజంలో నిరాకరణకు గురవుతున్న వర్గాల అభివృద్ధికి, అంతర్ ప్రాంతీయ/  అంతర్ సామాజిక వ్యత్యాసాల తొలగింపునకు ఇది ఉపయోగపడుతుందని డాక్టర్ జితేంద్రసింగ్ అన్నారు. దీని వల్ల ఇంతవరకు నిరాదరణకు గురవుతున్న చక్మాలకు కూడా ప్రయోజనం చేకూరుతుందని ఆయన చెప్పారు. దీని ప్రభావంతో ఈశాన్య ప్రాంతాల సాంస్కృతిక వైరుధ్య పరిరక్షణతో పాటు ఈ ప్రాంతానికి చెందిన అంతరించిపోతున్న విభిన్న లిపి, భాషల వృద్ధి కూడా చోటు చేసుకుంటుందన్నారు.

ఈశాన్య ప్రాంత రాష్ర్టాల అభివృద్ధికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కట్టుబడి ఉన్నారని పునరుద్ఘాటిస్తూ దానితో పాటు ఈశాన్య ప్రాంతాల్లోని వివిధ రాష్ర్టాలు, అక్కడ నివశిస్తున్న గిరిజన, సామాజిక వర్గాల అభివృద్ధిలో సమతూకం తీసుకురావడం కూడా ఆయన లక్ష్యమని చెప్పారు. ఈశాన్య ప్రాంత మండలికి కేటాయింపుల్లో 30 శాతం నిధులను నిరాదరణకు, నిరాకరణకు గురవుతున్న వర్గాలకు కేటాయించాలన్న తాజా నిర్ణయం ఆ ప్రాంత సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని ఆయన అన్నారు.

కోవిడ్ మహమ్మారి కల్లోలం రేపిన సమయంలో కూడా ఈశాన్య రాష్ట్ర మండలి ఆ ప్రాంతంలోని వివిధ ప్రాజెక్టులపై పనులు కొనసాగించడాన్ని డాక్టర్ జితేంద్రసింగ్ ప్రశంసించారు. ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఈశాన్య రాష్ట్ర మండలి కోవిడ్ స్పందన చర్యల గురించి కూడా ఆయన ప్రస్తావించారు.


ఈ సందర్భంగా ఉత్తమ్ చక్మా నాయకత్వంలోని ప్రతినిధివర్గం అందించిన వినతిపత్రాన్ని కూడా మంత్రి స్వీకరించారు.

***
 



(Release ID: 1665377) Visitor Counter : 106


Read this release in: English , Urdu , Hindi , Tamil