భారత ఎన్నికల సంఘం

మధ్యప్రదేశ్‌ శాసనసభ ఉప ఎన్నికలకు ప్రత్యేక పోలీసు పరిశీలకుడిగా శ్రీ ఎం.కె.దాస్‌ను నియమించిన ఈసీఐ

నాడు పోస్టు చేయడమైనది: 16 OCT 2020 8:56PM by PIB Hyderabad

మధ్యప్రదేశ్‌ శాసనసభకు నవంబర్‌ 3వ తేదీన ఉప ఎన్నికల దృష్ట్యా, ప్రత్యేక పోలీసు పరిశీలకుడిగా శ్రీ మృణాల్‌ క్రాంతి దాస్‌ (ఐపీఎస్‌, 1977లో పదవీ విరమణ)ను భారత ఎన్నికల సంఘం నియమించింది. ఈ హోదాలో, ఎన్నికల ఏర్పాట్లను, ముఖ్యంగా శాంతిభద్రతల అంశాలను ఆయన పర్యవేక్షిస్తారు.

    తన పదవీకాలం మొత్తంలో అత్యంత నిజాయితీపరుడిగా పేరుగడిచిన శ్రీ ఎం.కె.దాస్‌, మణిపూర్‌ డీజీపీగా పని చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన దిల్లీ శాసనసభ ఎన్నికలకు ప్రత్యేక పోలీసు పరిశీలకుడిగా సేవలందించారు. 2019లో త్రిపుర, మిజోరంలో జరిగిన లోక్‌సభ ఎన్నికలు, అదే ఏడాది ఝార్ఖండ్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలోనూ ఇదే హోదాలో విధులు నిర్వర్తించారు.

***


(రిలీజ్ ఐడి: 1665370) సందర్శకుల సూచీ సంఖ్య : : 197
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Manipuri , Tamil