ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆప్షన్ 1ను ఎంచుకున్న తమిళనాడు, రూ. 9,627 కోట్ల అదనపు రుణాన్ని సేకరించేందుకు అనుమతి
జిఎస్‌టి అమలు కారణంగా ఏర్పడిన లోటును భర్తీ చేసేందుకు రూ. 1.1 లక్షల కోట్లకు అదనంగా రూ. 78,452 కోట్లను సేకరించేందుకు 21 రాష్ట్రాలకు అనుమత
Posted On:
14 OCT 2020 4:49PM by PIB Hyderabad
బహిరంగ మార్కెట్ రుణాల ద్వారా రూ. 9,627 కోట్ల అదనపు మొత్తాన్ని సేకరించేందుకు ఆర్ధిక శాఖకు చెందిన డిపార్్టమెంట్ ఆఫ్ ఎక్్సపెండిచర్ (వ్యయ శాఖ) బుధవారం తమిళనాడుకు అనుమతినిచ్చింది. జిఎస్‌టి అమలు కారణంగా ఏర్పడిన లోటును భర్తీ చేసినందుకు ఆప్షన్ -1ని ఎంచుకుంటున్నట్టు ఆ రాష్ట్రం అధికారికంగా సమాచారమిచ్చిన తర్వాత ఈ అనుమతిని జారీ చేశారు. ఇప్పటివరకూ 21 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు, ఢిల్లీ, జమ్ము&కాశ్మీర్ సహా ఆప్షన్ -1 కోరాయి.
అదనపు మొత్తమైన రూ. 68,825 కోట్ల రుణాన్ని బహిరంగ మార్కెట్ రుణాల ద్వారా సేకరించేందుకు వ్యయ శాఖ మంగళవారం 20 రాష్ట్రాలకు అనుమతిని జారీ చేసింది. బుధవారం నాటి అనుమతితో మొత్తం 21 రాష్ట్రాలు రూ. 78, 542 కోట్ల మొత్తాన్ని సేకరించేందుకు అనుమతినిచ్చినట్టు అయింది.
జిఎస్‌టి అమలు కారణంగా ఏర్పడిన రెవిన్యూ లోటును భర్తీ చేసేందుకు రాష్ట్రాలు రూ. 1.10 లక్షల కోట్లు రుణంను మించి ప్రస్తుతం 21 రాష్ట్రాలకు ఇచ్చిన అనుమతి ఉంది. ఈ రుణ సేకరణ సౌలభ్యం కోసం ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక విండోను ఏర్పాటు చేస్తోంది.
ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన రెండు ప్రత్యామ్నాయాలలో మొదటిదానిని ఎంచుకున్న రాష్ట్రాల స్థూల దేశీయ ఉత్పత్తి (గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రాడక్ట్ -జిఎస్‌డిపి) కు 0.50% చొప్పున అదనపు రుణాన్ని సేకరించేందుకు అవకాశం ఇస్తుంది. ఆప్షన్ -1 నిబంధనల ప్రకారం, జిఎస్‌టి అమలు కారణంగా ఏర్పడిన లోటును భర్తీ చేసుకునేందుకు రుణాలు సేకరించేందుకు ప్రత్యేక విండో సౌకర్యం కలగడమే కాక, మే 17, 2020న భారత ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ కింద అనుమతించిన 2% అదనపు రుణాల సేకరణలో భాగంగా జిఎస్‌డిపిలో 0.50% అంతిమ ఇన్‌స్టాల్‌మెంట్‌ను రుణంగా తీసుకునేందుకు రాష్ట్రాలకు షరతులులేని అనుమతి ఉంది. ఇది స్పెషల్ విండో రూ.1.1 లక్షల కోట్లకన్నా ఎక్కువ.
మంగళవారం నాడు అనుమతి ఇచ్చిన రాష్ట్రాలలో ఆంధ్ర ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, ఒడిషా, సిక్కిం, త్రిపుర, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లు ఉన్నాయి.
***
(Release ID: 1664493)
Visitor Counter : 177