కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
శ్రీ గాంగ్వార్ బ్రిక్స్ మంత్రివర్గ శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగించారు; కార్యాలయ భద్రతా విధానాలను రూపొందించడానికి పిలుపు
డిజిటల్ ఎకానమీలో కార్మిక శక్తి యొక్క భవిష్యత్తు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు సవాళ్లకు సాధ్యమయ్యే మరియు స్థిరమైన పరిష్కారాలను కనుగొనడంలో కలిసి పనిచేయాలని శ్రీ బ్రిక్స్ ను కోరిన గాంగ్వార్
Posted On:
11 OCT 2020 6:22PM by PIB Hyderabad
ప్రత్యేకించి బ్రిక్స్ ద్వారా కార్మిక యజమాన్యాల మధ్య సమతుల్యతను పెంపొందించడానికి తగిన ప్రపంచ చర్య కోసం కార్మిక, ఉపాధి శాఖ మంత్రి (ఇంచార్జ్) శ్రీ సంతోష్ గంగ్వార, పిలుపునిచ్చారు, ఇది వృద్ధిని, ఎక్కువ ఉద్యోగాలను, మరింత కార్మిక సంక్షేమాన్ని కల్పిస్తుందని తెలిపారు.
2020 అక్టోబర్ 10 శుక్రవారం నాడు బ్రిక్స్ మంత్రిత్వ స్థాయి వర్చువల్ మీట్‌లో శ్రీ గంగ్వార్ మాట్లాడుతూ కార్మికుల శ్రేయస్సు కోసం భద్రత, ఆరోగ్యం, సంక్షేమం మరియు మెరుగైన పని వాతావరణం ఎంతో అవసరం అని అన్నారు. ఆరోగ్యకరమైన శ్రామికశక్తి- దేశంలో మరింత ఉత్పాదకత మరియు ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుందని ఆయన అన్నారు.
బ్రిక్స్ దేశాలలో సురక్షితమైన పని సంస్కృతిని కలిపించే విధానాలతో సహా వివిధ అంశాలపై చర్చించడానికి రష్యన్ ప్రెసిడెన్సీ క్రింద బ్రిక్స్ కార్మక, ఉపాధి మంత్రుల వర్చువల్ సమావేశం జరిగింది. ఐఎల్ఓ డైరెక్టర్ జనరల్ గై రైడర్, వర్కర్స్ మరియు ఎంప్లాయర్స్ ఆర్గనైజేషన్స్ ప్రతినిధులు కూడా హాజరయ్యారు.
కోవిడ్-19 ప్రభావాన్ని తగ్గించడానికి వృత్తిపరమైన భద్రత మరియు ఆరోగ్య చర్యల వంటి అంశాలు కూడా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని మంత్రి ఈ సందర్బంగా నొక్కిచెప్పారు.
కార్యాలయంలో వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం చురుకైన సమర్థవంతమైన విధాన చట్రాన్ని అందించడానికి, భారత పార్లమెంటు ఇటీవల 2020 లో వృత్తి భద్రత, ఆరోగ్యం మరియు పని పరిస్థితులపై కోడ్‌ను ఆమోదించినట్లు సమావేశానికి తెలియజేశారు. అన్ని రంగాలకు ఈ చట్టపరమైన నిబంధనలు విస్తరించినట్టు చెప్పారు. "ఉద్యోగుల కోసం తప్పనిసరి వార్షిక ఆరోగ్య తనిఖీ; త్రైపాక్షిక బోర్డు ద్వారా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించబడిన చలనశీల ఆరోగ్య ప్రమాణాలను రూపొందించడం; కఠినమైన భద్రతా చర్యలతో రాత్రిపూట కూడా అన్ని సంస్థలలో పనిచేయడానికి మహిళలకు ఆమె సమ్మతితోనే అనుమతించడం; యజమానిపై విధించిన జరిమానాలో కనీసం 50 శాతం బాధిత కార్మికునికి చెల్లించడం కోసం చట్టం ప్రకారం ఆమోదయోగ్యమైన పరిహారం మరియు భద్రతా నిబంధనల అమలును పర్యవేక్షించడానికి థర్డ్ పార్టీ ఆడిట్ కోసం అందించడం వంటివి ఈ నిబంధనల్లోని ముఖ్యాంశాలు" అని శ్రీ గాంగ్వార్ వివరించారు.
కార్మికులు మరియు యజమానుల భద్రతా కమిటీలతో సహా కొత్త భారత చట్టాలలో భద్రత కోసం నిబంధనలను వివరిస్తూ, శ్రీ గంగ్వార్ ఈ విధానాలను వివిధ బహుపాక్షిక వేదికలలో కూడా రూపొందించాలని బ్రిక్స్ కి పిలుపునిచ్చారు.
'సురక్షితమైన పని వాతావరణం మరియు ఆరోగ్యకరమైన శ్రామిక శక్తి యొక్క ముఖ్యమైన భాగం, అనిశ్చిత సమయాల్లో ఆర్థిక సహాయాన్ని అందించడానికి సార్వత్రిక సామాజిక భద్రతా కవరేజ్ లభ్యత అని నొక్కి చెప్పాలి. ఈ విషయంలో, సామాజిక భద్రతపై మేము ఇటీవల అమలు చేసిన కార్మిక చట్టం దేశంలోని మొత్తం 500 మిలియన్ల శ్రామిక శక్తికి సార్వత్రిక సామాజిక రక్షణ కోసం ఒక చట్రాన్ని అందించింది. అసంఘటిత కార్మికులు, వలస కార్మికులు, స్వయం ఉపాధి మరియు గిగ్ మరియు ప్లాట్‌ఫామ్ వర్కర్ల వంటి కొత్త రకాల ఉద్యోగాలతో సంబంధం ఉన్నవారికి సామాజిక భద్రత కల్పించే పథకాలను రూపొందించడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాము.' అని కేంద్ర మంత్రి వివరించారు.
సామాజిక, ఆర్థిక పరివర్తన ద్వారా పేదరికాన్ని తగ్గించడంపై మరో సెషన్‌లో మాట్లాడుతూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు మరియు మారుతున్న ప్రపంచంలో శ్రేయస్సును ప్రోత్సహించడానికి కట్టుబడి ఉందని శ్రీ గంగ్వార్ అన్నారు.
ఆర్థిక చేదోడు, అత్యంత బలహీన పౌరులు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను పొందడం, వారికి ఉచిత ఆరోగ్య బీమాను అందించడం, 80 మిలియన్ల మంది ఆర్థికంగా బలహీనవర్గాల వారిడి సబ్సిడీతో శుభ్రమైన వంటగ్యాస్ అందించడం వంటి అనేక ప్రాథమిక సేవలను కవర్ చేయడం ద్వారా పేదరికాన్ని నిర్ములన కార్యక్రమాలను బహుముఖ వ్యూహంతో అవలంబించడం గురించి ఆయన వివరించారు. అందరికీ సురక్షితమైన గృహాలసార్వత్రిక కార్యక్రమం, సుమారు 26 మిలియన్ల గృహాలకు ఉచిత విద్యుత్, 5.5 మిలియన్ల గృహాలకు త్రాగునీటి సరఫరా మరియు 106 మిలియన్లకు పైగా గృహ మరుగుదొడ్ల నిర్మాణం ద్వారా ప్రాథమిక పారిశుద్ధ్య చర్యలు చేపట్టడంతో పాటు రైతులకు నేరుగా ఆర్థిక సహాయం చేసే ఒక పథకం కూడా అమలు చేశాం, ఇది ఇప్పటికే దాదాపు 111.7 మిలియన్ల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చింది.
అవసరమైన వారికి ఉపాధి, సామాజిక రక్షణ కల్పించడానికి వివిధ పథకాలను అమలు చేస్తున్నాం అని ఆయన వివరించారు. వీటిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, నైపుణ్య శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రారంభించిన జాతీయ జీవనోపాధి మిషన్ ఉన్నాయి. "చిన్న మరియు సూక్ష్మ వ్యాపార సంస్థలు మరియు వ్యక్తులకు హామీ అవసరం లేని రుణాలను విస్తరించడం ద్వారా స్వయం ఉపాధి కల్పించబడింది" అని మంత్రి తెలిపారు.
జాతీయ మరియు అంతర్జాతీయంగా కూడా మూలాలు ఉన్న పేదరికం ఒక క్లిష్టమైన సమస్య అని పేర్కొన్న ఆయన, ఇది ప్రస్తుత సమయములో, ఇది సమయానుకూలంగా మరియు సందర్భోచితంగా ఉంది కాబట్టి ఈ ఎజెండాను మంత్రుల ప్రకటన పత్రంలో స్థానం కల్పించడం ముదావహం అని ఆయన అన్నారు. పేదరికాన్ని ఎదుర్కోవడంలో పటిష్ఠమైన విధానాలు అమలు చేయడానికి బ్రిక్స్ దేశాలు కలిసి పనిచేస్తాయి ”అని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
'డిజిటల్ ఎకానమీలో కార్మిక భవిష్యత్తు' అనే అంశంపై శ్రీ గంగ్వార్ మాట్లాడుతూ, డిజిటలైజేషన్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వంటి సాంకేతిక పురోగతులు మన జీవితాన్ని, పనిని వేగంగా మారుస్తున్నాయన్నారు. ఈ మార్పులన్నీ కార్మిక రంగంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి, కోవిడ్-19 కింద, ప్రపంచం ఐసొలేషన్ లోకి వెళ్లిపోయిందని ఆయన అన్నారు. ఈ పరిస్థితిలో, మారుతున్న దృష్టాంతాన్ని ఎదుర్కోవటానికి ప్రభుత్వాలు, వ్యక్తులు మరియు వ్యాపారాలకు డిజిటలైజేషన్ అవకాశం కల్పిస్తుందని మంత్రి నొక్కి చెప్పారు.
ఇప్పటికే ప్రారంభమైన ఆర్థిక వ్యవస్థ యొక్క డిజిటలైజేషన్ వైపు నమూనా మార్పు, ప్రస్తుత పరిస్థితుల గమనాన్ని మరింత వేగవంతం చేశాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడు డిజిటల్ ఎకానమీ కొత్తగా జరిగిన మార్పులో అంతర్భాగం అయిపోయిందన్నారు. టెలివర్క్ టెలిమెడిసిన్, ఫుడ్ డెలివరీ మరియు లాజిస్టిక్స్, ఆన్‌లైన్ మరియు కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు, రిమోట్ లెర్నింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ వంటి సాంకేతిక ఆవిష్కరణలు చోటుచేసుకున్నాయని తెలిపారు. "బలమైన మరియు నమ్మదగిన డిజిటల్ మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావడంతో, భారతదేశం, ప్రపంచ మరియు స్థానిక వ్యాపారాలకు ఆకర్షణీయమైన అవకాశాన్ని అందిస్తుంది మరియు కొత్త ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుంది" అని శ్రీ గంగ్వార్ అన్నారు.
గిగ్ వర్క్ మరియు ప్లాట్‌ఫాం వర్క్ వంటి కొత్త రకాలైన డిజిటల్ ఎకానమీని సృష్టించడం గురించి ప్రస్తావిస్తూ, ఇది ఒక కొత్త కార్మికుల ఉద్యోగ సంబంధాలకు దారితీసిందని, ఇక్కడ ఒక కార్మికుడు బహుళ యజమానులతో నిమగ్నమై ఉంటాడు, తద్వారా సామాజిక రక్షణ మరియు ఇతర సంక్షేమ ప్రయోజనాల కల్పనలో సంక్లిష్టత వస్తుంది అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
సాంఘిక భద్రతపై కొత్త భారతీయ చట్టం అగ్రిగేటర్, గిగ్ వర్కర్ మరియు ప్లాట్‌ఫాం వర్కర్ వంటి పదాలను నిర్వచించడం ద్వారా ఈ వర్ధమాన రూపాలను గుర్తిస్తుందని మరియు అటువంటి కార్మికులకు ప్రత్యేక సామాజిక భద్రతా నిధి ద్వారా సామాజిక రక్షణను విస్తరిస్తుందని, ఇందులో అగ్రిగేటర్ల నుండి ఆర్థిక సహాయం జమ అవుతుందని ఆయన తెలియజేశారు. .
సాంకేతిక పురోగతి మరియు డిజిటలైజేషన్ కూడా సమ్మతి యంత్రాంగాన్ని సరళీకృతం చేయడానికి మరియు కార్మిక చట్టాల అమలుకు సహాయపడుతుందని ఆయన అన్నారు. "కార్మిక మార్కెట్ వ్యవస్థలో పారదర్శకత మరియు జవాబుదారీతనం ఉండేలా, మేము ఆన్‌లైన్ తనిఖీ వ్యవస్థను మరియు పారిశ్రామిక వివాదాల పరిష్కారాన్ని ప్రవేశపెట్టాము. ఈ దృష్టాంతాలు కార్మికుల హక్కులను పరిరక్షించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని విజయవంతంగా ఉపయోగించడాన్ని సూచిస్తున్నాయి" అని శ్రీ గంగ్వార్ అన్నారు.
డిజిటల్ ఎకానమీ కోసం మా శ్రామిక శక్తిని సిద్ధం చేస్తున్నప్పుడు, స్థిరమైన, సమగ్ర మరియు స్థిరమైన ఆర్థిక వృద్ధి, పూర్తి మరియు ఉత్పాదక ఉపాధి మరియు అందరికీ మంచి పనిని ప్రోత్సహించే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 8 ను మనం కోల్పోకూడదు. పని యొక్క సమగ్ర భవిష్యత్తుకు మన విధానం కార్మిక మార్కెట్‌కు సమాన ప్రాప్తి, సమాన పనికి సమాన వేతనం, సమాజంలోని అన్ని వర్గాల సమాన భాగస్వామ్యం మరియు కార్మికులందరికీ సామాజిక రక్షణను కలిగి ఉండాలి. డిజిటల్ ఎకానమీ పని ప్రపంచాన్ని మారుస్తోందని మంత్రి నొక్కిచెప్పారు, అందువల్ల బ్రిక్స్ నెట్‌వర్క్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ల క్రమం తప్పకుండా అధ్యయనాలు భవిష్యత్తులో పని యొక్క అంశాలను బాగా అర్థం చేసుకోవడానికి మరియు విధాన రూపకల్పనకు అనుబంధంగా ఉంటాయి. "డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో శ్రామిక శక్తి యొక్క భవిష్యత్తు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు సవాళ్లకు సాధ్యమయ్యే మరియు స్థిరమైన పరిష్కారాలను కనుగొనడంలో మనమందరం కలిసి పనిచేయాలి, తద్వారా వారి ప్రాథమిక హక్కులకు రాజీ పడకుండా శ్రామిక శక్తికి అనువైన ఉపాధి అవకాశాలను పెంపొందించవచ్చు" అని శ్రీ గాంగ్వార్ తెలిపారు.
***
(Release ID: 1663623)
Visitor Counter : 216