వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
అన్ని రాష్ట్రాలలో వరి సేకరణ మొత్తం గత సంవత్సరం 17.7 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 48% పెరిగి ఈ ఏడాది 08.10.2020 నాటికి 26.3 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది.
Posted On:
09 OCT 2020 5:02PM by PIB Hyderabad
భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో వరి సేకరణ మొత్తం గత సంవత్సరం 17.7 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా అది ఈ ఏడాది 08.10.2020 నాటికి
48 శాతం పెరిగి 26.3 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది.
ప్రస్తుతం కొనసాగుతున్న ఖరీఫ్ సీజన్ వరిసేకరణలో పంజాబ్ రాష్ట్రం అపూర్వ వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది ఆ రాష్ట్రంలో 1.76 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ ఉండగా.. అది ఏడాది 08.10.2020 నాటికి 15.99 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 900శాతం ఎక్కువ.
ఇక తమిళనాడులో 08.10.2019 నాటికి 320 మెట్రిక్ టన్నులు ఉండగా.. ప్రస్తుతం కొనసాగుతున్న ఖరీఫ్ సీజన్‌లో అది 9517 మెట్రిక్ టన్నులకు పెరిగింది. ఉత్తరప్రదేశ్‌లో 2020-21 ఖరీఫ్ సీజన్ వరి సేకరణ 4423 మెట్రిక్ టన్నులుగా ఉంది. గత ఏడాది అక్టోబర్ 8 నాటికి అది 92 మెట్రిక్ టన్నులు మాత్రమే. ఆ రెండు రాష్ట్రాలు ఈ ఏడాది వరిసేకరణలో గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి.
***
(Release ID: 1663189)
Visitor Counter : 104