నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ

భార‌త్‌ను ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగాను, స్వావలంబన క‌లిగిన దేశంగాను నిలిపేందుకు స్కిల్లింగ్, రీ-స్కిల్లింగ్, అప్-స్కిల్లింగ్, ఇండస్ట్రీ-కనెక్ట్ స్కిల్లింగ్ అవ‌స‌రంః డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే

Posted On: 07 OCT 2020 6:18PM by PIB Hyderabad

పీహెచ్‌డీ ఛాంబర్ 115వ వార్షిక సమావేశం సంద‌ర్భంగా భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ తరపున, త‌న త‌ర‌పున కేంద్ర‌ నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత శాఖ మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే ఛాంబ‌ర్‌ను అభినందించారు. గౌరవ‌ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోడి నాయకత్వాన్ని డాక్ట‌ర్ మహేంద్రనాథ్ పాండే ఈ సంద‌ర్భంగా  ప్రస్తుతించారు. అత్యంత కఠినమైన కోవిడ్‌ సమయంలో చేపట్టిన విస్తృతమైన చర్యల‌ను మంత్రి ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా ప్రశంసించారు. డాక్టర్ పాండే మాట్లాడుతూ స్కిల్ ఇండియా అనే భావ‌న‌ దేశంలోనూ, దేశం వెలుపల ఒక పాదముద్రను రూపొందిస్తోంద‌ని అన్నారు. కోవిడ్ మహమ్మారి విస్త‌రించిన గ‌త ఏడు నెలల్లో ప్రతి రాష్ట్ర మరియు జిల్లాలోని మన విద్య మరియు నైపుణ్య విభాగంలో భాగ‌స్వామ్యంగా ఉన్న పర్యావరణ వ్యవస్థలు వినూత్న ఆలోచనలతో త‌గు విధంగా సహకరించడానికి ముందుకు వచ్చాయని అన్నారు. భార‌త్‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగాను, స్వావలంబన దేశంగా మార్చడానికి, ముందుకు సాగడానికి స్కిల్లింగ్ (నైపుణ్య‌త‌), రీ-స్కిల్లింగ్ (పున‌ర్ నైపుణ్య‌త‌) మరియు అప్-స్కిల్లింగ్ (నైపుణ్య‌త స్థాయి పెంపు), నైపుణ్య శిక్షణా కేంద్రాలు, ఇండస్ట్రీ కనెక్ట్ స్కిల్లింగ్ (ప‌రిశ్ర‌మ‌ల‌తో అనుసంధానించ‌బ‌డిన నైపుణ్య‌త‌) మరియు ఇండస్ట్రీ డిమాండ్ స్కిల్లింగ్ (ప‌రిశ్ర‌మ‌ల డిమాండ్ క‌లిగిన నైపుణ్య‌త) ఎంతో ముఖ్యం అ‌ని మంత్రి మహేంద్రనాథ్ పాండే అభిప్రాయ‌ప‌డ్డారు.'ఆత్మ నిర్భర్ స్కిల్డ్ ఎంప్లాయీ ఎంప్లాయర్ మ్యాపింగ్‌' (అసీమ్‌) యొక్క ప్రాముఖ్యత గురించి పాండే ప్ర‌ధానంగా ప్రస్తావించారు. ఈ రంగాలలో నైపుణ్యం మరియు శ్రామిక శక్తి యొక్క డిమాండ్-సరఫరా అంతరాన్ని త‌గ్గిస్తుంద‌ని అన్నారు. కేంద్ర నైపుణ్యం అభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖకు మద్దతివ్వడంలో పీహెచ్‌డీ ఛాంబర్ మొత్తంగా గణనీయమైన పాత్ర పోషిస్తుందని మంత్రి మహేంద్రనాథ్ పాండే అన్నారు. స్కిల్డ్ ఇండియా మిష‌న్‌, మేటి ఆర్థిక పథం, స్వావలంబనను క‌లిగిన‌ భారత్‌ను తీర్చిదిద్దే విష‌య‌మై త‌మ మంత్రిత్వ శాఖ‌కు ఛాంబ‌ర్ త‌గిన తొడ్పాటు అందిస్తోంద‌ని అన్నారు. భారత్‌ను ప్రపంచ నైపుణ్య‌త రాజధానిగా

 


తీర్చిదిద్దాల‌నే దృష్టితో నైపుణ్య అభివృద్ధి, వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ 2014-15 నుండి దేశంలో ఐదు కోట్ల మందికి పైగా ప్రజలను నైపుణ్యత శ‌క్తిగా మార్చడానికి గాను కృషి చేసింద‌ని అన్నారు. అలాగే, నైపుణ్య‌త అభివృద్ధికి గాను మంత్రిత్వ శాఖ వివిధ దేశాలతో నైపుణ్య అభివృద్ధిపై వివిధ ర‌కాల అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. భారత‌ యువత నైపుణ్యతకు ప్రపంచంలోనే గుర్తింపుతేవ‌డం అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రాంను విస్తరించడం వంటివి ఇందులో భాగంగా ఉన్నాయి.
                               

****



(Release ID: 1662499) Visitor Counter : 182