విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

సైబర్ సెక్యూరిటీ రంగంలో సహకారానికి ఉద్దేశించిన ఒప్పందం పై భారతదేశం, జపాన్ సంతకాలు

Posted On: 07 OCT 2020 4:34PM by PIB Hyderabad

భారతదేశం, జపాన్ సైబర్ సెక్యూరిటీ రంగం లో సహకారానికి ఉద్దేశించిన ఒక ఒప్పందాన్ని (ఎమ్ఒసి) కుదుర్చుకోవడానికి గాను అవసరమైన సంతకాలు చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఈ ఒప్పందం (ఎమ్ఒసి) రెండు పక్షాల ప్రయోజనాలు ముడిపడి ఉండే రంగాల్లో సహకారాన్ని ఇనుమడింపచేసుకొనేందుకు తోడ్పడనుంది.  ఉభయ పక్షాల ప్రయోజనాలు ఇమిడి ఉన్న రంగాల్లో..సైబర్ జగతి, కీలక మౌలిక సదుపాయాల పరిరక్షణ, సాంకేతికతలకు సంబంధించిన సహకారం; సైబర్ భద్రత కు ఎదురయ్యే ముప్పుల/ అటువంటి ఘటనల, సైబర్ ప్రపంచం లో  దురుద్దేశపూర్వక చర్యల తాలూకు సమాచారాన్ని, అలాగే సైబర్ రంగంలో నూతనంగా ఆవిర్భవిస్తున్న కార్యకలాపాలను గురించి రెండు దేశాలు ఒక దేశానికి మరొక దేశం పరస్పరం వెల్లడించుకోవడం తో పాటు అటువంటి దాడులను దీటుగా నిలువరించగలిగిన అభ్యాసాలను ఒక పక్షానికి మరొక పక్షం ఇచ్చి, పుచ్చుకోవడం; ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసిటి) కి సంబంధించిన మౌలిక సదుపాయాల భద్రతకు ఎదురయ్యే సైబర్ బెదరింపులను తగ్గించడంలో ఆచరణాత్మక సహకారానికి ఉద్దేశించిన యంత్రాంగాలను రెండు దేశాలు కలసి అభివృద్ధిపరచడం వంటివి..  కొన్ని.

దాపరికానికి తావు ఉండని, అంతర సంచాలితంగా ఉండే, స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షికమైన, సురక్షితమైన, విశ్వసనీయమైన సైబర్ స్పేస్ వాతావరణం, అలాగే నూతన ఆవిష్కరణలకు, ఆర్థిక అభివృద్ధికి, వ్యాపార- వాణిజ్యాలకు ఒక చోదక శక్తి లాగా ఇంటర్ నెట్ ను ప్రోత్సహించాలని భారత్, జపాన్ లు కట్టుబడ్డాయి. ఈ కట్టుబాటు ఈ రెండు దేశాల్లోని సంబంధిత దేశీయ చట్టాలకు, అంతర్జాతీయ బాధ్యతలకు, వాటి విస్తృత వ్యూహాత్మక భాగస్వామ్యాలకు అనుగుణంగా ఉంటుంది. 
 
ఎమ్ఒసి ద్వారా ఇరు పక్షాలు.. ఐక్య రాజ్య సమితి సహా అంతర్జాతీయ వేదికలలో సహకారం, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసిటి) ఉత్పత్తుల సరఫరా వ్యవస్థ సమగ్రత ను దృష్టి లో పెట్టుకొని సర్వోత్తమ పద్ధతులను ప్రోత్సహించే; చర్చలను, వ్యూహాలను పరస్పరం వెల్లడించుకొనే; ప్రభుత్వం నుంచి ప్రభుత్వం పరమైన, వ్యాపారం నుంచి వ్యాపారం పరమైన సహకార మాధ్యమం ద్వారా ఐసిటి మౌలిక సదుపాయాల భద్రతను పటిష్టపరచే; ఇంటర్ నెట్ గవర్నెన్స్ వేదికలలో నిరంతరం సంభాషణలు జరుపుతూ, సంప్రదించుకొంటూ ఆయా వేదికలలో ఉభయ దేశాలకు చెందిన అందరు స్టేక్ హోల్డర్స్ నుంచి క్రియాశీల భాగస్వామ్యాన్ని సమర్థించేందుకు కూడా.. ముందడుగు వేశాయి.

 

***



(Release ID: 1662426) Visitor Counter : 159