వ్యవసాయ మంత్రిత్వ శాఖ

"సమగ్ర వ్యవసాయం కోసం వివరాల నమోదు" అనే అంశంపై భారత వ్యవసాయ పరిశోధనా మండలి ( ఐ సి యం ఆర్ ) వైభవ్ సదస్సు

సెన్సార్లు, రిమోట్ సెన్సింగ్, పరిశోధనలు, కృత్రిమ మేధస్సు మరియు ఐ ఓ టి ని ఉపయోగించి మట్టి, మొక్కలు మరియు పర్యావరణ నాణ్యతను తెలుసుకొని పర్యవేక్షించడం ద్వారా ఉత్పత్తిని అధికం చేసే లక్ష్య సాధన. " సమగ్ర వ్యవసాయం " పై దృష్టి.

Posted On: 06 OCT 2020 7:37PM by PIB Hyderabad

" సమగ్ర వ్యవసాయం కోసం సెన్సార్లు మరియు సెన్సింగ్" పేరిట భారత వ్యవసాయ మండలి " సమగ్ర వ్యవసాయం " అనే అంశంపై సదస్సును నిర్వహించింది. 2020  అక్టోబర్ 5 న వైశ్విక్ భారతీయ వైగ్యనిక్ ( వైభవ్ )లో భాగంగా జరిగిన ఈ సదస్సులో 38 మంది నిపుణులతో సహా 1019 మంది పాల్గొన్నారు. ఆలోచనలు, అమలులో వున్నా పద్ధతులు, దేశ విదేశాలలో శాస్త్రవేత్తలు / విద్యావంతులు సాగిస్తున్న పరిశోధన అధివృధి ఫలితాలను ఒక వేదిక మీదకి తెచ్చి చర్చలు, సమావేశాల ద్వారా ఆత్మనిర్భర్  భారత్ ను అమలు చేయడానికి అవసరమయిన సమగ్ర ప్రణాలికను రూపొందించాలన్న భారత ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ సదస్సును నిర్వహించడం జరిగింది.

సదస్సులో చర్చిండానికి 18 అంశాలను గుర్తించారు. వీటిలో  " వ్యవసాయ ఆధారిత అరిధిక వ్యవస్థ మరియు ఆహార భద్రత "అనే అంశం వ్యవసాయ కార్యకలాపాలతో ప్రత్యక్ష సంభంధం కలిగి ఉంది " సమగ్ర వ్యవసాయం" అనే అంశంలో ఇటీవల కాలంలో సెన్సార్లు, రిమోట్ సెన్సింగ్, విషయ అవగాహన, కృతిమ మేధస్సు మరియు ఐ ఓ టిలను " సమగ్ర వ్యవసాయం" ద్వారా వ్యవసాయం దిగుబడిని అధికం చేయడానికి మట్టి, మొక్కలు, పర్యావరణ అంశాలను పరిశీలించి మెరుగైన విధానాలను రూపొందించడానికి ప్రాధాన్యత ఇస్తుంది. సదస్సు కోఆర్డినేటర్ గా ఐ సి ఏ ర్ -ఐ ఏ ఆర్ ఐ ఎస్ చెందిన డాక్టర్ రబి ఎన్ సాహూ వ్యవహరించారు. బెంగళూరు వ్యవసాయం శాస్త్రాల విశ్వవిద్యాలయంకి చెందిన ప్రొఫెసర్ ఎం. ఉదయ్ కుమార్, న్యూఢిల్లీకి చెందిన ఇండియా వాటర్ మేనేజిమెంట్ కి చెందిన డాక్టర్ అలోల్ సిక్కి వివిధ అంశాలపై జరిగిన సదస్సులకు అధ్యక్షత వహించగా ఐ సి టి, ఐ సి ఏ ఆర్ ఏ డ్ జి డాక్టర్ అనిల్ రాయ్ సదస్సుకు సహా అధ్యక్షునిగా వ్యవహరించారు.

సమగ్ర వ్యవసాయాన్ని చేపట్టడానికి అవసరమైన పనిముట్లు, పర్యావరణహిత సెన్సె ఆధారిత విధానాలపై ఐ సి ఏ ఆర్ - భారత వ్యవసాయ పరిశోధన సంస్థ నుంచి డాక్టర్,సి. విశ్వనాథన్, అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సింధుజా శంకరన్ మాట్లాడారు. వైర్ లెస్  సెన్సార్ నెటవర్క్, ఐ ఓ టీ సాంకేతిక అంశాలు, సమగ్ర వ్యవసాయంలో వీటి ఉపయోగాలపై హైదరాబాద్ ఐ ఐ టి కి చెందిన ప్రొఫెసర్ బి దేశాయ్. అమెరికాలోని యూనివర్సిటీ అఫ్ కాలిఫోర్నియా నుంచి వచ్చిన ప్రొఫెసర్. ప్రశాంత్ మహాపాత్ర ప్రసంగించారు. మట్టి నాణ్యత పంటల నాణ్యతను గమనించి పర్యవేక్షించడానికి డ్రోన్ రిమోట్ సెన్సింగ్ తో సహా ఇతర సాంకేతిక అంశాలపై డాక్టర్ రబి ఎన్ సాహూ ( ఐ సి ఏ ఆర్ - భారత వ్యవసాయా పరిశోధనా సంస్థ ), డాక్టర్ చంద్రశేఖర్ బిరదర్ ( ఐ సి ఏ ర్ డ్ ఏ - సిజిఐఏర్), విదేశీ ప్రతినిధులు ప్రొఫెసర్ ధర్మేంద్ర సరస్వత్ ( purdue యూనివర్సిటీ ), ప్రొఫెసర్ రాజీవ్ ఖోస్లా ( కొలరాడో స్టేట్ యూనివర్సిటీ, అమెరికా) డాక్టర్ లవ్ ర్ ఖోట్( వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ) ప్రసంగించారు.

ప్రతి సదస్సు;ఓ నిపుణులతో చర్చలు జరిగాయి. చర్చల్లో కొన్ని సమస్యలను గుర్తించడం జరిగింది. (1 )  తక్కువ ఖర్చుతో స్వదేశీ సమగ్ర వేదికలను ఏర్పాటు చేసి రోబోటిక్స్, ఐ ఓ టి, wsnల ద్వారా పొలాలు, మట్టి మరియు పంటల నాణ్యతను పరీక్షిండానికి చర్యలు తీసుకోవడం,(2 ) ఒత్తిడి, వివక్షతను ముందుగా గుర్తించి సరైన యాజమాన్య విధానాలను రూపొందించడం ( 3 ) యూఏవీల ద్వారా వివిధ రకాల సెన్సార్లు, డేటా అనలిటిక్స్ ను వుపయోగించి పంటల వాస్తవ పరిస్థిని గుర్తుంచి నిర్వహించడం ( 4 ) భారత వ్యవసాయ రంగానికి సరిపోయి అందుబాటులో ఉండే వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాలను కూపొందిచడం ముఖ్యమని సదస్సులో గుర్తించడం జరిగింది.  ఈ లోటుపాట్లను సవరించి అవసరమయిన ప్రణాళికలను రూపొందించడానికి విద్య పరిశోధన మరియు సామర్ధ్య పెంపుదల కోసం అమెరికాకు చెందిన విశ్వవిద్యాలయాలు వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ అఫ్ కాలిఫోర్నియా , Perdue యూనివర్సిటీ, యూనివర్సిటీ అఫ్ కొలరాడోలతో కలసి పనిచేయాలని నిర్ణయించడం జరిగింది.

***

 

 (Release ID: 1662265) Visitor Counter : 234